Manchu Manoj: మంచు ఫ్యామిలీలో వివాదాలు సమసిపోయాయి అనుకోవడం కలగానే మిగిలింది. వీరి మధ్య విభేదాలు మళ్లీ ఎప్పుడు రాజుకుంటాయో చెప్పడం కష్టమే. ప్రస్తుతానికి అయితే మనోజ్ ను మంచు కుటుంబం బయటకు పంపించేసింది. తన ఆస్తి తనకే దక్కాలని, అక్రమంగా తన ఇంట్లో ఉంటున్న మనోజ్ ను బయటకు పంపాలని మోహన్ బాబు ఫిర్యాదు చేయడంతో.. మనోజ్ బయటకు వచ్చేశాడు. ఇక ఇంత గొడవ అయినా మనోజ్ కే ఎక్కువమంది సపోర్ట్ చేయడం ఆశ్చర్యంగా ఉంది.
మంచు కుటుంబం నుంచి బయటకు వచ్చినా.. మనోజ్ కు అభిమానుల అండ మాత్రం ఎప్పుడు ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే మనోజ్ సైతం అభిమానులను అంతే ప్రేమిస్తాడు. కుటుంబం తనపై ప్రేమ చూపించకపోయినా.. అభిమానులు ప్రేమ చూపించడంతో.. వారినే తన కుటుంబంగా మార్చుకున్నాడు. తాజాగా ఒక మూవీ ఫంక్షన్ లో మనోజ్ అభిమానుల గురించి చెప్పుకొచ్చాడు.
జగన్నాథ్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ కు మంచు మనోజ్ ముఖ్య అతిధిగా విచ్చేశాడు. ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ.. “నాకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది తోక్కాలని చూసినా, బురద చల్లాలని చూసినా, ఆ నాలుగు గోడల మధ్య కు రానీయ్యకపోయినా, నన్ను ఏం చేసినా ప్రజల గుండెల్లో నుంచి నన్ను తీయ్యలేరని నేను గట్టిగా నమ్ముతాను. మీరే నా దేవుళ్లు , మీరే నా కుటుంబం, మీరే నాకు అన్ని.చెట్టు పేరు , జాతీ పేరు చెప్పుకోని మార్కెట్లో అమ్ముడు పోవడానికి ..నేను కాయో, పండునో కాదు.. మీ మనోజ్ ని. మంచు మనోజ్ ని తోక్కుదామని చూస్తారా..?నలుపుదామని చూస్తారా..?నన్ను తోక్కాలన్నా.. లేపాలన్నా అభిమానుల వల్లే అవుతుంది. ఈ ప్రపంచంలో ఎవడి వల్ల కాదు.
Ravi Babu: ఎన్టీఆర్.. నా భుజం వరకే ఉంటాడు.. నేను నటించను అని చెప్పాను.. ఇది నిజమేనా.. ?
ఓ కాజ్ కోసం నిలబడ్డప్పుడు.. న్యాయం జరిగే వరకు అది వదలి పెట్టేది లేదు. అది బయటివాళ్లైనా సరే.. నా వాళ్లైనా సరే.. న్యాయం కోసం ఎంత దూరమైన వెళ్తాను. నా సూడెంట్స్ కోసం నిలబడ్డాను. నా ప్రాణం ఉన్నంత వరకు నిలబడతాను. ఈ రోజు కాదు.. నన్ను ఎప్పటికి ఆపలేరు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
మోహన్ బాబు యూనివర్సిటీలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి మనోజ్ గుర్తించి.. వాటి గురించి అన్న విష్ణుతో గొడవపడ్డాడు. విష్ణుతో పాటు ఇంకొందరు కలిసి కాలేజ్ ను నాశనం చేస్తున్నారని, స్టూడెంట్స్ భవిష్యత్ గురించి తాను పోరాడుతున్నానని, అందుకే తనపై పగపట్టి.. విష్ణు తన కుటుంబంపై దాడికి పాల్పడినట్లు మనోజ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ కాలేజ్ తో మొదలైన గొడవలు ఆస్తి వివాదాలుగా మారి.. మనోజ్ ను బయటకు పంపించేవరకు వచ్చాయి.
ఇక మనోజ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. హీరోగా, విలన్ గా ఏ ఛాన్స్ వచ్చినా కూడా వదులుకోకుండా ఒడిసిపడుతున్నాడు. పాన్ ఇండియా మూవీ మిరాయ్ లో విలన్ గా నటిస్తున్న మనోజ్.. భైరవం సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మిరాయ్ షూటింగ్ జరుపుకుంటుండగా.. భైరవం రిలీజ్ కు రెడీ అవుతుంది. తమిళ్ లో హిట్ టాక్ అందుకున్న గరుడన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. మరి ఈ సినిమాలతో మనోజ్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి.