Pawan Kalyan: సినీ సెలబ్రిటీల నుండి రాజకీయ నాయకులుగా మారిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ రెండిటిలో సమానంగా సక్సెస్ సాధించినవారు చాలా తక్కువ. అందులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు కూడా యాడ్ అయ్యింది. రాజకీయాల్లో అడుగుపెట్టాలని, సక్సెస్ సాధించాలని పవన్ ఎప్పటినుండో కలలు కంటున్నారు. అది ఇన్నాళ్లకు సక్సెస్ అయ్యింది. కానీ తను షూటింగ్ మొదలుపెట్టి మధ్యలో ఆపేసిన సినిమాల విషయంలోనే ఎలాంటి క్లారిటీ లేకుండా పోయింది. మొత్తానికి రాజకీయాల నుండి కాస్త బ్రేక్ తీసుకున్న పవన్.. తను మధ్యలో వదిలేసిన సినిమాలను పూర్తిచేయాలని ఫిక్స్ అయ్యారు. అలా రెండు పడవలపై ప్రయాణం మొదలుపెట్టారు.
మళ్లీ సినిమా సెట్‌లోకి
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో గెలిచి డిప్యూటీ సీఎం పదవిని దక్కించుకునే సమయానికి ‘ఓజీ’, ‘హరిహర వీరమల్లు’ వంటి రెండు ప్రాజెక్ట్స్‌ను ఓకే చేశారు. అంతే కాకుండా కొన్నాళ్ల పాటు ఈ రెండు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొన్నారు కూడా. కానీ ఆ తర్వాత ఏపీలో ప్రచారాలు, గెలుపు, డిప్యూటీ సీఎం పదవిని.. ఇలా బ్యాక్ టు బ్యాక్ తన పొలిటికల్ లైఫ్‌లో వచ్చిన మార్పుల వల్ల ఈ సినిమాలు పక్కన పెట్టేయాల్సి వచ్చింది. కానీ పవన్‌ను రాజకీయాల్లో చూడాలనుకున్న ఫ్యాన్స్ కంటే వెండితెరపై తన సినిమాలను చూడాలని ఎదురుచూస్తున్న ఫ్యాన్సే ఎక్కువగా ఉన్నారు. అందుకే తన ఫ్యాన్స్ కోసం మళ్లీ సినిమా సెట్‌లో అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్.
Also Read: మెగా బ్రదర్ కి డబుల్ ధమాకా.. పోస్ట్ పెట్టిన సీరియల్ నటుడు..!
ఫైనల్ షెడ్యూల్
తాజాగా రాజకీయాల నుండి కాస్త బ్రేక్ ఇచ్చి ‘హరిహరవీరమల్లు’ సెట్‌లో అడుగుపెడుతున్నానంటూ తానే స్వయంగా అప్డేట్ ఇచ్చి అందరినీ హ్యాపీ చేశారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ మాత్రమే కాదు.. ‘ఓజీ’ కూడా చివరి షెడ్యూల్‌లోనే ఉంది. అందుకే ముందుగా ‘హరిహర వీరమల్లు’ను పూర్తిచేయాలని పవన్ ఫిక్స్ అయ్యారు. ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్‌లో పవన్ పాల్గొంటున్న ఫోటో ఒకటి తాజాగా బయటికొచ్చింది. అంతే కాకుండా ఈ సినిమా కోసం 2025 మార్చి 28న సిద్ధంగా ఉండండి అంటూ హీరో ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపారు మేకర్స్. దీంతో ఈ మూవీ నుండి మరిన్ని అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
సుజీత్‌పై ఆశలు
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న ‘ఓజీ’ (OG) సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం బ్యాంకాక్‌లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు దర్శకుడు సుజీత్. అసలైతే ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) కోసం కంటే ‘ఓజీ’ గురించి ఎదురుచూస్తున్న ఫ్యాన్సే ఎక్కువగా ఉన్నారు. సుజీత్ లాంటి యంగ్ దర్శకుడు పవన్ కళ్యాణ్‌ను గ్యాంగ్‌స్టర్‌గా ఎలా చూపించబోతున్నాడని ఈ మూవీపై ఆల్రెడీ చాలా బజ్ క్రియేట్ అయ్యింది. మొత్తానికి ఈ రెండు సినిమాల ఫైనల్ షెడ్యూల్స్‌ను పూర్తిచేసి ఫ్యాన్స్‌కు ఒకేసారి ట్రీట్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు.