BigTV English

December Movies 2024 : క్రిస్మస్ కు సినిమాల జాతర… ‘పుష్ప 2’తో పాటు ఏకంగా 12 సినిమాలు రిలీజ్ కు రెడీ

December Movies 2024 : క్రిస్మస్ కు సినిమాల జాతర… ‘పుష్ప 2’తో పాటు ఏకంగా 12 సినిమాలు రిలీజ్ కు రెడీ

December Movies 2024 : ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్పా గాడి ఫీవర్ కనిపిస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యేది మాత్రం నవంబర్లో కాకుండా డిసెంబర్లో అన్న సంగతి తెలిసిందే. కానీ ఎప్పటినుంచో ఈ సినిమా గురించి మూవీ లవర్స్ ఎదురు చూస్తుండడంతో ఒక నెల ముందు నుంచే ‘పుష్ప 2’ (Pushpa 2) హడావుడి మొదలైపోయింది. దీంతో డిసెంబర్లో రిలీజ్ కానున్న సినిమాల్లో కేవలం ‘పుష్ప 2’ మాత్రమే అందరి నోళ్ళలో నానుతోంది. కానీ నిజానికి డిసెంబర్లో ‘పుష్ప 2’తో పాటు ఏకంగా 12 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం పదండి.


పుష్ప 2 (Pushpa 2)

దాదాపు మూడేళ్ల నిరీక్షణ తర్వాత తెరపైకి రాబోతోంది ‘పుష్ప 2 : ది రూల్’. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ వరల్డ్ సినిమాగా, ఆరు భాషల్లో, 12,000లకు పైగా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.


ఫియర్ మూవీ (Fear)

వేదిక హీరోయిన్ గా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఫియర్’. ఈ సినిమా డిసెంబర్ 14న క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ పలు అంతర్జాతీయ అవార్డులు కూడా సొంతం చేసుకుంది.

ముఫాస : ది లయన్ కింగ్ (Mufasa : The Lion King)

హాలీవుడ్ మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ‘ముఫాస : ది లయన్ కింగ్’. ఈ సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించడంతో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తెలుగులో డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఈ డిసెంబర్ కు ఈ మూవీ బెస్ట్ ఆప్షన్.

బచ్చల మల్లి (Bacchala Malli)

అల్లరి నరేష్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘బచ్చల మల్లి’. 1990 నేపథ్యంలో నరేష్ ట్రాక్టర్ డ్రైవర్ గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ దక్కింది.

యుఐ మూవీ (UI Movie)

విలక్షణ నటుడు ఉపేంద్ర తాజా చిత్రం ‘యుఐ మూవీ’. ఈ మూవీ కూడా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

విడుదలై (Viduthalai 2)

విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘విడుదలై’. దీనికి సీక్వెల్ గా ‘విడుదలై పార్ట్ 2’ డిసెంబర్ 20న రిలీజ్ కానుంది.

సారంగపాణి జాతకం (Sarangapani Jathakam)

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన మూవీ ‘సారంగపాణి జాతకం’. రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా కూడా డిసెంబర్ 20న థియేటర్లలోకి రాబోతోంది. ఇదే రోజున ‘ఎర్ర చీర : ది బిగినింగ్’ అనే మూవీ కూడా రిలీజ్ అవుతుంది. ఇందులో రాజేంద్ర ప్రసాద్ మనవరాలు కీలకపాత్రను పోషించింది. ఇక డిసెంబర్ 21న మ్యాజిక్, డిసెంబర్ 25న రాబిన్ హుడ్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, బేబీ జాన్, డిసెంబర్ 27న పతంగ్ సినిమాలు తెరపైకి రానున్నాయి.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×