Jobs in Hydra: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హైడ్రా అంటే తెలియని వారు ఉండరు. అయితే తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు హైడ్రా గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్ట్ విధానలో హైడ్రాలో 970 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 970
త్వరలోనే హైడ్రా 970 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. ఇందులో 203 మంది మేనేజర్లు, 767 మంది అసిస్టెంట్లను నియమించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా విడుదల చేయలేదు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఈ ఉద్యోగాలకు సెలెక్టైన అభ్యర్థులకు 7 ప్యాకేజీలుగా విభజించనున్నారు. 2 మేనేజర్లకు, 5 అసిస్టెంట్లకు ప్యాకేజీలు ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగుల వేతనాలు సంవత్సరానికి రూ.31.70 కోట్లకుపైగా ఖర్చు అవుతుందని హైడ్రా అధికారులు అంచనా వేశారు. మేనేజర్లకు నెలకు రూ.22,750, అసిస్టెంట్లకు రూ.19,500 ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా అధికారికంగా మాత్రం ఎక్కడా వేతనం గురించి ప్రకటించలేదు.
చేయాల్సిన విధులు:
*ఈ ఉద్యోగాలకు నిర్మాణాలు, ఆక్రమణలను గుర్తించాలి.
*హైదరాబాద్ పరిధిలోని ఖాళీ స్థలాలు, నీటి వనరులు, పార్కులు, లే అవుట్, ప్రభుత్వ భూములు, ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించిన నాలాలను రక్షణకు చర్యలు చేపట్టాలి.
Also Read: Education Department Jobs: విద్యాశాఖలో 255 ఉద్యోగాలు.. నెలకు రూ.30,000.. ఈ అర్హతలు ఉంటే చాలు..!
త్వరలోనే హైడ్రా పోలీస్‌స్టేషన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ చర్యలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. ఇక హైడ్రాకు ప్రభుత్వం నుంచి అన్నివిధాల సహకారం ఉందని, అక్రమ కట్టాడాలు కూల్చివేతల విషయంలో కోర్టు తీర్పులు కూడా స్పష్టంగా ఉన్నాయని రంగనాథ్ వెల్లడించారు. ఇక మరికొన్ని రోజుల్లో హైడ్రా ఎఫ్ఎం ఛానెల్ కూడా తీసుకురానున్నట్లు తెలుస్తోంది.