Visakhapatnam: విశాఖలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. గాజువాక సమతా నగర్ సమీపంలో ఓ భారీ లారీ అదుపు తప్పి కొబ్బరి బోండాలు అమ్మే మహిళ పైకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కి తరలించారు. యాక్సిడెంట్‌కు డ్రైవర్ నిద్రమత్తే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.