BigTV English

Uttarakhand HC : లివ్-ఇన్ రిలేషన్ పై హైకోర్టు షాకింగ్ కామెంట్లు – ఇక వారికి మూడినట్లే

Uttarakhand HC : లివ్-ఇన్ రిలేషన్ పై హైకోర్టు షాకింగ్ కామెంట్లు – ఇక వారికి మూడినట్లే

Uttarakhand HC : వ్యక్తిగత గోప్యత పేరుతో వ్యక్తుల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించడాన్ని ఎలా సమర్థించాలని.. లివ్-ఇన్ రిలేషన్ షిప్ సమయంలో పుట్టిన పిల్లలకు సమాజంలో ఎదురయ్యే ఆత్మగౌరవ హననాన్ని ఏలా అంగీకరించాలంటూ ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రశ్నించింది. వ్యక్తులు పెళ్లి, లివ్-ఇన్ రిలేషన్ షిఫ్ లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన యూనిఫాం సివిల్ కోడ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. అల్మాసుద్దీన్ సిద్ధిఖీ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. పెళ్లి చేసుకోకుండా, ఎలాంటి చట్టబద్ధత, అడ్డుంకులు లేని వ్యవస్థలో పిల్లల్ని కంటే.. వారి జీవితానికి ఎవరు భరోసా కల్పించాల్సి ఉంటుందని పిటిషనర్ ను ప్రశ్నించింది.


దేశంలోనే తొలిసారిగా ఉత్తరా ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తోంది. మతాలు, కులాలతో సంబంధం లేకుండా అందరినీ ఒకే విధమైన చట్టాలు, నిబంధనలు అమలవుతాయి. ఈ విధానాన్ని సవాళు చేస్తున్న ముస్లిం మతస్తులు.. తమ వివాహ, విడాకుల వ్యవస్థ భారతీయ చట్టాలకు లోబడి ఉండదని, తమకు షరియా నిబంధనలు మాత్రమే వర్తిస్తాయంటూ వాదిస్తున్నారు. అందులో భాగంగానే.. అల్మాసుద్దీన్ సిద్ధిఖీ అనే వ్యక్తి.. యూనిఫాం సివిల్ కోడ్ చట్టం – 2024 ను సవాళు చేస్తూ హైకోర్టులో సవాళు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జీ.నరేందర్ ధర్మాసనం.. లివ్-ఇన్ రిలేషన్ పై నిబంధనల్ని తొలిగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. యువతీయువకుల వ్యక్తిగత గోప్యత పేరుతో.. పెళ్లి చేసుకోకుండా, ఎలాంటి చట్టబద్ధమైన సంబంధాల్లోకి రాకుండా పిల్లల్ని కంటే… ఆ పిల్లల ఆత్మగౌరవం గురించి ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించింది.

ఈ కేసు విషయంలో ఉత్తరాఖండ్, కేంద్ర ప్రభుత్వాల తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హైకోర్టులో వాదనలు వినిపించారు. యూనిఫాం సివిల్ కోడ్ లో మతాలకు సంబంధం లేకుడా లివ్-ఇన్ రిలేషన్‌ షిప్‌లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అలా చేయని సందర్భంలో.. మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.10,000 జరిమానా విధించే అవకాశం ఉంది. లేదంటే.. జరిమానా, శిక్ష విధించేందుకు చట్టంలోని సెక్షన్ 387(1) అనుమతిస్తుంది. ఈ కేసులో పిటిషనర్ కు ప్రతిస్పందన దాఖలు చేసేందుకు ఆరు వారాల గడుపు అడిగారు. ఈ చట్టం చేసే ముందు చాలా పరిశోధన చేశామని తెలిపిన తుషార్ మెహతా.. చాలా మంది నిరుపేద యువతులు.. చట్టబద్ధం కాని లివ్-ఇన్ రిలేషన్ షిప్ కారణంగా ఇబ్బందుల పాలైనట్లు తెలిపారు. కాగా.. ఈ పిటిషన్ సమయంలో.. న్యాయమూర్తి మౌఖికంగా అనేక ప్రశ్నలు సంధించారు.


లివ్-ఇన్ సంబంధాలను నియంత్రించడంలో తప్పేంటని అడిగారు. దీని వల్ల ఫలితం కూడా ఉందిగా అని అన్నారు. ఈ తరహా సంబంధాలు విడిపోతే తర్వాత ఏమి జరుగుతుందని… ఈ సంబంధం నుంచి సంతానం పుడితే.. వారి భవిష్యత్ ఏంటని అన్నారు. వివాహ పద్ధతిలో అయితే.. బిడ్డకు సంరక్షణ, వారసత్వం వంటి విషయాలపై అవగాహన ఉంటుందని, కానీ.. లివ్-ఇన్ సంబంధంలో అలాంటి బాధ్యతలు ఏవరు తీసుకుంటారని ప్రశ్నించారు. మీ గోప్యతపై దాడి అనే ముసుగులో.. మరొక వ్యక్తి ఆత్మగౌరవాన్ని త్యాగం చేయవచ్చా, అదీ.. ఆ వ్యక్తి మీ బిడ్డ ఉన్నప్పుడు అది ఎంత వరకు సమంజసం అంటూ ప్రశ్నించారు.

Also Read : కొత్త పన్ను స్లాబులపై పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి ప్రకటన

ఈ కేసులో తన వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్. లైవ్-ఇన్ రిలేషన్ షిఫ్ లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే నిబంధన ద్వారా మహిళా సాధికారతను కాపాడేందుకు చేసిన ప్రయత్నంగా తెలిపారు. గృహ హింస నుంచి మహిళల రక్షణ చట్టం కింద లివ్-ఇన్‌లు ఇప్పటికే గుర్తించబడ్డాయని సీజే తెలిపారు. లీవ్ ఇన్ రిలేషన్ షిఫ్ లో పిల్లల్ని కంటే… ఆ పిల్లల పితృత్వం నిరూపించుకునేందుకు మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. అందుకే.. రిజిస్ట్రేషన్లు ఉపయోగపడతాయని అన్నారు. అలా చేయడం వల్ల.. పితృత్వాన్ని నిరూపించుకునే విషయంలో మహిళలకు సహాయపడుతుందని అన్నారు. ఇక నిషేధిత సంబంధాల స్థాయిల విషయానికి వస్తే.. ప్రత్యేక వివాహ చట్టం, హిందూ వివాహ చట్టం, క్రైస్తవ వివాహ చట్టం ప్రకారం అటువంటి సంబంధాలు ఇప్పటికే నిషేధించారని తుషార్ మెహతా తెలిపారు.

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×