E-Paper
Advertisement

మార్కెట్‌లోకి ఆసుస్ జీ16 కొత్త మోడల్ లాంచ్..పూర్తి వివరాలివిగో!

మార్కెట్‌లోకి ఆసుస్ జీ16 కొత్త మోడల్ లాంచ్..పూర్తి వివరాలివిగో!
Advertisement

Asus ROG Zephyrus G16 2026: గేమింగ్ ల్యాప్‌ టాప్‌ల మార్కెట్లో ‘ఆసుస్ ROG’ సిరీస్‌కు ఉండే క్రేజే వేరు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో గేమర్స్‌ను అలరించే ఈ సంస్థ తాజాగా తన సరికొత్త Asus ROG Zephyrus G16 (2026) మోడల్‌ను మార్కెట్లోకి తీసుకు వచ్చింది. అయితే డిజైన్ పరంగా పెద్దగా .. మార్పులు లేకుండా కేవలం హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్స్‌తో వచ్చిన ఈ ల్యాప్‌ టాప్ ధర మాత్రం భారీగా పెరిగింది. టెక్ ప్రపంచంలో.. సంచలనం సృష్టిస్తున్న ఈ ప్రీమియం ల్యాప్‌టాప్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

డిజైన్, లుక్:

ఈ ల్యాప్‌ టాప్ డిజైన్ పరంగా చూస్తే.. దాదాపు గత ఏడాది మోడల్‌లానే కని పిస్తుంది. సన్నని అల్యూమినియం ఛాసిస్, తేలికైన బరువు, టాప్ ప్యానెల్‌పై ఉండే సిగ్నేచర్ క్రాస్ క్రోమ్ స్ట్రిప్ దీనికి స్టైలిష్ లుక్‌ను ఇస్తాయి. దీన్ని ఎక్కడికైనా ఈజీగా బ్యాగ్‌లో వేసుకుని తీసుకెళ్లొచ్చు. అయితే.. ఈ డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయక పోవడం కొద్దిగా నిరాశ కలిగించినా, బిల్డ్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది.

ధర :

Advertisement

ఈ ల్యాప్‌ టాప్ బేస్ వేరియంట్ ధర ఇండియన్ మార్కెట్లో దాదాపు రూ. 4,29,990 నుంచి ప్రారంభం అవుతుంది. హై-ఎండ్ గ్రాఫిక్స్ వేరియంట్ల వైపు వెళ్తే ధర ఇంకా పెరుగుతుంది. గత మోడళ్లతో పోలిస్తే హార్డ్‌వేర్‌లో చిన్నపాటి మార్పులు మాత్రమే చేసి, ధరను మాత్రం భారీగా పెంచడంపై టెక్ నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సామా సాధారణ గేమర్స్‌కు ఇది కాస్త అందనంత ఎత్తులోనే ఉంటుందనే చెప్పాలి.

అద్భుతమైన 2.5K డిస్‌ప్లే :

ఈ ల్యాప్‌టాప్ మెయిన్ హైలైట్ దాని డిస్‌ప్లే అనే చెప్పాలి. ఇందులో 16 అంగుళాల 2.5K డిస్‌ప్లేను అందించారు. ఇది 240Hz రిఫ్రెష్ రేట్ , 0.2ms రెస్పాన్స్ టైమ్‌తో వస్తుంది. దీని వల్ల గేమింగ్ ఆడేటప్పుడు లేదా సినిమా చూసేటప్పుడు విజువల్స్ చాలా స్మూత్‌‌గా, క్రిస్టల్ క్లియర్‌గా కనిపిస్తాయి. అంతే కాకుండా దీని గరిష్ట బ్రైట్‌నెస్ 1100 నిట్స్ వరకు ఉండటం వల్ల బయట వెలుతురులో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది.

ఇంటెల్, ఎన్విడియా పవర్:

Advertisement

ఈ కొత్త G16 ల్యాప్‌టాప్‌లో పవర్ ఫుల్ ప్రాసెసర్‌ను వాడారు. దీనికి తోడు గ్రాఫిక్స్ కోసం లేటెస్ట్ GPU సపోర్ట్ లభిస్తుంది. దీని వల్ల ఏ రకమైన హెవీ ట్రిపుల్-A గేమ్‌లయినా ఎలాంటి లాగ్ లేకుండా సూపర్ స్మూత్‌గా రన్ అవుతాయి. అలాగే వీడియో ఎడిటింగ్, 3D రెండరింగ్ వంటి ప్రొఫెషనల్ క్రియేటర్ పనులకు కూడా ఇది అద్భుతంగా పని చేస్తుంది.

Also Read: రూ.436కే జేబీఎల్ బ్లూటూత్ స్పీకర్..ఎగబడి కొంటున్న జనం

కూలింగ్, బ్యాటరీ లైఫ్:

హెవీ గేమ్స్ ఆడేటప్పుడు ల్యాప్‌ టాప్ వేడెక్కడం సహజం. అయితే ఆసుస్ ఇందులో బెస్ట్ టెక్నాలజీని వాడింది. టర్బో మోడ్‌లో ఫ్యాన్స్ కొంచెం పెద్ద సౌండ్ చేసినప్పటికీ, థర్మల్స్ బాగానే మేనేజ్ చేయబడతాయి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. సాధారణ ప్రొడక్టివిటీ పనులకు ఇది మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. అంతే కాకుండా ఇది ప్రయాణాల్లో ఉన్నవారికి చాలా ఉపయోగ పడుతుంది.

మొత్తంగా చూస్తే.. ఈ మోడల్ అనేది ఒక అద్భుతమైన, పవర్ ఫుల్ గేమింగ్ , క్రియేటర్ ల్యాప్‌టాప్. అయితే దీని ధర సుమారు రూ. 4.3 లక్షలకు పైగా ఉండటం సామాన్యులకు భారంగా మారుతుంది. బడ్జెట్ గురించి ఆలోచించకుండా బెస్ట్ పర్ఫార్మెన్స్, అల్ట్రా-స్లిమ్ డిజైన్ కోరుకునే హై-ఎండ్ యూజర్లకు మాత్రమే ఇది చాలా బాగా ఉపయోగ పడుతుంది.

Related News

ఇంత వరకూ ఏ స్మార్ట్ వాచ్‌లో..లేని ఫీచర్లతో కొత్త మోడల్

దీపావళి స్పెషల్.. ఇంటికి గ్రాండ్ లుక్ ఇచ్చే.. చౌకైన ఎల్‌ఈడీ స్ట్రింగ్ లైట్స్!

మార్కెట్‌లో దుమ్ములేపుతున్నఇయర్ బడ్స్..ఇలాంటి మోడల్ ఒక్కటైనా ఉండాలి

‘ఏఐ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2026’ వేడుక.. చీఫ్ గెస్ట్ గా హ్యూమనాయిడ్ రోబోట్!

రష్యా ల్యాబ్‌లో బాక్టీరియా లీక్.. 28 ఏళ్ల ఉద్యోగిని మృతి.. ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త ‘ప్లేగ్’ భయం!

రూ.436కే జేబీఎల్ బ్లూటూత్ స్పీకర్..ఎగబడి కొంటున్న జనం

ఆఫర్ ధర కన్నా లాంచ్ ధరే తక్కువ.. స్మార్ట్‌ఫోన్ సేల్స్ వెనుక పెద్ద స్కెచ్, కొనేముందు జాగ్రత్త!

Big Stories

Advertisement
×