E-Paper
Advertisement

పిజ్జా సెంటర్‌లో కాల్పులు.. 3 సెకన్లలో 3 రౌండ్లు.. నెట్టింట వీడియో వైరల్!

పిజ్జా సెంటర్‌లో కాల్పులు.. 3 సెకన్లలో 3 రౌండ్లు.. నెట్టింట వీడియో వైరల్!
Advertisement

Pizza Restaurant Firing: పంజాబ్ లూథియానాలోని ఓ ప్రముఖ పిజ్జా సెంటర్‌లో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. గుర్తుతెలియని దుండగులు రెస్టారెంట్‌లోకి చొరబడి కేవలం మూడు సెకన్ల వ్యవధిలోనే మూడు రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. రాత్రివేళ జరిగిన ఈ ఘటనతో కస్టమర్లతో పాటు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ కాల్పులకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే..

లుధియానాలో నిత్యం రద్దీగా ఉండే భాయ్ రణధీర్ సింగ్ నగర్ (BRS Nagar) ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దుండగులు లోపలికి వచ్చి కాల్పులు జరిపిన దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. తుపాకీ పేలిన వెంటనే లోపల ఉన్న కస్టమర్లు, సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

సోషల్ మీడియాలో గ్యాంగ్ ప్రకటన

అయితే ఈ కాల్పులు తామే జరిపినట్లు ఓ గ్యాంగ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించుకుంది.’గోపీ లాహోరియా గ్రూప్’ పేరిట ఉన్న ఒక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ కాల్పులకు తామే బాధ్యులమని ప్రకటిస్తూ ఒక పోస్ట్ దర్శనమిచ్చింది. రెస్టారెంట్‌ను బెదిరిస్తూ పెట్టిన ఈ పోస్ట్‌తో ఈ దాడి వెనుక గ్యాంగ్‌స్టర్ల హస్తం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.

పోలీసుల దర్యాప్తు ముమ్మరం

Advertisement

సోషల్ మీడియా పోస్ట్ వెలుగులోకి రావడంతో పోలీస్ సైబర్ సెల్ రంగంలోకి దిగింది. ఆ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నిజంగానే సదరు గ్యాంగ్‌కు చెందిందా? లేక భయాందోళనలు సృష్టించడానికి ఎవరైనా నకిలీ ఖాతాతో ఈ పని చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సాంకేతిక ఆధారాల సహాయంతో ఆ ఖాతాను ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Also Read: సీఎం విజయ్ బంపరాఫర్.. ఎమ్మెల్యేలకు ఉచిత కారు.. నెలకు రూ.లక్ష అలవెన్స్!

రెండింటినీ కీలక ఆధారాలుగా..

సీసీటీవీ విజువల్స్ తో పాటు ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ను కాల్పుల ఘటనకు కీలక ఆధారాలుగా పోలీసులు పరిగణిస్తున్నారు. దీని ఆధారణంగా విచారణ వేగవంతంగా చేశారు. అయితే ఈ కాల్పులు కేవలం భయపెట్టి డబ్బులు వసూలు చేసే కుట్రనా? లేక ఏదైనా ముఠా కక్షలా? అనే విషయాలు తేలాల్సి ఉంది. ఈ ఘటనతో లూథియానాలో గ్యాంగ్ కల్చర్, తుపాకుల సంస్కృతిపై మళ్లీ మెుదలైందా అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Also Read: జమ్మూ కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ వాహనం, ముగ్గురు మృతి!

Tags

Related News

లోపల ప్రియురాలు.. కారు బానెట్‌పై ఇల్లాలు, యూపీలో విచిత్ర ఘటన

ఇండియన్ ఆర్మీలో జాబ్స్.. బిఈ, బిటెక్ ఫ్రెషర్స్‌కు అద్భుత అవకాశం

SIR వివాదం, CEC జ్ఞానేశ్వర్ రాజీనామా డిమాండ్.. మోడీ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

ప్లాన్ ప్రకారమే పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!

హక్కుల పోరాటానికి డిజిటల్ వేదిక.. రాహుల్ గాంధీ సత్యాగ్రహ పోర్టల్ ప్రారంభం!

ప్రియుడితో కూతురు జంప్.. చెప్పు తీసుకొని.. యువకుడి తండ్రిపై యువతి తల్లి దాడి!

కెనెరా బ్యాంక్‌లో ఉద్యోగాలు.. 3500 అప్రెంటిస్ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

రోడ్‌షోలో ఎమోషనల్ మూమెంట్.. కొడుకు ఫోటోను పైకెత్తి చూపిన సీఎం విజయ్.. దృశ్యాలు వైరల్!

Big Stories

Advertisement
×