E-Paper
Advertisement

షారుఖ్ వాచ్ ధర రూ.1.8కోట్లు..ప్రపంచంలో 22 మంది దగ్గరే ఉన్నఈ రేర్ పీస్ ప్రత్యేకతలివే!

షారుఖ్ వాచ్ ధర రూ.1.8కోట్లు..ప్రపంచంలో 22 మంది దగ్గరే ఉన్నఈ రేర్ పీస్ ప్రత్యేకతలివే!
Advertisement

Shah Rukh Khan watch price: సినిమాలతోనే కాదు, తనదైన స్టైల్ తో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే బాద్‌షా షారుఖ్ ఖాన్ మరో సారి గ్లోబల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. సాధారణంగా సెలబ్రిటీల దగ్గర ఖరీదైన కార్లు, బంగ్లాలు ఉండటం సాధారణమే. కానీ.. చేతికి పెట్టుకునే గడియారం కోట్లాది రూపాయలు విలువ చేయడం అంటే మామూలు విషయం కాదు. తాజాగా షారుఖ్ ఖాన్ ధరించిన ఒక లగ్జరీ వాచ్ ఇప్పుడు టెక్, ఫ్యాషన్ ప్రపంచాన్ని విపరీతంగా ఆకర్షిస్తోంది.
స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ వాచ్ మేకింగ్ కంపెనీ అయిన ‘గ్లూబెల్ ఫోర్సీ’ (Greubel Forsey) తయారు చేసిన అల్ట్రా-లగ్జరీ మోడల్ వాచ్‌ను షారుఖ్ ఖాన్ ధరించారు.

ఈ వాచ్ పేరు ‘గ్లూబెల్ ఫోర్సీ బ్యాలెన్సియర్ 3’. దీనికి సంబంధించిన బేబీ బ్లూ డయల్ టైటానియం ఎడిషన్ అత్యంత పరిమిత సంఖ్యలో మాత్రమే తయారైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ స్పెషల్ ఎడిషన్ వాచ్‌లు కేవలం 22 పీసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందుకే దీనికి అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది.

ఒక లగ్జరీ ఫ్లాట్ లేదా సూపర్‌కార్ ఖరీదు!

Advertisement

ఈ గ్లూబెల్ ఫోర్సీ బ్యాలెన్సియర్ 3 వాచ్ అధికారిక లిస్ట్ ధర సుమారు 2,05,000 అమెరికన్ డాలర్లుగా ఉంది. ఇది మన కరెన్సీలోకి మారుస్తే అక్షరాల రూ. 1.8 కోట్ల రూపాయలు పలుకుతుంది. ఒక మీడియం రేంజ్ లగ్జరీ ఫ్లాట్.. లేదా అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ కార్ కొనే బడ్జెట్‌లో ఈ సింగిల్ వాచ్ ధర ఉండటం విశేషం. కేవలం వాచ్ మాత్రమే అయినా, దీని హై-ఎండ్ డిజైన్ చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే.

ఈ వాచ్ ప్రత్యేకతలు:

ఈ వాచ్ సాధారణ డిజిటల్ లేదా స్మార్ట్ వాచ్ లాంటిది కాదు.దీని వెనక అద్భుతమైన మెకానికల్ ఇంజనీరింగ్ దాగి ఉంది.

Advertisement

ఓపెన్‌వర్క్ డిజైన్: ఈ వాచ్ డయల్ ఓపెన్‌గా ఉంటుంది.అంటే లోపల ఉన్న గడియారం విడి భాగాలు ఎలా పని చేస్తాయో పైనుంచే స్పష్టంగా చూడొచ్చు. ఇది ఒక చిన్న ఆర్ట్ పీస్‌లా కనిపిస్తుంది.

మాన్యువల్ వైండింగ్ మూవ్‌మెంట్: ఇందులో బ్యాటరీతో పని చేసే సిస్టమ్ ఉండదు. దీన్ని నిరంతరం నడిపించడానికి మ్యాన్యువల్‌గా క్రౌన్‌ను తిప్పి వైండింగ్ చేయాల్సి ఉంటుంది.

Also Read: చిన్నరూమ్స్ కోసం బెస్ట్ స్మార్ట్ టీవీ..తక్కువ ధరలో 1000+ యాప్స్,వాయిస్ కంట్రోల్ ఫ్రీ!

హ్యాండ్‌మేడ్ ఫినిషింగ్: ఈ వాచ్‌లోని ప్రతి విభాగాన్ని నిపుణులు ఎంతో నైపుణ్యంతో చేతితో పాలిష్ చేసి తయారు చేశారు. దీని లోని బ్యాలెన్స్ వీల్, ప్రత్యేకమైన గోల్డ్ స్క్రూలు దీని అందాన్ని మరింత పెంచుతాయి.

షారుఖ్ ఖాన్ ఎక్కడికి వెళ్లినా ఆయన ధరించే బట్టలు, బూట్లు, వాచ్‌లు ఫ్యాషన్ ప్రేమికులకు పెద్ద ట్రెండ్ సెట్టర్‌గా మారుతుంటాయి. ఇప్పటికే షారుఖ్ దగ్గర రోలెక్స్ , ఆడెమార్స్ పిగే , ప్యాటెక్ ఫిలిప్ వంటి ఎన్నో కోట్ల రూపాయల విలువైన వాచ్‌లు ఉన్నప్పటికీ, ఈ తాజా ‘గ్లూబెల్ ఫోర్సీ’ వాచ్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతోంది. అందుకే వాచ్ కలెక్టర్లు ఈ అరుదైన టైమ్‌పీస్ గురించి తెగ సర్చ్ చేస్తున్నారు.

Related News

యాపిల్ బిగ్ ట్విస్ట్.. సెప్టెంబర్‌లో iPhone 18 రావట్లేదట, మరెప్పుడు లాంచ్ అవుతుందో తెలుసా?

చిప్స్ ప్యాకెట్లు కొంటారు కానీ రీఛార్జ్‌కు ఎందుకు ఆలోచిస్తున్నారు? ధరల పెంపుపై ఎయిర్‌టెల్ అధినేత షాకింగ్ కామెంట్స్!

స్మార్ట్‌ఫోన్ స్లో అవ్వడానికి అసలు కారణాలివే.. ఇలా చేస్తే మళ్లీ రాకెట్‌లా పనిచేస్తుంది!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండానే కొత్త ఫోన్‌లోకి eSIM ట్రాన్స్‌ఫర్ చేసుకోండిలా!

రూ.699కే బ్లూటూత్ హెడ్‌ఫోన్..స్టూడెంట్స్ కోసం పర్ఫెక్ట్

రూ.29 వేలకే లక్ష రూపాయల Samsung Galaxy S25 5G.. ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్!

గేమింగ్ ఇయర్‌బడ్స్ కోసం చూస్తున్నారా?వీటిని మించినవి లేవు!

Big Stories

Advertisement
×