E-Paper
Advertisement

చిప్స్ ప్యాకెట్లు కొంటారు కానీ రీఛార్జ్‌కు ఎందుకు ఆలోచిస్తున్నారు? ధరల పెంపుపై ఎయిర్‌టెల్ అధినేత షాకింగ్ కామెంట్స్!

చిప్స్ ప్యాకెట్లు కొంటారు కానీ రీఛార్జ్‌కు ఎందుకు ఆలోచిస్తున్నారు? ధరల పెంపుపై ఎయిర్‌టెల్ అధినేత షాకింగ్ కామెంట్స్!
Advertisement

Mobile Recharge Price Hike: మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు మరోసారి పెరగవచ్చా అనే ప్రశ్నకి.. టెలికాం రంగంలో వినిపిస్తున్న తాజా చర్చ చూస్తే ఆ అవకాశం ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. భారతీ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు, ఎయిర్‌టెల్‌కు చెందిన సునీల్ భారతీ మిట్టల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ చర్చకు కారణమయ్యాయి. ప్రస్తుతం మొబైల్ సేవలకు వినియోగదారులు చెల్లిస్తున్న మొత్తం తక్కువగా ఉందని, ఒక్కో యూజర్ నెలకు సుమారు రూ.350 ఖర్చు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఇది కొత్త రీఛార్జ్ ధరల ప్రకటన కాదు. ధరలు ఎప్పుడు పెరుగుతాయనే విషయంపై కూడా ఆయన స్పష్టత ఇవ్వలేదు.

రూ.350 ఎందుకు అంటున్నారు?

భారతీ ఎంటర్‌ప్రైజెస్ 50 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మిట్టల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనం రోజువారీ వాడే సబ్బులు, కూల్ డ్రింక్స్, చిప్స్ ప్యాకెట్ల కోసం ఆలోచించకుండా డబ్బులు ఖర్చు పెడతాం. కానీ ప్రతిక్షణం మనకు తోడుగా ఉండే మొబైల్ సేవలకు కాస్త ఎక్కువ చెల్లించడానికి మాత్రం వెనకాడుతున్నామని ఆయన అన్నారు. యూపీఐ పేమెంట్స్, బ్యాంకింగ్, ఆన్‌లైన్ క్లాసులు, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా అన్నింటికీ ఫోన్ వాడుతున్నప్పుడు రోజుకు రూ.10 నుంచి రూ.12 ఖర్చు పెట్టడం పెద్ద విషయమేమీ కాదని అభిప్రాయపడ్డారు. ఆ లెక్కన నెలకు దాదాపు రూ.350 అవుతుందని మిట్టల్ భావిస్తున్నారు.

ఖర్చులు పెరిగిన కారణంగా..

Advertisement

దాదాపు పదేళ్ల క్రితం కూడా నెలకు రూ.300 ఖర్చు చేయాలని మిట్టల్ సూచించారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు విద్యుత్, ఇంధనం, ఉద్యోగుల జీతాలు, నెట్‌వర్క్ నిర్వహణ ఖర్చులు పెరిగాయి. అందుకే పాత అంచనాను రూ.350కు పెంచినట్లు ఆయన వివరించారు. టెలికాం కంపెనీలు నెట్‌వర్క్‌ను నడపడానికి, మెరుగుపరచడానికి ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి వస్తోంది.

Also Read: స్మార్ట్‌ఫోన్ స్లో అవ్వడానికి అసలు కారణాలివే.. ఇలా చేస్తే మళ్లీ రాకెట్‌లా పనిచేస్తుంది!

టవర్లు, 5జీపై పెట్టుబడులు..

Advertisement

భారత్‌లో సుమారు 3.5 లక్షల మొబైల్ టవర్లు మాత్రమే ఉన్నాయని, చైనాలో ఈ సంఖ్య పది లక్షలకు పైగా ఉందని మిట్టల్ పేర్కొన్నారు. దేశంలో టవర్ల సంఖ్య కనీసం రెట్టింపు కావాలని, ఫైబర్ నెట్‌వర్క్‌లు, సముద్ర అడుగున ఉండే ఇంటర్నెట్ కేబుళ్లపై కూడా పెట్టుబడులు అవసరమని అన్నారు. స్పెక్ట్రమ్ కొనుగోలు, నెట్‌వర్క్ అభివృద్ధి కోసం కంపెనీలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. అయినా ఆశించిన ఆదాయం రావడం లేదన్నది ఆయన వాదన.

ధరల పెంపుపై స్పష్టత లేదు..

ఎయిర్‌టెల్ ఏఆర్‌పీయూ సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.271కు చేరింది. ఏడాది క్రితం ఇది రూ.256గా ఉంది. మిట్టల్ చెప్పిన రూ.350 స్థాయికి చేరాలంటే ఈ మొత్తం ఇంకా పెరగాలి. చివరిసారిగా 2024 జూన్‌లో కంపెనీలు రీఛార్జ్ ధరలను సుమారు 10 నుంచి 25 శాతం పెంచాయి. తదుపరి పెంపునకు మాత్రం తేదీ ఖరారు కాలేదు. కాబట్టి.. వెంటనే ప్లాన్లు ఖరీదవుతాయని అనుకోవాల్సిన అవసరం లేదు. టెలికాం కంపెనీల ఆర్థిక పరిస్థితి, నెట్‌వర్క్ పెట్టుబడుల అవసరం ఆధారంగా రాబోయే రోజుల్లో నిర్ణయం ఉండొచ్చు. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాలి.

Also Read: ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండానే కొత్త ఫోన్‌లోకి eSIM ట్రాన్స్‌ఫర్ చేసుకోండిలా!

Tags

Related News

స్మార్ట్‌ఫోన్ స్లో అవ్వడానికి అసలు కారణాలివే.. ఇలా చేస్తే మళ్లీ రాకెట్‌లా పనిచేస్తుంది!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండానే కొత్త ఫోన్‌లోకి eSIM ట్రాన్స్‌ఫర్ చేసుకోండిలా!

రూ.699కే బ్లూటూత్ హెడ్‌ఫోన్..స్టూడెంట్స్ కోసం పర్ఫెక్ట్

రూ.29 వేలకే లక్ష రూపాయల Samsung Galaxy S25 5G.. ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్!

గేమింగ్ ఇయర్‌బడ్స్ కోసం చూస్తున్నారా?వీటిని మించినవి లేవు!

వాట్సప్ గ్రూప్ చాట్‌లో ఇన్నాళ్లూ ఎదురుచూసిన ఫీచర్ వచ్చేసింది.. ఈ 4 మార్పులను గమనించారా?

రహస్యంగా వీడియోలు తీయడానికి నో ఛాన్స్.. ప్రైవసీకి పెద్దపీట వేస్తూ గూగుల్ కొత్త స్మార్ట్ గ్లాసెస్!

Big Stories

Advertisement
×