E-Paper
Advertisement

iPhone-Samsung : యాపిల్ కోసం రంగంలోకి దిగిన శామ్‌సంగ్.. ఐఫోన్ 18లో దిమ్మ తిరిగే ఫీచర్

iPhone-Samsung : యాపిల్ కోసం రంగంలోకి దిగిన శామ్‌సంగ్.. ఐఫోన్ 18లో దిమ్మ తిరిగే ఫీచర్
Advertisement

iPhone 500MP Camera : దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శామ్‌సంగ్ (Samsung).. టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్స్ (Apple iPhone) కోసం మరో ముందడుగు వేయనుంది. యాపిల్ కు కెమెరా సెన్సార్స్ విక్రయించడానికి ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా 500MP సెన్సార్ (500 MP Sensor) ను అభివృద్ధి చేయడానికి నిర్ణయించుకుంది.

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న యాపిల్ కంపెనీ దాని ఐఫోన్ కెమెరా సెన్సార్ కోసం ప్రస్తుతం సోనీ పై ఆధారపడింది. ఇప్పటివరకూ ఐఫోన్ సెన్సార్స్ సోనీ అందిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు శాంసాంగ్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. కొత్త డిజైన్ తో పాటు వేగవంతమైన ఇమేజ్ ప్రాసెసింగ్, మెరుగైన నాయిస్ కాన్సిలేషన్ తో కొత్త సెన్సార్లు తీసుకురానున్నట్టు తెలుస్తోంది. సోనీకి గట్టి పోటీ ఇస్తూ ఈ సెన్సార్స్ ను రంగంలోకి దించనున్నట్లు సమాచారం. శాంసంగ్ ఈ కెమెరా సెన్సార్ లో కొత్త అప్ గ్రేడ్స్ ను తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. బెస్ట్ క్వాలిటీతో మరింత క్లియర్ ఇమేజెస్ ను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

ఇప్పటివరకూ యాపిల్ కు కెమెరా సెన్సార్ ను అందిస్తున్న ఏకైక సరఫరా సంస్థగా సోనీ నిలిచింది. అయితే ఇప్పుడు సాంసంగ్ కొత్త డిజైన్తో రంగంలోకి దిగటంతో భవిష్యత్తుతో వచ్చే ఐఫోన్స్ లో ఈ సెన్సార్స్ ఉండనున్నట్టు సమాచారం. టెక్ వర్గాల అంచనా ప్రకారం 2026 లో రాబోతున్న ఐఫోన్ 18 నుంచి ఈ సెన్సార్ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. స్మార్ట్ ఫోన్ ఫోటోగ్రఫీ స్టాండర్డ్స్ ను మరింత పెంచుతూ ఈ సెన్సార్స్ రాబోతున్నాయని సమాచారం. ఇక ఈ సెన్సార్ లో అల్ట్రా హై రిజల్యూషన్ 500 ఎంపీ సెన్సార్ సైతం కలిగి ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఇమేజింగ్ టెక్నాలజీలో యూజర్స్ ను మరింత ఆకట్టుకునే రీతిలో డిజైన్ వచ్చే అవకాశం ఉంది.

సాంసంగ్ తీసుకురాబోతున్న ఈ సెన్సార్ మూడు లేయర్స్ డిజైన్ తో రానుంది. ఈ కాన్ఫిగరేషన్ లో లైటింగ్ ను అబ్జార్బ్ చేయడానికి ఫోటోడియోడ్ లేయర్, సౌండ్ తగ్గించడానికి ట్రాన్స్ఫర్ లేయర్, బెస్ట్ ఫోటోగ్రఫీ కోసం లాజిక్ లేయర్ రాబోతున్నాయి. ఇందులో ట్రాన్స్ఫర్ లేయర్ కొత్తగా పరిచయం కాబోతుంది. ఈ ఫీచర్స్ ఇప్పటివరకు ఉన్న సోనీ సెన్సార్ లో లేకపోవడం శాంసంగ్ కు కలిసి వచ్చే అవకాశంగా తెలుస్తుంది.

Advertisement

ఇందులో డిజైన్, ప్రాసెసర్ ను సెన్సార్ నేరుగా మౌంట్ చేయటంతో స్పీడ్ డేటా ప్రాసెసింగ్ ఉంటుంది. ఫోటోను క్యాప్చర్ చేసి బదిలీ చేయడానికి తీసుకునే సమయం సైతం చాలా వరకూ తగ్గే ఛాన్స్ ఉంది. మొత్తంగా ఇమేజ్ క్వాలిటీ కూడా పెరుగుతుంది

ఇక సామ్సాంగ్ తీసుకురాబోతున్న ఈ సెన్సార్.. ఐఫోన్ ఫీచర్స్ తో బెస్ట్ అప్ గ్రేడ్ ను ఇస్తున్నట్టు టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ లో రాబోతున్న ఐఫోన్ 17 లో ఈ సెన్సార్లు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉండటంతో ఐఫోన్ 18 నుంచి శామ్సాంగ్ సెన్సార్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

ALSO READ : స్పేస్‌లో మొలకెత్తిన అలసంద.. ఇస్రో అద్భుత ఘనత

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×