E-Paper
Advertisement

యాపిల్ బిగ్ ట్విస్ట్.. సెప్టెంబర్‌లో iPhone 18 రావట్లేదట, మరెప్పుడు లాంచ్ అవుతుందో తెలుసా?

యాపిల్ బిగ్ ట్విస్ట్.. సెప్టెంబర్‌లో iPhone 18 రావట్లేదట, మరెప్పుడు లాంచ్ అవుతుందో తెలుసా?
Advertisement

Apple Launch 2027: యాపిల్ అభిమానులకు మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. సాధారణంగా ప్రతి ఏటా సెప్టెంబర్‌లోనే అన్ని ఐఫోన్లను తీసుకొచ్చే యాపిల్.. ఈసారి తమ స్ట్రాటజీని మార్చినట్లు టెక్ వర్గాల్లో గట్టిగా టాక్ నడుస్తోంది. 2027 ప్రారంభంలో ఒకేసారి మూడు కొత్త ఐఫోన్లను మార్కెట్లోకి దించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. iPhone 18, iPhone 18e తో పాటు iPhone Air 2 మోడళ్లను ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో, ముఖ్యంగా మార్చి నెలలో లాంచ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. పైకి డిజైన్‌లో పెద్దగా మార్పులు కనిపించకపోయినా.. లోపల మాత్రం కొత్త ప్రాసెసర్లు, మెరుగైన కెమెరాలు, భారీ బ్యాటరీ లైఫ్‌తో ఈ ఫోన్లు అదిరిపోనున్నాయి. మరి ఒక్కో మోడల్‌లో ఎలాంటి స్పెషల్ ఫీచర్లు ఉండబోతున్నాయో ఓ లుక్కేద్దాం.

iPhone 18లో కొత్త అప్‌గ్రేడ్స్:

ఐఫోన్ 18లో 6.3 అంగుళాల LTPO OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉండొచ్చని సమాచారం. స్క్రీన్ మరింత బ్రైట్‌గా ఉండటంతో పాటు బెజెల్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే డైనమిక్ ఐలాండ్ మాత్రం ప్రస్తుత సైజులోనే ఉండొచ్చని తెలుస్తోంది. ఇందులో A20 చిప్, 9GB లేదా 12GB ర్యామ్ ఉండొచ్చని అంచనా. బ్యాటరీ సామర్థ్యం 4,430mAhకు పెరగవచ్చని ప్రచారం జరుగుతోంది. వెనుకవైపు 48 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉండొచ్చు.

iPhone 18eలో ఇవే మార్పులు:

Advertisement

బడ్జెట్ ధరలో వచ్చే ఐఫోన్ 18eలో కూడా A20 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. 6.1 అంగుళాల OLED స్క్రీన్, 60Hz రిఫ్రెష్ రేట్ కొనసాగవచ్చని సమాచారం. అయితే 6.3 అంగుళాల డిస్‌ప్లే వస్తుందనే ప్రచారం కూడా ఉంది. వెనుకవైపు 48 మెగాపిక్సల్ కెమెరా, ముందు 24 మెగాపిక్సల్ కెమెరా ఉండొచ్చని తెలుస్తోంది. ఇందులో 8GB లేదా 9GB RAM, 4,430mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది.

Also Read: చిప్స్ ప్యాకెట్లు కొంటారు కానీ రీఛార్జ్‌కు ఎందుకు ఆలోచిస్తున్నారు? ధరల పెంపుపై ఎయిర్‌టెల్ అధినేత షాకింగ్ కామెంట్స్!

iPhone Air 2 ప్రత్యేకతలు:

Advertisement

ఐఫోన్ ఎయిర్ 2లో బ్యాటరీ లైఫ్ మెరుగుపడటంతో పాటు రెండో 48 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా రావచ్చని అంచనా. A20 ప్రో చిప్, 12GB ర్యామ్ ఉండొచ్చని సమాచారం. 6.5 అంగుళాల డిస్‌ప్లే, టైటానియం బాడీ కొనసాగవచ్చు. డైనమిక్ ఐలాండ్ పరిమాణం తగ్గే అవకాశం కూడా ఉంది.

ఇండియాలో ధర ఎంతంటే?

భారత్‌లో ఐఫోన్ 18 ధర రూ.99,900 నుంచి ప్రారంభం కావచ్చని అంచనా. ఐఫోన్ 18e ధర రూ.79,900, ఎయిర్ 2 ధర రూ.1,49,900 ఉండొచ్చని సమాచారం. అయితే ఇవి ప్రస్తుతం వినిపిస్తున్న అంచనాలు మాత్రమే. యాపిల్ ఇంకా ఈ ఫోన్లను, ధరలను, లాంచ్ తేదీలను అధికారికంగా ప్రకటించలేదు. కాబట్టి.. అసలు వివరాలు లాంచ్ సమయంలోనే తెలుస్తాయి.

Also Read: స్మార్ట్‌ఫోన్ స్లో అవ్వడానికి అసలు కారణాలివే.. ఇలా చేస్తే మళ్లీ రాకెట్‌లా పనిచేస్తుంది!

Tags

Related News

చిప్స్ ప్యాకెట్లు కొంటారు కానీ రీఛార్జ్‌కు ఎందుకు ఆలోచిస్తున్నారు? ధరల పెంపుపై ఎయిర్‌టెల్ అధినేత షాకింగ్ కామెంట్స్!

స్మార్ట్‌ఫోన్ స్లో అవ్వడానికి అసలు కారణాలివే.. ఇలా చేస్తే మళ్లీ రాకెట్‌లా పనిచేస్తుంది!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండానే కొత్త ఫోన్‌లోకి eSIM ట్రాన్స్‌ఫర్ చేసుకోండిలా!

రూ.699కే బ్లూటూత్ హెడ్‌ఫోన్..స్టూడెంట్స్ కోసం పర్ఫెక్ట్

రూ.29 వేలకే లక్ష రూపాయల Samsung Galaxy S25 5G.. ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్!

గేమింగ్ ఇయర్‌బడ్స్ కోసం చూస్తున్నారా?వీటిని మించినవి లేవు!

వాట్సప్ గ్రూప్ చాట్‌లో ఇన్నాళ్లూ ఎదురుచూసిన ఫీచర్ వచ్చేసింది.. ఈ 4 మార్పులను గమనించారా?

Big Stories

Advertisement
×