Diwali Special Sweet: ప్రతి ఏడాది దీపావళి నాడు జైపూర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. స్వీట్ తయారీకి పేరొందిన జైపూర్ ఈ ఏడాది కూడా ఓ ప్రత్యేకమైన స్వీట్ ను తయారుచేసింది. జైపూర్ చెందిన ఓ వ్యాపారి స్వచ్ఛమైన బంగారంతో స్వీట్ ను తయారు చేశారు. అయితే దీని ధర అందర్నీ ఆకర్షిస్తుంది. ‘జైపూర్ స్వర్ణ ప్రసాదం’గా పిలుస్తున్న ఈ స్వీట్ ధర కేజీ రూ.1.11 లక్షలు. ఇది దేశంలోని అత్యంత ఖరీదైన స్వీట్ గా చెప్పవచ్చు.
రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని ఒక మిఠాయి దుకాణం 24 క్యారెట్ల బంగారంతో రూ.1,11,000 విలువైన ‘స్వర్ణ ప్రసాదం’ అనే స్వీట్ ను తయారు చేసింది. దీనిని ‘స్వర్ణ భస్మ’ అని పిలుస్తారు.
“ఈ స్వీట్ భారతదేశంలో అత్యంత ఖరీదైన స్వీట్. దీని ధర రూ. 1,11,000. దీని తయారీ, ప్యాకేజింగ్ కూడా చాలా ప్రీమియం. ఈ స్వీట్ ను ఒక ఆభరణాల పెట్టెలో ప్యాక్ చేస్తారు. ఈ స్వీట్ ను చిల్గోజా నుండి తయారు చేస్తారు. అది అత్యంత ఖరీదైన ప్రీమియం డ్రై ఫ్రూట్. ఈ స్వీట్ ను తినదగిన బంగారంతో తయారుచేశారు. స్వర్ణ భస్మ అని కూడా పిలిచే 24 క్యారెట్ల బంగారం ఇందులో ఉంది.
జైన దేవాలయం నుండి కొనుగోలు చేసిన బంగారం నుంచి తయారు చేశాం. దీనిపై కుంకుమపువ్వు పూత, కొన్ని పైన్ గింజల ముక్కలతో అలంకరించారు. అందుకే దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది” అని స్వీట్ దుకాణం వ్యాపారి తెలిపారు.
ఈ స్వీట్ ను 24 క్యారెట్ల తినదగిన బంగారంతో తయారుచేశారు. బంగారంతో చేసిన భక్తిపూర్వక నైవేద్యం. ఈ స్వీట్ ఖరీదైనది మాత్రమే కాదు. ఇందులో ఆయుర్వేద, ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ధనత్రయోదశి నాడు ఈ స్వీట్ ను ప్రారంభించారు. దీనిపై వెండి పూత, కుంకుమపువ్వు, బాదం, పైన్ గింజలు ప్రీమియం డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించారు.
ఇలాంటి ఖరీదైన స్వీట్ తయారు చేయడం జైపూర్ లో ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం స్వర్ణ భాషమ్ పాక్ పేరుతో బంగారం, వెండితో స్వీట్ తయారు చేశారు. దీని ధర కిలోగ్రాముకు రూ.70,000.
#WATCH | Jaipur, Rajasthan | A sweet shop in Jaipur launches a sweet named 'Swarn Prasadam' priced at Rs 1,11,000 infused with 24 carat edible gold, known as Gold ashes or 'Swarn Bhasma' pic.twitter.com/qrZSaYFCn2
— ANI (@ANI) October 18, 2025
జైపూర్ స్వీట్ తయారీదారులు కొత్త తరహా స్వీట్ తయారీలో రికార్డులు సృష్టిస్తు్న్నారు. ప్రతి పండుగకు ప్రత్యేకమైన స్వీట్లు తయారుచేస్తుంటారు. దీపావళి పండుగను జైపూర్ లో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. జైపూర్ సిటీని దీపావళికి రెడీ చేస్తున్నారు. రెండు లక్షల వీధి దీపాలను సిద్ధం చేస్తున్నారు.