Best vlogging camera for beginners: మీ ప్రయాణాలు, లైఫ్ స్టైల్ లేదా మీకు నచ్చిన విషయాలను కెమెరాలో.. బందీ చేసి ప్రపంచంతో పంచుకోవాలని అనుకుంటున్నారా? అయితే వ్లాగింగ్ ప్రపంచంలోకి.. అడుగుపెట్టడానికి ఇదే సరైన సమయం. అయితే మొదటి సారి వ్లాగింగ్ చేసేవారు.. ఏ కెమెరా కొనాలి? ఏ లెన్స్ బాగుంటుంది? ఆడియో క్లారిటీ కోసం ఏ మైక్రోఫోన్ వాడాలి? అనే.. కన్ఫ్యూజన్‌తో.. సతమత మవుతుంటారు. మీ ఈ అయోమయాన్ని తొలగించడానికి, పర్ఫెక్ట్ వ్లాగింగ్ గేర్‌ను ఎంచుకోవడానికి ఈ విషయాలు మీకు పూర్తిగా సహాయ పడతాయి.
మొదటి సారి వ్లాగింగ్ చేసే వారు చాలా ఖరీదైన ఫ్లాగ్‌షిప్ కెమెరాలను కొనాల్సిన అవసరం లేదు. మీ స్మార్ట్‌ఫోన్ లేదా ఒక మంచి మిర్రర్‌లెస్ కెమెరాతో ప్రారంభించొచ్చు.ఇందు కోసం కెమెరాలో ఫ్లిప్ స్క్రీన్ ఉండటం చాలా ముఖ్యం. దీనివల్ల మనం మాట్లాడేటప్పుడు మనల్ని మనం స్క్రీన్‌పై స్పష్టంగా చూసుకోవచ్చు. అలాగే 4K వీడియో రికార్డింగ్ , మంచి ఆటో-ఫోకస్ సిస్టమ్ ఉన్న కెమెరాను ఎంచుకోవాలి.
బడ్జెట్ ఆప్షన్స్: సోనీ (Sony ZV సిరీస్) లేదా కానన్ (Canon) బ్రాండ్లకు చెందిన ఎంట్రీ-లెవెల్ వ్లాగింగ్ కెమెరాలు బిగినర్స్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోతాయి.
మీరు ఇంటర్చేంజబుల్ లెన్స్ కెమెరాను కొన్నట్లయితే, లెన్స్ ఎంపిక చాలా కీలకం. వ్లాగింగ్ చేసేటప్పుడు కెమెరా మన ముఖానికి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి వైడ్-యాంగిల్ లెన్స్ అవసరం.
ఏం చూడాలి?: 16mm నుంచి 35mm లేదా 18-55mm లెన్సులు వ్లాగింగ్‌కు అద్భుతంగా పని చేస్తాయి. ఇవి.. బ్యాక్‌గ్రౌండ్‌ను కొంతవరకు కవర్ చేస్తూ.. మిమ్మల్ని స్పష్టంగా హైలైట్ చేస్తాయి. ప్రైమ్ లెన్సులు తక్కువ వెలుతురులో.. కూడా మంచి వీడియో క్లారిటీ ఇస్తాయి.
వీడియో క్వాలిటీ ఎంత ముఖ్యమో, ఆడియో క్వాలిటీ.. అంతకంటే ముఖ్యం. ప్రేక్షకులు మీ వీడియో.. చూడటం ఆపే యడానికి చెడు ఆడియోనే ప్రధాన కారణం అవుతుంది. కాబట్టి కెమెరాలో.. వచ్చే బిల్ట్-ఇన్ మైక్‌పై పూర్తిగా.. ఆధార పడకండి.
ఏం చూడాలి?: మీరు బయట షూట్ చేసేవారైతే ‘షాట్‌గన్ మైక్’లేదా వైర్ లెస్ కాలర్ మైక్ ఎంచుకోవడం బెస్ట్. ఇది చుట్టుపక్కల వచ్చే.. అనవసరమైన సౌండ్స్ తగ్గించి, మీ గొంతును స్పష్టంగా రికార్డ్ చేస్తుంది.
Also Read: స్వీట్లకు బదులుగా.. దీపావళికి ఈ 5 గాడ్జెట్లను బహుమతిగా ఇవ్వండి!
వీడియోలు తీసేటప్పుడు కెమెరా చేతిలో.. ఉండి షేక్ అవ్వకుండా.. ఉండటానికి ఒక మంచి మినీ ట్రైపాడ్ లేదా గింబాల్ అవసరం. అలాగే.. రాత్రి పూట లేదా ఇళ్లలో షూట్ చేసేటప్పుడు చిన్నపాటి పోర్టబుల్ ఎల్‌ఈడీ లైట్ ఉంటే మీ వీడియోలకు ప్రొఫెషనల్ లుక్ వస్తుంది.
మొదటి సారి వ్లాగింగ్ ప్రారంభించేటప్పుడు.. భారీ బడ్జెట్ పెట్టి అన్నీ కొనేయాల్సిన పనిలేదు. మీ అవసరానికి తగ్గట్టుగా ఒక బేసిక్ కెమెరా లేదా మంచి స్మార్ట్‌ఫోన్, స్పష్టమైన ఆడియో కోసం ఒక మైక్రోఫోన్‌తో.. మీ మొదటి వ్లాగ్ జర్నీని ప్రారంభించండి. కంటెంట్ లోని కంటెంటే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.