BigTV English

Thomas Matthew Crooks| ‘ఒంటరిగా ఉండేవాడు.. అందరూ అతడిని ఏడ్పించేవారు’.. ట్రంప్ షూటర్ స్నేహితులు

అమెరికా మాజీ అధ్యక్షుడిపై కాల్పులు జరిపిన షూటర్ థామస్ మ్యాథ్యూ క్రూక్స్ గురించి ఇప్పుడంతా చర్చ జరుగుతోంది. అమెరికాలో క్రూక్స్ గురించి ఇంటర్నెట్ ఇప్పుడు ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. క్రూక్స్.. గురించి విచారణలో షాకింగ్ వివరాలు తెలిశాయి.

Thomas Matthew Crooks| ‘ఒంటరిగా ఉండేవాడు.. అందరూ అతడిని ఏడ్పించేవారు’.. ట్రంప్ షూటర్ స్నేహితులు

Thomas Matthew Crooks| అమెరికా మాజీ అధ్యక్షుడిపై కాల్పులు జరిపిన షూటర్ థామస్ మ్యాథ్యూ క్రూక్స్ గురించి ఇప్పుడంతా చర్చ జరుగుతోంది. అమెరికాలో క్రూక్స్ గురించి ఇంటర్నెట్ ఇప్పుడు ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. క్రూక్స్.. గురించి విచారణలో షాకింగ్ వివరాలు తెలిశాయి.


పెన్సిల్వేనియాలో బెథెల్ పార్క్ హై స్కూల్ నుంచి 2022లో డిగ్రీ పూర్తి చేసిన థామస్ ఒక మంచి విద్యార్థి అని అతని స్నేహితులు, టీచర్స్ చెప్పారు. కానీ అతను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదని.. ఒంటరిగా ఉండేవాడని అన్నారు. ముఖ్యంగా అతను మిలిటరీ డ్రెస్‌లు వేసుకునే వాడని తెలిపారు. ఎక్కువగా హంటింగ్ వీడియో గేమ్స్ ఆడేవాడు. ఎవరితో ఎక్కువగా కలవకుండా.. అమాయకంగా, వింతగా ఉండడంతో స్కూల్‌లో అతడిని అందరూ ఆటపట్టించడం, ఏడ్పించడం చేసేవారు.

Also Read: అబ్రహం లింకన్ నుంచి డోనాల్డ్ ట్రంప్ వరకు.. తుపాకీ దాడులకు గురైనవాళ్లు వీరే


తనకు 2021లో 18 ఏళ్ల నిండగానే క్రూక్స్.. రిపబ్లికన్ పార్టీలో సభ్యత్వం కోసం రిజిస్టర్ చేసుకున్నారు. కానీ మరోవైపు అతను అదే సమయంలో బైడెన్ పార్టీకి విరాళం కూడా ఇవ్వడంతో క్రూక్స్.. డెమొక్రాట్స్ పార్టీ సమర్థకుడా లేక రిపబ్లికన్ పార్టీ సమర్థకుడా అని రాజకీయ చర్చ జరుగుతోంది.

స్కూల్లో క్రూక్స్‌తోపాటు చదివిన అతని స్నేహితురాలు సారా డి ఏంజిలో మాట్లాడుతూ.. ”క్రూక్స్ రాజకీయాల్లో తనకు ఆసక్తి ఉందని ఎప్పుడూ చెప్పలేదు. ట్రంప్ అంటే అతనికి ద్వేషమని కూడా ఏ సందర్భంలోనూ బయటపడలేదు. కానీ అతను ఒక మంచి స్టూడెంట్. ఎప్పుడూ ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడేవాడు. మిగతా ఫ్రెండ్స్‌తో ఎక్కువగా కలిసేవాడు కాదు.” అని చెప్పింది.

ట్రంప్ పై కాల్పులు జరిపిన సమయంలో కూడా క్రూక్స్ ఒక మిలిటరీ హంటింగ్ డ్రెస్ ధరించి ఉన్నాడని స్థానిక మీడియా తెలిపింది. ట్రంప్ ఎన్నికల ర్యాలీ నిర్శహిస్తున్న ప్రదేశంలో సమీపంలోని ఒక ఫ్యాక్టరీపై క్రూక్స్ తన తండ్రికి చెందిన ఏకె-47 రైఫిల్‌ తీసుకొని వెళ్లాడు. ట్రంప్ ప్రసంగం మొదలుపెట్టిన కాసేట్లోనే క్రూక్స్ కాల్పులు మొదలుపెట్టాడు. ఈ దాడిలో ట్రంప్ చెవికి గాయం కాగా.. 50 ఏళ్ల కోరె కొంపెరెటోర్ అనే రిపబ్లికన్ వాలంటీర్ చనిపోయాడు. బుల్లెట్.. ట్రంప్ చెవికి తగిలి.. ఆ తరువాత ట్రంప్ వెనుక ఉన్న కోరె శరీరంలో దిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాయ్యాయి.

రక్షన సిబ్బంది వెంటనే క్రూక్స్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించి అతనిపై కాల్పులు జరిపింది. ఆ తరువాత అతనికి సంబంధించిన కార్ లో ఎఫ్‌బిఐకి బాంబులు కూడా దొరికాయని సమాచారం.

Tags

Related News

Kiren Rijiju: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఇదిగో వీడియో

Jammu Kashmir: భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు, స్పాట్‌లో ఐదుగురు మృతి

Crime: భార్యలను చంపుతున్న భర్తలు.. అసలు కథ ఇదే..!

Anantapur News: అనంతలో ట్రయాంగిల్‌ లవ్‌‌.. ప్రియురాలి బెదిరింపులు, మరో యువతి సూసైడ్

Medipally News: కాళ్లు, చేతులు, తల లేకుండానే స్వాతి అంత్యక్రియలు..

Hyderabad News: నడిరోడ్డుపై రెచ్చిపోయారు.. క్రికెట్ బ్యాట్‌తో బైకర్స్‌పై దాడి చేసి, మేటరేంటి?

Big Stories

×