CMF Watch Pro 2: ప్రస్తుత ట్రెండ్‌లో స్మార్ట్ వాచ్‌లు కేవలం టైం చూసుకోవడానికి మాత్రమే కాదు, మన ఆరోగ్యన్ని కాపాడుకోవడానికి అంతే కాకుండా స్టైలిష్ లుక్ కోసం ఒక ప్రధాన యాక్ససరీగా మారిపోయాయి. మార్కెట్లో.. ఎన్నో బ్రాండ్లు ఉన్నప్పటికీ, యూనిక్ డిజైన్‌తో యూత్‌ను విపరీతంగా ఆకర్షిస్తున్న బ్రాండ్ ‘నథింగ్’. తాజాగా ఈ సంస్థ సబ్-బ్రాండ్ అయిన CMF నుంచి వచ్చిన అద్భుతమైన స్మార్ట్ వాచ్ ఇప్పుడు టెక్ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ట్రెండింగ్ గాడ్జెట్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వాచ్ అతి పెద్ద హైలైట్ దాని డిస్‌ప్లే. ఇందులో.. 1.32 ఇంచుల డిస్ ప్లేను అందించారు. దీని వల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా, బ్రైట్‌గా కనిపిస్తుంది. దీనికి తోడు ఇందులో.. ఆటో బ్రైట్ నెస్ ఫీచర్ ఉండటం వల్ల చుట్టు పక్కల ఉండే వెలుతురును బట్టి స్క్రీన్ లైట్ ఆటో మేటిక్‌గా సర్దు బాటు అవుతుంది. ఇది బ్యాటరీని ఆదా చేయడంలో కూడా చాలా బాగా సహాయ పడుతుంది.
టెక్నాలజీ మారుతున్న కొద్దీ వాచ్‌లను వాడే విధానం కూడా మారుతోంది. ఇందులో జెస్చర్ కంట్రోల్ ఫీచర్ ఇచ్చారు. అంటే..వాచ్‌ను తాకకుండానే కేవలం చేతి కదలికల ద్వారా కొన్ని కాల్స్‌ను కంట్రోల్ చేయడం లేదా నోటిఫికేషన్లను చూసే అవకాశం కూడా ఉంటుంది.ఇది యూజర్లకు ఒక ఫ్యూచరిస్టిక్ ఫీల్ ఇస్తుంది.
రోజూ జిమ్‌కి వెళ్లే వారికి లేదా వ్యాయామం చేసే వారికి ఈ వాచ్ ఒక పర్సనల్ ట్రైనర్‌లా పని చేస్తుంది. ఇందులో ప్రత్యేకంగా 3D వార్మ్ అప్ గైడ్ ఫీచర్ ఉంది. వ్యాయామం ప్రారంభించే ముందు ఏయే స్టెప్స్ చేయాలనేది ఇది 3D యానిమేషన్ రూపంలో గైడ్ చేస్తుంది. అలాగే ఇందులో బిల్ట్-ఇన్ GPS సపోర్ట్ ఉండటం వల్ల మీరు జాగింగ్ లేదా రన్నింగ్ చేసేటప్పుడు మీ రూట్‌ని ఖచ్చితంగా ట్రాక్ చేయెచ్చు. హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ వంటి హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు అన్నీ ఇందులో అద్భుతంగా పని చేస్తాయి.
Also Read: రూ.436కే జేబీఎల్ బ్లూటూత్ స్పీకర్..ఎగబడి కొంటున్న జనం
ఇలాంటి ప్రీమియం ఫీచర్లు , మెటాలిక్ లుక్ ఉన్న స్మార్ట్ వాచ్‌లు సాధారణంగా చాలా ఖరీదు. కానీ ఈ సీఎంఎఫ్ వాచ్ ప్రో 2 ప్రస్తుతం ఆఫర్లలో.. భాగంగా కేవలం రూ. 4,999 ధరకే కస్టమర్లకు లభిస్తోంది. ఐదు వేల రూపాయల బడ్జెట్‌లో ఇంతకంటే స్టైలిష్ , పవర్ ఫుల్ స్మార్ట్‌వాచ్ దొరకడం నిజంగా అద్భుతమనే చెప్పాలి.
మొత్తంగా చూస్తే.. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం డిజైన్, అద్భుతమైన డిస్‌ప్లే పవర్‌ఫుల్ ఫిట్‌నెస్ ఫీచర్లు కోరుకునే వారికి ఈ మోడల్ నంబర్ వన్ ఛాయిస్ అవుతుంది.రూ. 4,999 ధరలో లభిస్తున్న.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్‌ని కొనడం ద్వారా మీ స్టైల్ , ఫిట్‌నెస్ రెండింటినీ అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు!