E-Paper
Advertisement

కొత్త ఇంటికి మారుతున్నారా?బడ్జెట్‌లోనే.. వాషింగ్ మెషీన్స్

కొత్త ఇంటికి మారుతున్నారా?బడ్జెట్‌లోనే.. వాషింగ్ మెషీన్స్
Advertisement

Best front load washing machines: కొత్త ఇల్లు అనగానే.. అందరిలోనూ.. ఒక సరి కొత్త ఆనందం ఉంటుంది. ఈ టైంలో సాధారణంగా అన్నీ కొత్తవే కొనాలని చూస్తుంటాం. ముఖ్యంగా.. రోజు వారీ పనిని ఈజీ చేసే హౌస్‌హోల్డ్ అప్లయన్సెస్ విషయంలో కాస్త కేర్ తీసుకోవడం చాలా ముఖ్యం. అందులోనూ బట్టలు ఉతకడం తలనొప్పి పని కాకుండా, ఈజీగా పని అయిపోవాలంటే ఒక మంచి వాషింగ్ మెషీన్ పక్కా ఉండాల్సిందే. కొత్తగా ఇల్లు మారే వారికి పర్ఫెక్ట్‌గా సరి పోయే టాప్-5 ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు, వాటి ఫీచర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1. LG 7 Kg AI DD Inverter Washing Machine:(ధర:రూ.33,890)

ఈ మోడల్ కొత్త ఇంట్లోకి మారే వారికి ఫస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.ఇందులో.. ఉన్న ఏఐ డైరెక్ట్ ట్రైవ్ టెక్నాలజీ బట్టల రకాన్ని బట్టి ఆటోమేటిక్‌గా వాషింగ్ మూవ్‌మెంట్‌ను సెట్ చేసుకుంటుంది. దీని వల్ల బట్టలు పాడవకుండా.. కొత్త వాటిలా ఉంటాయి. అంతేకాదు.. Wi-Fi సపోర్ట్ ఉండటంతో.. మీ ఫోన్ ద్వారానే ఎక్కడి నుంచైనా దీన్ని ఆపరేట్ చేయొచ్చు.

Advertisement

2. Samsung 8 Kg AI Washing Machine:(ధర: సుమారు రూ. 38,490)

మీ కుటుంబంలో నలుగురు లేదా ఐదుగురు సభ్యులు ఉంటే.. ఈ 8 కేజీల మెషీన్ పర్ఫెక్ట్. ఇందులో ఉండే లేటెస్ట్ టెక్నాలజీ డిటర్జెంట్‌ను క్షణాల్లో.. నురగలా మార్చి బట్టల్లోని మురికిని ఇట్టే వదిలిస్తుంది. దీనిలో.. ఉండే హైజీన్ స్ట్రీమ్ వాష్‌ వల్ల బట్టలపై ఉండే బాక్టీరియా, అలర్జీ కారకాలు పూర్తిగా పోతాయి.

3. Bosch 7 Kg 5 Star Load Washer: (ధర: రూ. 31,500)

Advertisement

జర్మన్ టెక్నాలజీతో.. తయారైన బాష్ బ్రాండ్ మన్నికకు పెట్టింది పేరు. ఈ మెషీన్ చాలా తక్కువ శబ్దం చేస్తూ పని చేస్తుంది. దీనిలో.. ఉండే ప్రత్యేకమైన ఫీచర్ వల్ల బట్టలు ఒకదానికొకటి చుట్టుకోకుండా.. ముడతలు పడకుండా నీట్ గా టర్న్ అవుతాయి. బిజీ లైఫ్‌స్టైల్ ఉండే..కొత్త జంటలకు ఇది చాలా చక్కగా సరి పోతుంది.

4. IFB 6 Kg 5 Star AI Powered Washing Machine (ధర: రూ.27,990)

చిన్న కుటుంబాలకు లేదా కొత్తగా పెళ్లైన వారికి తక్కువ బడ్జెట్‌లో ఇది బెస్ట్ ఆప్షన్. ఇది ఆటోమేటిక్‌గా బట్టల బరువును గుర్తించి, దానికి తగినట్లుగా నీటిని, పవర్‌ను వాడుకుంటుంది. దీనిపై.. కంపెనీ ఇస్తున్న లాంగ్ టర్మ్ వారంటీ వల్ల ఎలాంటి టెన్షన్ లేకుండా దీన్ని వాడొచ్చు.

Also Read: రూ.45 వేలలోపు బెస్ట్ ల్యాప్ టాప్స్.. కొంటే ఇలాంటి మోడల్స్ ఏ కొనాలి

5. Whirlpool 7.5 Kg Washing Machine (ధర:రూ.33,200)

బట్టలు ఉతికిన తర్వాత తీయడం మర్చిపోతే.. వాసన వస్తాయనే టెన్షన్ ఇక అక్కర్లేదు! ఈ వర్ల్‌పూల్ మెషీన్‌లో ఉండే.. ఫ్రెష్ కేర్ ఫీచర్.. ఉతికిన తర్వాత కూడా బట్టలు ఫ్రెష్‌గా ఉండేలా గాలి ఆడేలా చేస్తుంది. అలాగే దీని డిజైన్ మీ కొత్త ఇంటికి సరికొత్త మోడర్న్ లుక్‌ను తెస్తుంది.

కొత్త ఇంటికి అడుగుపెట్టే.. హడావుడిలో వాషింగ్ మెషీన్ సెలెక్షన్ ముఖ్యం. మీ బడ్జెట్, ఫ్యామిలీ సైజును బట్టి ఈ ఐదింటిలో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని మీ పనులను ఈజీ చేసుకోండి.

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×