Akshay Kumar: మామూలుగా హీరో, హీరోయిన్ల పద్ధతి నచ్చకపోతే ప్రేక్షకులు వారికి సలహాలు ఇవ్వడం, ట్రోల్స్ చేయడం చాలా కామన్. సీనియర్ హీరోలు, హీరోయిన్లు కూడా దీని నుండి తప్పించుకోలేరు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌పై కూడా ఇప్పటివరకు అనేక ట్రోల్స్ వచ్చాయి. ముఖ్యంగా సినిమాలను పెద్దగా పట్టించుకోడని, అది ఎంత పెద్ద బడ్జెట్ చిత్రం అయినా కేవలం మూడు నెలలు మాత్రమే కాల్ షీట్స్ ఇస్తాడని బీ టౌన్‌లో అక్షయ్ కుమార్‌పై నెగిటివ్ అభిప్రాయం ఉంది. ఇప్పటివరకు చాలామంది మేకర్స్ కూడా దీనిపై ఓపెన్ స్టేట్‌మెంట్. తాజాగా తన అప్‌కమింగ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో తనపై వస్తున్న ఈ నెగిటివ్ కామెంట్స్‌పై స్పందించాడు అక్షయ్ కుమార్ (Akshay Kumar).
ట్రోల్స్‌పై స్పందన
మూడు నెలల్లో ఒక సినిమా పూర్తి చేయడం అనేది గొప్ప విషయమే. కానీ ఆ మూవీ ఔట్‌పుట్ ఎలా వస్తుందని పట్టించుకోకుండా కేవలం తన షూటింగ్ వరకు పూర్తిచేసి మళ్లీ వెనక్కి తిరిగి చూడడు అంటూ ఇప్పటికే అక్షయ్ కుమార్‌పై ఎంతోమంది మేకర్స్ ఓపెన్ కామెంట్స్ చేశారు. అందుకే తను కేవలం ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు చేయాలని, వాటి ఔట్‌పుట్‌పైనే ఫోకస్ చేయాలని చాలామంది సలహాలు కూడా ఇచ్చారు. తాజాగా తను హీరోగా నటించిన ‘స్కై ఫోర్స్’ అనే మూవీ ట్రైలర్ లాంచ్ జరిగింది. అందులో తనపై వస్తున్న ట్రోల్స్‌పై అక్షయ్ కుమార్ రెస్పాండ్ అయ్యాడు.
Also Read: బాలయ్య సినిమాలో దుల్కర్ సల్మాన్.. ఇదెక్కడి మాస్ కాంబినేషన్ మావా.!
మొదటిసారి కాదు
‘‘నాకు ఇలా జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. ముందు కూడా జరిగింది. కష్టపడుతూ పనిచేయడమే నాకు సంతోషం. చాలామంది నన్ను ఏడాది ఒకటి లేదా రెండు సినిమాలు చేయమని అంటుంటారు. కానీ నాకు పనిచేసే ఓపిక ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదు అని అడుగుతాను. కష్టపడి పనిచేస్తూనే నా కెరీర్‌ను ఇంత వరకు తీసుకురాగలిగాను’’ అని చెప్పుకొచ్చాడు అక్షయ్ కుమార్. చాలావరకు బయోపిక్స్‌తోనే బాక్సాఫీస్ హిట్స్ సాధించాడు అక్షయ్ కుమార్. అదే విధంగా తన అప్‌కమింగ్ మూవీ ‘స్కై ఫోర్స్’ కూడా నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. తను ఎక్కువగా ఇలాంటి కథలనే ఎంచుకోవడానికి కారణం కూడా చెప్పాడు అక్షయ్.
దానికి గర్వపడుతున్నాను
‘‘నేను ఇలాంటి సినిమాలు చేయడం ఆపను. నేను ఇలాంటి సినిమాలతో పాటు ఇతర జోనర్లలో కూడా సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. సర్ఫిరా లాంటి సినిమా చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అది వర్కవుట్ అవ్వకపోయినా పరవాలేదు’’ అని తెలిపాడు అక్షయ్ కుమార్. ఇక ఇటీవల విడుదలయిన ‘స్కై ఫోర్స్’ (Sky Force) ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో అక్షయ్‌తో పాటు వీర్ పహారియా మరొక హీరోగా నటిస్తున్నాడు. సారా అలీ ఖాన్ (Sara Ali Khan) హీరోయిన్‌గా నటించింది. సందీప్ కెవ్లానీ, అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించారు. జనవరి 24న ‘స్కై ఫోర్స్’ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది.