BigTV English

Racheal Kaur: డైలీ విమానంలో మలేషియా వెళ్లి పనిచేస్తున్న భారత మహిళ.. 5 రోజులు అక్కడ, 2 రోజులు ఇక్కడ!

Racheal Kaur: డైలీ విమానంలో మలేషియా వెళ్లి పనిచేస్తున్న భారత మహిళ.. 5 రోజులు అక్కడ, 2 రోజులు ఇక్కడ!

సాధారణంగా ఉద్యోగానికి వెళ్లాలంటే బైక్, కారులో వెళ్తారు. ఒకవేళ అవి లేకపోతే, ఆటోలోనో, బస్సులోనో వెళ్తారు. కానీ, ఓ మహిళ ఆఫీస్ కు వెళ్లేందుకు రోజూ 700 కిలో మీటర్లు విమాన ప్రయాణం చేస్తోంది. వినడానికి ఆశ్చర్యం కలిగినా ఇది నిజం. రోజూ ఆఫీస్ కు విమానంలోనే వెళ్లి వస్తుంది. అలాగని ఆమె కోటీశ్వరురాలు అనుకుంటే పొరపాటే. ఆమె సంపాదన కూడా మీర ఎక్కువేమీ కాదు. అయితే, తనకు విమాన ప్రయాణం చేయడం వల్లే ఖర్చు తక్కువ అవుతుందని చెప్తున్నది. ఇంతకీ ఆమె విమానం ముచ్చట ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


రోజూ 700 కి.మీ విమాన ప్రయాణం

భారత సంతతికి చెందిన రాచెల్ కౌర్.. మలేషియాలోని పెనాంగ్ లో స్థిరపడింది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు పిల్లలు. బాబుకు 12 ఏండ్లు కాగా, పాపకు 11 సంవత్సరాలు. ప్రస్తుతం ఆమె ఎయిర్ ఏషియా  ఫైనాన్స్ ఆపరేషన్స్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్నది. తన ఆఫీస్ కౌలాలంపూర్ లో ఉంటుంది. ఆమె ఉండే రాష్ట్రం, ఆమె ఆఫీస్ ఉన్న రాష్ట్రం మధ్య చాలా దూరం ఉంటుంది. రెండు నగరాల మధ్య సుమారు 350 కిలో మీటర్ల దూరం ఉంటుంది. జాబ్ కొత్తలో ఆమె కౌలాలంపూర్ లోనే రెంట్ హౌస్ తీసుకుని ఉండేది. ఒక్కతే ఒంటరిగా ఉండేది. వారంలో రెండు రోజులు సెలవులు ఉండేవి. ఈ సెలవు దినాల్లో ఆమె తన ఇంటికి వెళ్లి కుటుంబంతో గడిపేది. అయితే, రెంట్, రవాణా ఛార్జీలు కలిపి నెలకు ఏకంగా 474 డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.41,000  ఖర్చు అయ్యేవి. ఖర్చు ఎక్కువ కావడం, కుటుంబానికి దూరం కావడం అస్సలు నచ్చలేదు. అందుకే రోజూ ఇంటి నుంచే అప్ అండ్ డౌన్ చేయాలనుకుంది.


రోజూ ఆఫీస్ కు విమానంలో వెళ్లి రావాలి అనుకుంది. రోజూ విమానంలో వెళ్లి రావడం వల్ల ఎంత ఖర్చు అవుతుంది? అనే విషయాల గురించి లెక్కలు వేసింది. నెలకు కేవలం 316 డాలర్లు అంటే.. ఇండియన్ కరెన్సీలో రూ. 27,000 ఖర్చు అవుతున్నట్లు తేలింది. గతంతో పోల్చితే ఖర్చు తక్కువ కావడం, కుటుంబంతో రోజూ గడిపే అవకాశం ఉండటంతో ఆమె రాచెల్ సంబురపడింది. గత ఏడాది నుంచి రోజూ పెనాంగ్, కౌలాలంపూర్ వరకు అప్ అండ్ డౌన్ చేస్తున్నది. రోజూ విమానం ద్వారా 700 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. అటు ఆఫీస్ వర్క్, ఇటు ఇంటిని చూసుకుంటూ హ్యాపీగా గడిపేస్తుంది.

ఇబ్బందులు తప్పవంటున్న రాచెల్

ఖర్చులు తగ్గడం, కుటుంబాన్ని దగ్గరుండి చూసుకోవడం బాగానే ఉన్నా, జర్నీ కారణంగా అలసిపోతున్నట్లు చెప్పింది. పొద్దున్నే 4 గంటలకు నిద్రలేచి 5 గంటల వరకు రెడీ అవుతుంది. 6.30 గంటలకు విమానం ఎక్కుతుంది. 7.30 గంటలకు కౌలాలంపూర్ విమానాశ్రయానికి చేరుకుంటుంది. 10 నిమిషాల్లో నడుచుకుంటూ ఆఫీస్ కు వెళ్తుంది. 7.45 నుంచి తన ఆఫీస్ పనులు మొదలు పెడుతుంది. రాత్రి 8 గంటలకు ఇంటికి చేరుకుంటుంది. వారానికి 5 రోజులు ఆఫీస్ కు వెళ్తుంది. రెండు రోజుల పాటు కుటుంబంతో గడుపుతుంది. రాచెల్ నిజంగా ఇండియన్ సూపర్ మామ్ అంటున్నారు నెటిజన్లు.

Read Also: రైలు వాష్ రూమ్ లో నిలబడి కుంభమేళాకు వెళ్లిన యువతులు, నెట్టింట వీడియో వైరల్

Tags

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×