Best Budget Smartphones: స్మార్ట్‌ఫోన్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న రోజులివి. అలాంటిది ప్రతీ ఏడాదీ కొత్త ఫోన్ కొనడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అందుకే ఒకసారి డబ్బులు పెట్టి కొంటే కనీసం ఐదేళ్లయినా ఎటువంటి సమస్యలు లేకుండా నడిచే ఫోన్ల కోసం చాలామంది వెతుకుతుంటారు. ఫోన్ ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే మంచి హార్డ్‌వేర్‌తో పాటు క్రమం తప్పకుండా సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా చాలా ముఖ్యం. సెక్యూరిటీ అప్‌డేట్స్ ఉంటేనే మన పర్సనల్ డేటా సురక్షితంగా ఉంటుంది. ప్రస్తుతం బడ్జెట్, మిడ్‌రేంజ్ విభాగాల్లోనే ఐదేళ్లకు పైగా అప్‌డేట్స్ ఇస్తున్న కొన్ని అద్భుతమైన ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రూ.30,000 నుంచి రూ.55,000 లోపు ధరల్లో దీర్ఘకాలం పనిచేసే టాప్ 5 స్మార్ట్‌ఫోన్ల వివరాలు ఇవే.
ఏడేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ ఇస్తామని శాంసంగ్ చెప్తున్న ఈ ఫోన్ ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. సుమారు రూ.54,000 ప్రారంభ ధర కలిగిన ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల డైనమిక్ అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఎగ్జినోస్ 2400 చిప్‌సెట్ వల్ల పెర్ఫార్మెన్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు టెలిఫోటో లెన్స్ కూడా అందించారు. 4900mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా హాయిగా వాడుకోవచ్చు.
తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఏళ్లు వాడాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. దీని ధర సుమారు రూ.32,000 వరకు ఉంటుంది. దీనికి కూడా కంపెనీ ఏడేళ్ల అప్‌డేట్స్ ఇస్తోంది. ఇందులో 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ స్క్రీన్, ఎగ్జినోస్ 1580 ప్రాసెసర్ ఉన్నాయి. రోజువారి పనులతో పాటు గేమింగ్‌కు కూడా ఇది బాగా సెట్ అవుతుంది. 5000mAh పెద్ద బ్యాటరీ, ఆకర్షణీయమైన AI ఫీచర్లు ఈ ఫోన్ ప్రత్యేకతలు.
Also Read: బాధను కూడా నవ్వుతూ చెప్పేస్తున్న Gen Z.. సోషల్ మీడియాలో ఇదో కొత్త ట్రెండ్!
పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇది సరైన ఫోన్. దీని ప్రారంభ ధర సుమారు రూ.41,000. ఇందులో ఏకంగా 9000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఇచ్చారు. అలాగే 80W సూపర్ వూక్ ఛార్జర్ బాక్స్‌లోనే వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్, 165Hz రిఫ్రెష్ రేట్ ఉన్న స్క్రీన్ వల్ల గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుంది. ఈ ఫోన్‌కు నాలుగేళ్ల ఓఎస్, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయి.
సుమారు రూ.36,000 బడ్జెట్‌లో ఆరేళ్ల అప్‌డేట్ సపోర్ట్‌తో వచ్చే ఫోన్ ఇది. ఎగ్జినోస్ 1480 ప్రాసెసర్‌పై నడిచే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఇది నాచురల్ ఫొటోలను అందిస్తుంది. 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ స్క్రీన్, 5000mAh బ్యాటరీలతో డైలీ యూసేజ్‌కి, సోషల్ మీడియా బ్రౌజింగ్‌కి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.
మరమ్మతులు చేసుకోవడానికి సులువైన డిజైన్, పర్యావరణ స్పృహతో వచ్చే ఈ ఫోన్ ధర సుమారు రూ.54,000. ఇందులో స్క్రీన్, బ్యాటరీ, కెమెరాల్లాంటి భాగాలు పాడైతే మనమే సులువుగా మార్చుకోవచ్చు. దీనికి ఆరేళ్ల ఓఎస్ అప్‌డేట్స్ లభిస్తాయి. స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్, 12GB రామ్‌తో వచ్చే ఈ ఫోన్ డైలీ టాస్క్స్‌ను సులువుగా హ్యాండిల్ చేస్తుంది.
Also Read: AI ఏసీలు నిజంగా కరెంట్ బిల్లు తగ్గిస్తాయా? లేక కంపెనీల మైండ్ గేమా?