Diwali mobile photography tips: దీపావళి వచ్చిందంటే.. ఇళ్లన్నీ రంగు రంగుల దీపాలతో, కాంతులతో కళకళలాడుతుంటాయి. ఈ పండగ రాత్రి ఆనంద క్షణాలను , అందమైన దీపాల వెలుగులను మొబైల్ ఫోన్లలో బంధించాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. అయితే.. కొన్నిసార్లు మనం తీసే ఫోటోలు సరిగ్గా రావు, మసక బారడం లేదా అతిగా కాంతి ఉండటం జరుగుతుంది. దీపావళి రాత్రి సమయంలో మీ స్మార్ట్ ఫోన్‌తోనే అద్భుతమైన , ప్రొఫెషనల్ లెవెల్ ఫోటోలు రావడానికి మీ ఫోన్ కెమెరాలో చేసుకోగల 5 చిన్న మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనం తరచూ గమనించని.. అతి పెద్ద పొరపాటు కెమెరా లెన్స్ మురికిగా ఉండటం. మన జేబుల్లో.. లేదా చేతుల్లో ఉండే ఫోన్ కెమెరాపై వేలిముద్రలు పడి ఉంటాయి. దీపావళి రాత్రి దీపాల కాంతిలో ఫోటోలు.. తీసేటప్పుడు ఈ మురికి కారణంగా కాంతి అనూహ్యంగా స్ప్రెడ్ అయిపోయి ఫోటోలు బ్లర్‌గా వస్తాయి. కాబట్టి.. ఫోటోలు తీసే ముందు మృదువైన క్లాత్ తో లెన్స్‌ను శుభ్రంగా తుడుచుకోవడం మొదటి మెట్టు.
దీపాల వెలుతురులో.. ఫోటోలు తీసేటప్పుడు కెమెరా ఆటోమేటిక్‌గా వెలుతురును అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. దీని వల్ల దీపాలు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాయి. దీన్ని.. నివారించడానికి మీరు ఎవరినైనా.. లేదా ఏదైనా దీపాన్ని ఫోకస్ చేసి స్క్రీన్‌పై లాంగ్ ప్రెస్ చేయండి. అప్పుడు ‘AE/AF Lock’ వస్తుంది. ఇప్పుడు కాంతిని కొద్దిగా తగ్గించడానికి స్లైడర్‌ను కిందకు జరపండి. దీని వల్ల బ్యాక్‌గ్రౌండ్ డార్క్ గా ఉండి.. దీపాల వెలుగు చాలా అందంగా హైలైట్ అవుతుంది.
ప్రస్తుత కాలంలో వచ్చే ప్రతి స్మార్ట్ ఫోన్‌లోనూ ‘నైట్ మోడ్’ఆప్షన్ ఉంటోంది. చీకటి పడిన తర్వాత లేదా దీపాల కాంతిలో ఫోటోలు తీసేటప్పుడు.. ఈ మోడ్‌ను ఆన్ చేయడం మర్చిపోవద్దు. ఇది పరిసరాల్లో.. ఉన్న తక్కువ వెలుతురును కూడా.. గ్రహించి స్పష్టమైన, ప్రకాశ వంతమైన ఫోటోలను అందిస్తుంది. నైట్ మోడ్‌లో ఫోటో తీసేటప్పుడు.. ఫోన్ కదలకుండా కొన్ని సెకండ్లు స్థిరంగా పట్టుకోవాలి.
చాలా మంది చీకటిగా ఉందని.. ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఫోటోలు తీస్తుంటారు. ఇది దీపావళి ఫోటోలకు అసలు సరి పోదు. ఫ్లాష్ లైట్ వల్ల.. ఫోటోలో ఉన్న సహజమైన దీపాల కాంతి మసకబారిపోతుంది. ముఖాలపై అతిగా.. కాంతి పడుతుంది. కాబట్టి.. ఫ్లాష్ లైట్‌ను ఆఫ్ చేసి, సహజమైన దీపాల వెలుతురులో.. లేదా చుట్టు పక్కల ఉన్న లైటింగ్ సహాయంతో ఫోటోలు క్యాప్చర్ చేయండి.
Also Read: స్వీట్లకు బదులుగా.. దీపావళికి ఈ 5 గాడ్జెట్లను బహుమతిగా ఇవ్వండి!
మీ ఫోన్ కెమెరా సెట్టింగ్స్‌లో ‘గ్రిడ్’ఆప్షన్‌ను ఆన్ చేసుకోండి. ఇది స్క్రీన్‌పై.. గడులలా కనిపిస్తుంది. దీని వల్ల ఫోటోలో.. మనం తీయాలనుకునే సబ్జెక్ట్ (దీపం, రంగోలి లేదా వ్యక్తి) సరిగ్గా సెంటర్‌లో.. లేదా రూల్ ఆఫ్ థర్డ్స్ ప్రకారం.. పర్ఫెక్ట్ యాంగిల్‌లో వచ్చేలా సెట్ చేసుకోవచ్చు. అలాగే.. నిలబడి ఫోటో తీయకుండా, కొద్దిగా కిందికి వంగి ఫోటోలు తీస్తే.. ఫ్రేమ్ చాలా రిచ్‌గా వస్తుంది.
ఈ దీపావళి పండగ సందర్భంగా ఈ చిన్న చిన్న టెక్నిక్స్ , సెట్టింగ్స్ మార్పులను పాటించి .. మీ స్మార్ట్ ఫోన్‌తో అద్భుత మైన ఫోటోలను క్లిక్ చేయండి. సోషల్ మీడియాలో.. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో.. పంచుకుని.. ఈ పండగ జ్ఞాపకాలను చిరస్థాయిగా నిలుపుకోండి! హ్యాపీ దీపావళి!