BigTV English

Moto G35 5G : రూ.10వేలకే కెవ్వుమనిపించే ఫీచర్స్ తో మోటో మెుబైల్ లాంఛ్

Moto G35 5G : రూ.10వేలకే కెవ్వుమనిపించే ఫీచర్స్ తో మోటో మెుబైల్ లాంఛ్

Moto G35 5G : ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ మోటోరొలా గ్యాడ్జెట్​ ప్రియుల కోసం సరికొత్త స్మార్ట్ ఫోన్లను ఎప్పటికప్పుడు దేశీయ మార్కెట్​లలోకి లాంఛ్ చేస్తూనే ఉంటుంది. అలా ఇప్పుడు ‘జీ’ సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను మొబైల్ ప్రియుల కోసం విడుదల చేసింది. మెటో జీ35 5జీ (Moto G35 5G) పేరిట ఈ మొబైల్ ఫోన్​ను ఆవిష్కరించింది. 50 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా, 5,000mAh బ్యాటరీ కెపాసిటీతో ఈ మొబైల్‌ను మార్కెట్​లోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్​, ఫీచర్స్​ను తెలుసుకుందాం.


Moto G35 5G Mobile Features –

వేరియంట్, ధర వివరాలివే – ఈ మోటో జీ35 5జీ స్మార్ట్ ఫోన్ (Moto G35 5G) ​ను కేవలం ఒక వేరియంట్‌లోనే విడుదల చేసింది మోటోరొలా. 4 జీబీ + 128 జీబీ వేరియంట్​లో దీనిని రిలీజ్ చేసింది. దీని ధర రూ. 9,999గా కంపెనీ నిర్ణయించింది.


ఎక్కడ కొనాలంటే? – ఫ్లిప్‌ కార్ట్‌తో పాటు మోటోరొలా రిటైల్‌ షాపుల్లో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ Moto G35 5Gను​ కొనుగోలు చేయొచ్చు. మూడు రంగుల్లో దీనిని డిజైన్ చేసింది మోటోరొలా. రెడ్‌, లీఫ్‌ గ్రీన్‌, మిడ్‌ నైట్‌ బ్లూ కలర్స్​లో ఈ స్మార్ట్ ఫోన్​ను అందుబాటులో ఉంచింది.

స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఇవే – ఈ Moto G35 5G ఫీచర్స్ (Moto G35 5G Features) విషయానికొస్తే 6.72 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లేతో ఇది వస్తోంది. 120 Hz రిఫ్రెష్‌ రేట్, 240 Hz టచ్‌ సాంప్లింగ్‌ రేటును ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌ను ఇచ్చారు. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 6 ఎస్‌ జనరేషన్‌ 3 ప్రాసెసర్‌తో ఇది నడుస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత హల్లో యూఐ స్కిన్‌తో పని చేస్తుంది.

కెమెరా ఫీచర్స్ – మంచి క్వాలిటీ కెమెరాను అందిస్తోంది మొటోరొలా. బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సల్​ క్వాడ్‌ పిక్సెల్‌ ప్రైమరీ రియర్‌ సెన్సర్‌, అల్ట్రా వైడ్‌ యాంగిల్‌తో 8 మెగా పిక్సల్​ సెన్సర్‌, ఫ్రంట్ సైడ్ సెల్ఫీల కోసం 16 మెగా పిక్సల్​ కెమెరాను అమర్చారు.

డాల్బీ అట్మోస్ – బ్యాక్డ్ స్టీరియో స్పీకర్‌లు, IP 52 రేటింగ్‌ లెదర్‌ ఫినిష్‌తో దీనిని డిజైన్ చేశారు. ఇంకా ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ, 20W వైర్డ్‌ ఛార్జింగ్‌ ఫెసిలిటీ కూడా ఉంది. డ్యూయల్‌ హ్యాండ్‌ వైఫై, బ్లూటూత్‌ 5.0, 3.5 mm ఆడియో జాక్‌, యూఎస్‌బీ టైప్- సీ పోర్ట్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

సో,  మెటో జీ35 5జీ (Moto G35 5G)  మెుబైల్ ఫీచర్స్ ఇవే. ప్రస్తుతానికి మీరు మొటోరొలా కంపెనీ మెుబైల్స్ లో బెస్ట్ మెుబైల్ ను అతి తక్కువ ధరకే కొనానులనుకుంటే ఖచ్చితంగా ఈ మెుబైల్ ను ట్రై చేసేయండి. లేదా రూ.10వేలలోపే మంచి 5జీ స్మార్ట్ ఫోన్​ కొనాలని ఎదురు చూస్తుంటే  కూడా ఇది ట్రై చేయొచ్చు.

ALSO READ :  ఐక్యూ నియో 13 వచ్చేసిందోచ్.. దద్దరిల్లే ఫీచర్స్ తో దిమ్మతిరిగే లాంఛింగ్

Related News

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Big Stories

×