Best 1.5 Ton AC with Auto Clean Mode: మారుతున్న టెక్నాలజీ, మండుతున్న ఎండల మధ్య ఇల్లు చల్లగా ఉండటంతో.. పాటు పీల్చే గాలి కూడా శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. అందుకే ఈ సమ్మర్ సీజన్‌లో ఎలాంటి తలనొప్పి లేకుండా, క్లీనింగ్ మెయింటెనెన్స్ భారం తగ్గించే ఆటో క్లీన్ మోడ్ కలిగిన ప్రీమియం 1.5 టన్ ఏసీలు మార్కెట్లో ట్రెండ్ అవుతున్నాయి. బ్యాక్టీరియా, డస్ట్ పేరుకుపోకుండా సెల్ఫ్ క్లీన్ చేసుకునే టాప్ 5 బెస్ట్ ఏసీల ఫీచర్లు, వాటి ధరల వివరాలు ..
1. డైకిన్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ:
డైకిన్ ఏసీలు కూలింగ్‌లో నంబర్ వన్. ఈ ఏడాది మోడల్‌లో ఇచ్చిన డ్యూ క్లీన్ టెక్నాలజీ (Dew Clean Technology) ఇండోర్ యూనిట్ కాయిల్స్‌ను ఆటోమేటిక్‌గా క్లీన్ చేస్తుంది. బటన్ నొక్కగానే గాలిలోని తేమను ఉపయోగించి కాయిల్స్ పై ఉన్న దుమ్మును కడిగేస్తుంది.
ముఖ్య ఫీచర్లు: 3D ఎయిర్‌ఫ్లో, పీఎం 2.5 ఫిల్టర్, ట్రిపుల్ డిస్ప్లే.
ధర: సుమారు రూ.39,490 వరకు ఉంటుంది.
2. ఎల్‌జీ 1.5 టన్ 5 స్టార్ ఏఐ ఇన్వర్టర్ ఏసీ:
ఎల్‌జీ అనగానే మనకు గుర్తొచ్చేది స్మార్ట్ ఫీచర్స్.ఇందులో ఫ్రీజ్ కోట్ ఆటో క్లీన్ ఫీచర్ ఉంది. ఇది కాయిల్స్ పై పేరుకున్న బ్యాక్టీరియాను ఐస్ లా మార్చి, కరిగించి బయటకు పంపేస్తుంది. 5 స్టార్ రేటింగ్ వల్ల కరెంట్ బిల్లు కూడా చాలా తక్కువ వస్తుంది.
ముఖ్య ఫీచర్లు: AI కన్వర్టిబుల్ 6-ఇన్-1 మోడ్స్, యాంటీ-వైరల్ ప్రొటెక్షన్.
ధర: సుమారు రూ.46,500 వరకు ఉంటుంది.
3. పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ వై-ఫై ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ:
పానాసోనిక్ ఈసారి క్రిస్టల్ క్లీన్ టెక్నాలజీతో వచ్చింది. స్మార్ట్ కనెక్టివిటీ ఇష్టపడేవారికి.. కూడా ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది ‘మ్యాటర్’ ఎనేబుల్డ్ స్మార్ట్ ఏసీ కాబట్టి మీ ఫోన్ ద్వారా లేదా వాయిస్ కమాండ్‌తో ఆటో క్లీన్ మోడ్‌ను ఆన్ చేయవచ్చు.
ముఖ్య ఫీచర్లు: PM 0.1 ఎయిర్ ప్యూరిఫికేషన్ ఫిల్టర్, AI మోడ్, వై-ఫై సపోర్ట్.
ధర: సుమారు రూ. 47,990 వరకు ఉంటుంది.
4. వోల్టాస్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ:
ఇండియాలో అత్యధికంగా అమ్ముడయ్యే బ్రాండ్ వోల్టాస్ . దీనిలోని సెల్ఫ్ క్లీన్ /ఆటో క్లీన్ ఫీచర్ ఏసీ లోపల తేమ నిలిచిపోకుండా చూస్తుంది. దీని వల్ల ఇండోర్ యూనిట్ నుండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాదు, ఫంగస్ కూడా చేరదు.
ముఖ్య ఫీచర్లు: 5-ఇన్-1 అడ్జస్టబుల్ మోడ్,యాంటీ డస్ట్ ఫిల్టర్,హై అంబియంట్ కూలింగ్.
ధర: సుమారు రూ.36,990 వరకు ఉంటుంది.
Also Read: నోయిస్ విజన్ 3 పై భారీ ఆఫర్.. రూ. 2,599కే లగ్జరీ అమోలెడ్ స్మార్ట్‌వాచ్!
5. క్రోమా 1.5 టన్ 5 స్టార్ 7-ఇన్-1 కన్వర్టిబుల్ ఇన్వర్టర్ ఏసీ:
తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు కావాలనుకుంటే క్రోమా బెస్ట్ ఆప్షన్. ఇందులో యాంటీ-వైరల్ ఫిల్టర్లతో పాటు అద్భుతమైన ఆటో డ్రై / సెల్ఫ్ క్లీనింగ్ ఫీచర్ ఉంది. కాయిల్స్‌ను ఎప్పటికప్పుడు డ్రైగా ఉంచి మెయింటెనెన్స్ ఖర్చులను దాదాపు సున్నా చేస్తుంది.
ముఖ్య ఫీచర్లు: 7-ఇన్-1 కన్వర్టిబుల్, ఇన్-బిల్ట్ టెంపరేచర్ సెన్సార్, బ్లూ ఫిన్ ప్రొటెక్షన్.
ధర: రూ.31,990 వరకు ఉంటుంది.
ఈ ఐదు ఏసీలు కేవలం చల్లదనాన్ని ఇవ్వడమే కాదు.మీ ఇంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. మీ బడ్జెట్ , బ్రాండ్ నమ్మకాన్ని బట్టి పైన పేర్కొన్న వాటిలో బెస్ట్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
(గమనిక: ఆన్‌లైన్ ఆఫర్లు, కార్డ్ డిస్కౌంట్లను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చు).