E-Paper
Advertisement

కొత్త 5G ఫోన్ నెట్‌వర్క్ సమస్యలకు..చెక్ పెట్టే సింపుల్ టిప్స్!

కొత్త 5G ఫోన్ నెట్‌వర్క్ సమస్యలకు..చెక్ పెట్టే సింపుల్ టిప్స్!
Advertisement

5G phone slow internet: దీపావళి పండగ సందర్భంగా చాలా మంది తమ పాత ఫోన్లను మార్చి సరి కొత్త 5G స్మార్ట్‌ ఫోన్‌లను కొంటుంటారు. జియో , ఎయిర్‌టెల్ వంటి టెలికాం ఆపరేటర్లు దేశ వ్యాప్తంగా 5G సేవలను విస్తరిస్తున్న తరుణంలో, కొత్త ఫోన్‌లో ఇంటర్నెట్ రాకెట్ వేగంతో దూసుకుపోతుందని అందరూ భావిస్తారు. అయితే.. అన్నిసార్లు కొత్త ఫోన్ కొన్నప్పటికీ అనుకున్నంత స్పీడ్ రాకపోవడంతో యూజర్లు నిరాశపడుతుంటారు. దీనికి.. మొబైల్ హార్డ్‌వేర్ సమస్యే కారణం కావాలని లేదు. కొన్ని సాధారణ టెక్నికల్ కారణాల వల్లే ఇలా జరుగుతుంది. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

1. సరైన నెట్‌వర్క్ మోడ్ :

మనం కొత్త ఫోన్ తీసుకున్న తర్వాత, దాని డిఫాల్ట్ సెట్టింగ్స్ 4G లేదా ఆటోమేటిక్ నెట్‌వర్క్‌లో.. ఉండే అవకాశం ఉంది. మీ ఫోన్ 5G సపోర్ట్ చేసినప్పటికీ, సెట్టింగ్స్‌లో 5G ని మాన్యువల్‌గా ఎనేబుల్ చేయకపోతే.. హై-స్పీడ్ డేటా రాదు. మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, ‘Mobile Network’ ఆప్షన్ ఓపెన్ చేసి, ప్రిఫర్డ్ నెట్‌వర్క్ టైప్‌ను ‘5G/4G/3G/2G (Auto)’ మోడ్‌లో సెట్ చేసుకోండి.

2. 5G అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్ :

Advertisement

ప్రధాన టెలికాం కంపెనీలు ప్రస్తుతం 5G సేవలను అందిస్తున్నాయిగానీ.. వాటిని పొందడానికి కొన్ని షరతులు ఉన్నాయి. మీ సిమ్‌లో కనీసం రూ.239 లేదా అంతకంటే ఎక్కువ విలువైన అన్‌లిమిటెడ్ 5G డేటా ప్లాన్ రీఛార్జ్ ఉంటేనే హై-స్పీడ్ 5G డేటా వర్తిస్తుంది. సాధారణ డేటా ప్యాక్‌లతో పూర్తి 5G నెట్ వర్క్ రాకపోవచ్చు.

3. సిగ్నల్ కవరేజ్ లేకపోవడం:

మీరు ఉంటున్న ప్రాంతంలో 5G టవర్ సిగ్నల్స్ సరిగ్గా లేకపోతే.. ఫోన్ ఆటోమేటిక్‌గా 4G నెట్‌వర్క్‌కి మారుతుంది. 5G ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ గోడలను దాటి లోపలికి రావడంలో.. కొన్నిసార్లు ఇబ్బంది పడతాయి. అందుకే.. కిటికీ దగ్గరకు వెళ్లినప్పుడు లేదా బయటకు వెళ్లినప్పుడు సిగ్నల్ పెరుగుతుంది.

4. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లేకపోవడం:

Advertisement

కొన్నిసార్లు కొత్తగా.. మార్కెట్లోకి వచ్చిన ఫోన్లలో కొన్ని బగ్స్ ఉండే అవకాశం ఉంది. కంపెనీలు.. ఇంటర్నెట్ కనెక్టివిటీని మెరుగు పరచడానికి ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను విడుదల చేస్తుంటాయి. మీరు ఫోన్ కొన్న వెంటనే.. సిస్టమ్ అప్‌డేట్ చేయకపోతే నెట్‌వర్క్ సమస్యలు రావచ్చు.

Also Read: మొదటి సారి వ్లాగ్స్ చేస్తున్నారా?పర్ఫెక్ట్ కెమెరా, మైక్ ఎంచుకోవడం ఎలా?

5. సిమ్ కార్డ్ సమస్య :

మీరు చాలా సంవత్సరాల క్రితం తీసుకున్న పాత సిమ్ కార్డ్‌ని ప్రస్తుత 5G ఫోన్‌లో వాడుతున్నట్లయితే.. కొన్నిసార్లు ఆ సిమ్ 5G ఫ్రీక్వెన్సీని పూర్తిగా హ్యాండిల్ చేయలేకపోవచ్చు. మీ సిమ్ చాలా పాతదైతే, మీ టెలికాం ఆపరేటర్ స్టోర్‌కి వెళ్లి 5G-ready నానో సిమ్‌కి అప్‌గ్రేడ్ చేసుకోవడం మంచిది.

కొత్త 5G ఫోన్ కొన్నప్పుడు ఈ చిన్న చిన్న సెట్టింగ్స్ సరిచూసుకుంటే చాలు, మీ ఇంటర్నెట్ స్పీడ్ అమాంతం పెరిగి పోతుంది. దీపావళి సంబరాలను.. మీ ఇంటర్నెట్‌ స్పీడ్తో మరింత ఆనందంగా గడపండి!

Related News

మీ వాట్సాప్ ప్రైవసీ సేఫ్..చాట్ లాక్ ఫీచర్‌ని ఇలా వాడండి!

తక్కువ సిబిల్ స్కోరు.. మీ లోన్ రిజెక్ట్ చేస్తుందా?ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

మొదటి సారి వ్లాగ్స్ చేస్తున్నారా?పర్ఫెక్ట్ కెమెరా, మైక్ ఎంచుకోవడం ఎలా?

దీపావళికి పర్ఫెక్ట్ ఫోటోలు తీయాలా? ఫోన్‌లో ఈ చిన్న సెట్టింగ్స్ మారిస్తే సరి

సోనీ నుంచి అదిరిపోయే నోస్టాల్జియా గాడ్జెట్..MDR-3R హెడ్‌ఫోన్స్ లాంచ్

10 నిమిషాల్లో అదిరిపోయే గోధుమ రవ్వ ప్రసాదం..ఈజీగా చేయండిలా!

ఎయిర్‌టెల్ బంపరాఫర్.. ఒక రీఛార్జ్ చేస్తే మరొకటి ఉచితం.. 56 రోజులు తగ్గేదేలే!

Big Stories

Advertisement
×