Sri Tej Health Update : పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ తొక్కిసలాటలో శ్రీతేజ్ అనే బాలుడు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి దాదాపు 17 రోజులు అవుతున్నా బ్రెయిన్ డ్యామేజ్ వల్ల ఆసుపత్రిలో చేరిన బాలుడు శ్రీ తేజ్ ఇంకా కోలుకోలేదు. బ్రెయిన్ డ్యామేజ్ వల్ల తాను కోమాలోకి వెళ్లిపోయాడని మొదట్లో వైద్యులు తెలిపారు. కానీ ఆ తర్వాత తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని వైద్యులు కూడా సరిగ్గా చెప్పలేదు. కానీ పర్వాలేదని మాత్రం చెబుతున్నారు. మొన్న హెల్త్ బులిటెన్ గురించి సీపీ ఆనంద్ ప్రెస్ మీట్ లో చెప్పారు. నిన్న రాత్రి మరో బులిటెన్ ను వైద్యులు విడుదల చేశారు. ఆ బులిటెన్ లో తన ఆరోగ్యం బాగానే ఉందని కొంచెం కళ్లు తెరిచాడు. ద్రవ పదార్థాలను కొద్దిగా తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పుడు తాజాగా మరో బులిటెన్ ను రిలీజ్ చేశారు. అందులో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..
శ్రీతేజ్ లేటెస్ట్ హెల్త్ బులిటెన్..
శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం చెప్పుకొచ్చింది. వెంటిలేటర్‌పై చికిత్స జరుగుతుందని, ఫీడింగ్ కూడా తీసుకుంటున్నాడని అన్నారు.. అప్పుడప్పుడు పిట్స్ లాంటివి వస్తున్నాయి.. కళ్ళు తెరుస్తున్నాడు, కానీ మనుషుల్ని గుర్తు పట్టడం లేదని చెప్పారు.నిన్నటితో పోలిస్తే ఈరోజు తన ఆరోగ్యం మెరుగ్గా ఉందని చెప్పారు. మరికొద్ది రోజుల్లో అతను కోలుకొనే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అంతే కాకుండా కళ్లు కూడా తెరుస్తున్నాడు కానీ ఎవరినీ గుర్తుపట్టడం లేదని తెలిపింది. దీంతో శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని చాలామంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు.. గత 17 రోజులుగా మూసిన కళ్లు తెరవకుండా ఉన్న శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కోలుకోవడంతో చాలా మంది సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కిమ్స్ హాస్పిటల్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని చాలా మంది కోరుకుంటున్నారు. శ్రీతేజ్ ను ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం కోసం తెలంగాణన మంత్రులు హాస్పిటల్ కు వెళ్తున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అసెంబ్లీ నుంచి నేరుగా కిమ్స్ హాస్పిటల్ కు చేరుకున్నట్లు తెలుస్తుంది. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించారు. కొద్ది సేపటి క్రితం అసెంబ్లీలో వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. అలాగే తన కొడుకు ప్రతీక్ ఫౌండేషన్ పేరు మీద 25 లక్షల చెక్కును వారి కుటుంబానికి ఇవ్వనున్నట్లు ప్రకటించారు..
ఇక పుష్ప 2 టీమ్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. మొన్న పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. నిన్న హ్యుమన్ రైట్స్ కు పుష్ప 2 టీమ్ నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం పోయిందని దానికి ఆ టీమ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు అల్లు అర్జున్ పై సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దానిపై ఎలాంటి తీర్పు వస్తుందా అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.