WhatsApp chat lock feature: స్మార్ట్‌ఫోన్ మన చేతిలో.. ఉందంటే చాలు, ప్రైవసీ అనేది అందరికీ చాలా ముఖ్యం. ముఖ్యంగా మన వాట్సాప్ చాట్స్‌లో ఎన్నో పర్సనల్ విషయాలు, సీక్రెట్ మెసేజ్‌లు, ఫొటోలు ఉంటాయి. ఎవరైనా సడన్‌గా ఫోన్ అడిగితే, వాట్సాప్ ఓపెన్ చేస్తారేమోనని గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే వాట్సాప్ అప్పట్లో ‘యాప్ లాక్’ తీసుకొచ్చింది. అయితే.. యాప్ మొత్తం లాక్ చేస్తే ఫోన్ తీసుకున్న వాళ్లకు మనం ఎందుకు లాక్ చేశామనే అనుమానం వస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే వాట్సాప్ ఒక సూపర్ ఫీచర్ తెచ్చింది… అదే ‘చాట్ లాక్’.
వాట్సాప్ మొత్తం లాక్ చేయాల్సిన అవసరం లేకుండా..వలం మీకు నచ్చిన పర్సనల్ ఛాట్ మాత్రమే వేరుగా లాక్ చేసి దాచుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ ఆన్ చేస్తే.. ఆ ప్రత్యేకమైన చాట్ మెయిన్ చాట్ లిస్ట్ నుంచి మాయమై, పైభాగంలో Locked Chats అనే ఫోల్డర్‌లోకి వెళుతుంది. దీన్ని ఓపెన్ చేయాలంటే మీ ఫింగర్ ప్రింట్ , ఫేస్ అన్లాక్ లేదా పాస్‌కోడ్ కచ్చితంగా ఉండాల్సిందే. ఎవరికీ మీ సీక్రెట్ చాట్స్ అసలు కనిపించవు.
ఈ అద్భుతమైన ఫీచర్‌ను మీ వాట్సాప్‌లో సెట్ చేసుకోవడం చాలా ఈజీ. కింద చెప్పిన స్టెప్స్ ఫాలో అయిపోండి.
వాట్సాప్ ఓపెన్ చేయండి: ముందుగా.. మీ ఫోన్‌లో వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయండి.
కాంటాక్ట్ లేదా గ్రూప్ : మీరు ఏ పర్సనల్ చాట్ అయితే.. లాక్ చేయాలనుకుంటున్నారో, వారి ప్రొఫైల్ లేదా చాట్ మీద క్లిక్ చేయండి.
ప్రొఫైల్ ఇన్ఫో: పైన వారి పేరు లేదా ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేస్తే.. వారి కాంటాక్ట్ ఇన్ఫో పేజీ ఓపెన్ అవుతుంది.
చాట్ లాక్ ఆప్షన్ : ఆ పేజీని కొంచెం కిందకు స్క్రోల్ చేస్తే మీకు ‘Chat Lock’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి.
లాక్ ఎనేబుల్ చేయండి: అక్కడ ‘Lock this chat with fingerprint’ (లేదా మీ ఫోన్‌ను బట్టి Face ID) ఆప్షన్‌ని ఆన్ చేయండి. మీ ఫోన్ ఫింగర్ ప్రింట్ లేదా పాస్‌వర్డ్ ఇవ్వగానే ఆ చాట్ లాక్ అయిపోతుంది.
ఇలా ఒక్కసారి చేశారంటే చాలు.. ఆ కాంటాక్ట్ నుండి వచ్చే మెసేజ్‌లు సాధారణ చాట్ లిస్ట్‌లో కనిపించవు. నోటిఫికేషన్స్‌లో కూడా మెసేజ్ టెక్స్ట్ కనిపించకుండా ప్రైవసీ ఉంటుంది.
Also Read: తక్కువ సిబిల్ స్కోరు.. మీ లోన్ రిజెక్ట్ చేస్తుందా?ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
సీక్రెట్ ఫోల్డర్: లాక్ చేసిన చాట్స్ అన్నీ చాట్ లిస్ట్.. పైభాగంలో ‘Locked Chats’ అనే ప్రత్యేక ఫోల్డర్‌లో ఉంటాయి. దీన్ని చూడాలంటే.. స్క్రీన్‌ను కిందకు స్వైప్ చేయాలి.
మీడియా ప్రైవసీ: లాక్ చేసిన చాట్ నుంచి వచ్చే ఫొటోలు, వీడియోలు మీ ఫోన్ గ్యాలరీలో ఆటోమేటిక్‌గా.. సేవ్ కాకుండా ఆటోమేటిక్‌గా హైడ్ అవుతాయి. దీని వల్ల ఫొటోల ప్రైవసీ కూడా సేఫ్ గా ఉంటుంది.
పూర్తి సేఫ్టీ: మీ ఫోన్ పాస్‌వర్డ్ లేదా బయోమెట్రిక్ లేనిదే ఎవరూ.. ఆ లాక్డ్ చాట్స్‌ను ఓపెన్ చేయలేరు.
వాట్సాప్ అందించే ఈ చాట్ లాక్ ఫీచర్ పూర్తిగా ఉచితం . దీని కోసం ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆండ్రాయిడ్ , ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ రన్నింగ్ చేసే అన్ని లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. గూగుల్ లేటెస్ట్ సెక్యూరిటీ అప్‌డేట్స్‌కు అనుగుణంగా యూజర్ల ప్రైవసీని కాపాడటంలో ఇది అగ్రస్థానంలో నిలుస్తోంది.