Big Tv Live Original: వాట్సాప్ (WhatsApp) అనేది చాలా ఉపయోగకరమైన యాప్. స్నేహితులు, కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులతో కనెక్ట్ అయ్యేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో చాలా మంది తమ వ్యక్తిగత పనులతో పాటు ఆఫీస్ పనులు కూడా వాట్సాప్ ద్వారానే చక్కదిద్దుకుంటున్నారు. అయితే, కొంత మంది తెలిసి తెలియని తనంతో చేసే పొరపాట్లు చిక్కుల్లో పడేస్తాయి. ఇంతకీ వాట్సాప్ లో చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ స్పామ్ సందేశాలను పంపవద్దు
స్పామ్ మెసేజ్ లు అనేవి తరచుగా ఒకేసారి చాలా మంది పంపబడే అవాంఛిత సందేశాలు. ఇవి చాలా చికాకు కలిగిస్తాయి. అదే సమయంలో ప్రమాదకరమైనవి కూడా. కొన్ని స్పామ్ మెసేజ్ లు వ్యక్తిగత సమాచారంతో పాటు డబ్బులను కొల్లగొట్టే అవకాశం ఉంటుంది. స్పామ్ మెసేజ్ లకు ఎట్టి పరిస్థితుల్లోనూ రెస్పాండ్ కాకూడదు.
⦿ నకిలీ వార్తలను షేర్ చేయకూడదు
సోషల్ మీడియాలో అతిపెద్ద సమస్య తప్పుడు వార్తల ప్రచారం. కొన్నిసార్లు ప్రజలు నిజం కాని వార్తలను షేర్ చేస్తుంటారు. ఇలాంటి సమాచారం ఒక్కోసారి గందరగోళం, భయాందోళనతో పాటు హాని కలిగించే అవకాశం ఉంటుంది. అందుకే, ఆయా వార్తలు నిజమో? కాదో? తెలుసుకుని షేర్ చేయాలి. పుకార్లను ప్రచారం చేయకూడదు.
⦿ ఇతరులపై బెదిరింపులు, వేధింపులు
కొంత మంది వాట్సాప్ వేదికగా వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. బెదిరింపులు, వేధింపులకు సంబంధించిన మెసేజ్ లను పంపండం సరికాదు. ఇతరులను ఎగతాళి చేయడం, ఇతరులను కించపరచడం లాంటిది చేయకూడదు.
⦿ అభ్యంతరకరమైన కంటెంట్ షేర్ చేయకూడదు
వాట్సాప్ అనేది మెసేజ్ లు, ఫోటోలు, వీడియోలను షేర్ చేసే ఫ్లాట్ ఫారమ్. అయితే, ఎప్పుడూ అభ్యంతరకరమైన, అనుచితమైన సందేశాలను పంపకూడదు. అభ్యంతరకరమైన జోకులు, బాధపెట్టే ఏదైనా కంటెంట్‌ను పంపడం కూడదు. ఒకరికి ఫన్నీగా అనిపించేది మరికొంత మందికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది.
⦿ అనుమతి లేకుండా ఇతరుల ప్రైవేట్ కంటెంట్ షేర్ చేయకూడదు
ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ లో ప్రైవసీ పొందే అవకాశం ఉంటుంది. ఇతరుల వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, వీడియోలను వారి అనుమతి లేకుండా షేర్ చేయకూడదు. ప్రైవసీకి భంగం కలిగించకూడదు.
⦿ స్కామ్‌లు, చట్టవిరుద్ధమైన పనులు చేయకూడదు
కమ్యూనికేషన్ కోసం వాట్సాప్ చాలా ఉపయోగపడుతుంది. కానీ, కొంతమంది దీనిని చట్టవిరుద్ధమైన పనులు చేయడానికి ఉపయోగిస్తున్నారు. స్కామ్ లు, చట్ట విరుద్ధమైన పనులు చేయకూడదు. అలా చేస్తే జైలు శిక్షతో సహా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
Read Also: డైలీ విమానంలో మలేషియా వెళ్లి పనిచేస్తున్న భారత మహిళ.. 5 రోజులు అక్కడ, 2 రోజులు ఇక్కడ!
⦿ ప్రైవసీ సెట్టింగ్స్ మార్చుకోండి
మీ ప్రొఫైల్ ఫోటో, స్టేటస్, లాస్ట్ సీన్ లాంటి సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచకూడదు. అవసరమైన వారికి మాత్రమే కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాట్సాప్ ను సేఫ్ గా ఉపయోగించండి.
Read Also: మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని తినేసే యాప్స్ ఇవే.. వెంటనే కంట్రోల్ చేయండిలా!