స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే అతి ముఖ్యమైన సమస్యల్లో ఒకటి బ్యాటరీ ఈజీగా అయిపోవడం. అయితే, ఛార్జింగ్ త్వరగా అయిపోతుందంటే చాలా మంది బ్యాటరీ ప్రాబ్లం అనుకుంటారు. కానీ, అసలు విషయం ఏంటంటే.. మన ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకున్న కొన్ని యాప్స్ బ్యాటరీని ఎక్కువగా తీసుకుంటాయి. త్వరగా ఛార్జింగ్ అయిపోయేలా చేస్తాయి. ఫోన్ లో బ్యాటరీని తినేసే యాప్స్ లో ఫిట్ నెస్ ట్రాకింగ్, సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్ టాప్ ప్లేస్ లో ఉన్నాయి. కొన్ని టెక్ సంస్థలు నిర్వహించిన పరిశోధనలో కొన్ని యాప్స్ విపరీతంగా బ్యాటరీని ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఎక్కువగా బ్యాటరీని ఉపయోగించే యాప్స్ లో Fitbit, Uber యాప్స్ ముందున్నట్లు గుర్తించాయి. ఈ రెండు యాప్స్ మోబైల్ లో ఇన్ స్టాల్ చేసినట్లైతే బ్యాటరీ ఇట్టే ఖాళీ అవుతున్నట్లు తేల్చాయి.
బ్యాటరీని ఎక్కువగా తీసుకునే టాప్ 10 యాప్‌లు
తాజా నివేదికల ప్రకారం Fitbit, Uber అత్యధికంగా బ్యాటరీని తీసుకుంటాయి. ఈ యాప్స్ వినియోగంలో లేనప్పుడు కూడా బ్యాటరీని ఉపయోగిస్తాయి. ఛార్జింగ్ ను ఈజీగా తగ్గిస్తాయి. మీ బ్యాటరీని తగ్గించే టాప్ 10 యాప్స్ ఇవే..
⦿ ఫిట్ బిట్
⦿ ఉబెర్
⦿ స్కైప్
⦿ ఫేస్ బుక్
⦿ ఎయిర్ బన్బ్
⦿ ఇన్ స్టాగ్రామ్
⦿ టిండెర్
⦿ బంబుల్
⦿ స్నాప్ చాట్
⦿ వాట్సాప్
Read Also: ఏసీ ఫుల్ గా వాడినా కరెంట్ బిల్ తక్కువగా రావాలా? సింఫుల్ గా ఈ టిప్స్ ఫాలో అయిపోండి!
బ్యాటరీని ఎలా ఆదా చేసుకోవాలంటే?
చీటికి మాటికి బ్యాటరీ అయిపోవడం చికాకు కలిగిస్తుంది. అందుకే బ్యాటరీని సేవ్ చేసుకుందుకు కొన్ని టిప్స్ పాటించాలి. ఎక్కువ బ్యాటరీని ఉపయోగించే యాప్ లను మాన్యువల్ గా పొందవచ్చు. లేదంటే వాటి బ్యాటరీ వినియోగాన్ని ఆప్టిమైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆప్టిమైజేషన్ అనేది చాలా ఈజీ. ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ ముందుగా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లోని సెట్టింగ్స్ ను ఓపెన్ చేయాలి.
⦿ బ్యాటరీ మెను మీద ట్యాప్ చేయాలి.
⦿ ఆ తర్వాత అడ్వాన్స్ డ్ సెట్టింగ్స్ లోకి వెళ్లాలి.
⦿ బ్యాటరీ యూసేజ్ ను ఆప్టిమైజ్ చేయాలి.
⦿ ఆయా యాప్స్ కు సంబంధించి బ్యాగ్రౌండ్ యాక్టివిటీ డిసేబుల్ చేయాలనుకుంటే డోంట్ ఆప్టిమైజ్ అనే ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవాలి.
Read Also: టీనేజర్లకు ఇన్‌స్టాగ్రామ్ ఝలక్.. ఇక ఆ కంట్రోల్స్ అన్నీ పేరెంట్స్ చేతుల్లోనే, చచ్చారు పో!
ఈ సెట్టింగ్స్ అన్ని పూర్తి చేసుకున్న తర్వాత మీ బ్యాటరీ వినియోగం అనేది గణనీయంగా తగ్గుతుంది. అంతేకాదు, యాప్స్ బ్యాగ్రౌండ్ యాక్టివిటీని డిసేబుల్ చేయడం వల్ల ఆయా యాప్స్ కు సంబంధించి రియల్ టైమ్ నోటిఫికేషన్స్ నిలిపివేయబడుతాయి. ఫలితంగా బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇకపై ఈజీగా మీ బ్యాటరీ లైఫ్ ను ఎంజాయ్ చెయ్యొచ్చు.
Also Read : తల్లి లేకుండా పిల్లల్ని కన్న ఇద్దరు పురుషులు – జెనెటిక్ ఇంజినీరింగ్ అద్భుతం