E-Paper
Advertisement

Best AI Smartphones: మీకు నచ్చిన.. మీరు మెచ్చిన బెస్ట్ AI స్మార్ట్‌ఫోన్స్.. తక్కువ ధరలోనే కొనేయండి!

Best AI Smartphones: మీకు నచ్చిన.. మీరు మెచ్చిన బెస్ట్ AI స్మార్ట్‌ఫోన్స్.. తక్కువ ధరలోనే కొనేయండి!
Advertisement

Best Artificial Intelligence Smartphones Under Rs 35,000: ప్రస్తుతం మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్ల హవా జోరుగా కొనసాగుతోంది. ఫోన్ ప్రియుల టేస్ట్‌కి తగ్గట్టుగా ప్రముఖ కంపెనీలు తమ ఫోన్లలో కొత్త కొత్త టెక్నాలజీలతో ఫీచర్లను అందించి ఆకట్టుకుంటున్నాయి. సరికొత్త టెక్నాలజీ, ఫీచర్లతో వస్తున్న అనేక ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో ఉన్నాయి. అందులో అందరికళ్లు AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఫీచర్లు కలిగిన ఫోన్లపైనే ఉన్నాయి. మరి మీరు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో వచ్చే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇక్కడ రూ.35,000 లోపు కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. అందులో మీకు నచ్చిన మొబైల్‌ను ఎంచుకుని కొనుక్కోవచ్చు.

Realme GT 6T

Advertisement

Realme GT 6T స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన 6.78 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ గేమింగ్‌కు కూడా చాలా బెటర్. Flipkartలో దాని 8GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,036గా ఉంది.

Redmi Note 13 Pro+5G

Advertisement

Redmi Note 13 Pro+5G ఫోన్ 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది 1800 nits బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇందులో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ వంటివి ఉన్నాయి. అద్భుతమైన ఫోటోలు తీయడానికి ఇది గొప్ప ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ.30,999గా ఉంది. అయితే దీనిపై ఇతర బ్యాంక్ ఆఫర్లు కూడా పొందొచ్చు. అప్పుడు మరింత తక్కువ ధరకే ఇది లభిస్తుంది.

Also Read: బెస్ట్ ఫోన్లు.. ఎక్స్‌లెంట్ కెమెరా, బ్యాటరీ.. ధర కూడా తక్కువే!

iQOO Neo 9 Pro

iQOO Neo 9 Pro స్మార్ట్‌ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది 3000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.78 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. ఇది గేమ్ ప్రియుల కోసం ప్రత్యేక AI వాయిస్ ఛేంజర్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. Amazonలో దీని ధర రూ.34,999గా నిర్ణయించబడింది.

Oppo Reno 11 Pro

Oppo Reno 11 Pro స్మార్ట్‌ఫోన్‌లో వినియోగదారులు 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ మద్దతుతో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేను పొందుతారు. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 32 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ గొప్ప ఫోటోలు, వీడియోల కోసం అనేక AI ఫీచర్లను కలిగి ఉంది. ఇది అమెజాన్‌లో రూ.35,490కి అందుబాటులో ఉంది.

Also Read:Amazon Discount Tricks: డిస్కౌంట్ ట్రిక్స్.. ధరలు భారీగా తగ్గుతాయి.. జస్ట్ ఫాలో దిస్!

Vivo V30

Vivo V30 స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది రెండు 50-మెగాపిక్సెల్ లెన్స్‌లతో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. AI ఫీచర్ల సహాయంతో, అద్భుతమైన ఫోటోలు, వీడియోలను సృష్టించవచ్చు. 5000 mAh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అమెజాన్ నుండి రూ.28,839కి ఆర్డర్ చేయవచ్చు.

Related News

ఏంది భయ్యా ఇది.. జియోలో రూ.350 లోపు.. ఇంత మంచి ప్లాన్స్ ఉన్నాయా!

గూగుల్ డ్రైవ్‌లో ఫైళ్లు వెతకలేక విసుగొస్తుందా? ఈ సూపర్ ట్రిక్స్ వాడితే క్షణాల్లో పని పూర్తి!

కన్నుల పండుగే.. ఏకంగా రూ.18,000 తగ్గింది, ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ బంపర్ డిస్కౌంట్!

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

Big Stories

Advertisement
×