Best Havells Air Fryer: ఇప్పుడున్న రోజుల్లో హెల్త్ కాన్షియస్‌గా ఉండటం ఎంత ముఖ్యమో.. టేస్టీగా తినడం కూడా అంతే ముఖ్యం. సమోసాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ ఫ్రై వంటి క్రిస్పీ స్నాక్స్ చూడగానే ఎవరికైనా నోరూరుతుంది. కానీ.. ఆయిల్ ఎక్కువగా ఉంటుందని చాలా మంది వీటికి దూరంగా ఉంటారు. ఈ ప్రాబ్లమ్‌కు పర్మనెంట్ చెక్ పెట్టడానికే వచ్చేశాయి హావెల్స్ ఎయిర్ ఫ్రైయర్స్. 85% వరకు తక్కువ నూనెతో.. నూటికి నూరు శాతం క్రిస్పీ టేస్ట్‌ను అందించే 5 బెస్ట్ హావెల్స్ ఎయిర్ ఫ్రైయర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎయిర్ ఫ్రైయర్ ఎందుకు ఇప్పుడు హాట్ టాపిక్?
హెల్తీ లైఫ్‌స్టైల్ కిచెన్ గాడ్జెట్స్’కు తెగ డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా.. హౌస్‌వైఫ్స్, వర్కింగ్ ఉమెన్ లేదా బ్యాచిలర్స్.. ఎవరైనా సరే వంటగదిలో గంటల తరబడి నిలబడకుండా.. చిటికెలో రుచికరమైన స్నాక్స్ , రోజు వారీ వంటలు చేసుకోవడానికి ఎయిర్ ఫ్రైయర్స్ బాగా హెల్ప్ అవుతున్నాయి. హావెల్స్ బ్రాండ్ మన ఇండియన్ కిచెన్స్‌కు తగినట్లుగా.. తక్కువ కరెంట్ బిల్లు వచ్చేలా సరి కొత్త టెక్నాలజీతో వీటిని డిజైన్ చేసింది. కేవలం స్నాక్స్ మాత్రమే కాదు.. కూరగాయలు రోస్ట్ చేయడం, బేకింగ్, గ్రిల్లింగ్ కూడా ఇందులో చాలా ఈజీగా చేసుకోవచ్చు.
మీ కిచెన్ కోసం 5 బెస్ట్ హావెస్ ఎయిర్ ఫ్రైయర్స్:
1. Havells Prolife Digi Air Fryer (4 Litre):
ఇది డిజిటల్ టచ్ కంట్రోల్‌తో వస్తుంది. ఇందులో ఆటో-ఆన్ టైమర్, ప్రీ-సెట్ మెనూలు ఉన్నాయి. బ్యాచిలర్స్ లేదా చిన్న ఫ్యామిలీస్ కోసం క్రిస్పీ స్నాక్స్ పర్ఫెక్ట్‌గా చేయడానికి ఇది బెస్ట్ ఛాయిస్. ఇది చూడటానికి కూడా చాలా స్టైలిష్‌గా ఉంటుంది.
2. Havells Prolife Grande Air Fryer (5 Litre):
దీని ఏరో డిజిటల్ టెక్నాలజీ బట్టర్ లేదా ఆయిల్ లేకుండానే ఫుడ్‌ను సూపర్ క్రిస్పీగా ఫ్రై చేస్తుంది. దీని కెపాసిటీ 5 లీటర్లు కాబట్టి, నలుగురైదుగురు ఉన్న ఫ్యామిలీకి ఒకేసారి స్నాక్స్ లేదా చికెన్ వింగ్స్ ఫ్రై చేయడానికి ఇది సరిగ్గా సరి పోతుంది.
3. Havells Air Fryer Prolife Luxe:
ప్రీమియం డిజైన్‌తో వచ్చే ఈ మోడల్ మీ కిచెన్‌కు మోడ్రన్ లుక్ ఇస్తుంది. దీని రాపిడ్ ఎయిర్ సర్క్యులేషన్ టెక్నాలజీ వల్ల ఫుడ్ లోపల చాలా సాఫ్ట్‌గా, బయట క్రిస్పీగా ఉడుకుతుంది. సమోసాలు, కట్లెట్స్ చేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్.
4. Havells Air Oven Digi (Large Capacity):
ఒకవేళ మీరు కేవలం ఫ్రైయింగ్ మాత్రమే కాకుండా బేకింగ్, టోస్టింగ్ కూడా ఎక్కువ మొత్తంలో చేయాలనుకుంటే, ఈ హావెల్స్ ఎయిర్ ఓవెన్ బెస్ట్ ఆప్షన్. ఇందులో మల్టిపుల్ రాక్స్ ఉంటాయి. కేకులు బేక్ చేయడం, సమోసాలు పెద్ద మొత్తంలో చేయడం ఇందులో చాలా ఈజీ.
5. Havells Prolife Classic Air Fryer:
డిజిటల్ స్క్రీన్స్ మాకు వద్దు బాబోయ్, సింపుల్‌గా తిప్పే నాబ్స్ ఉంటే చాలు అనుకునే పెద్దవారికి ఇది పర్ఫెక్ట్. సింపుల్ ఆపరేషన్, బడ్జెట్ ధరలో లభించే.. మోస్ట్ రిలయబుల్ ఎయిర్ ఫ్రైయర్ ఇది.
స్మార్ట్ కిచెన్ టిప్:
ఎయిర్ ఫ్రైయర్‌లో వండేటప్పుడు స్నాక్స్ పైన కేవలం ఒక్క డ్రాప్ ఆయిల్ బ్రష్ లేదా స్ప్రే చేస్తే చాలు. అవి డీప్ ఫ్రై చేసినట్లే అద్భుతమైన గోల్డెన్ కలర్ , క్రంచీనెస్‌తో వస్తాయి.
Also Read: బట్టలు ఉతకడంలో కొత్త ట్రెండ్.. ఇలా చేస్తే కరెంట్, టైం రెండూ ఆదా
రోజువారీ వంటలు ఈజీ :
హావెల్స్ ఎయిర్ ఫ్రైయర్ల వల్ల ప్రతి రోజూ వంట చేయడం చాలా ఈజీ అవుతుంది. ఉదయాన్నే.. ఆఫీస్ హడావిడిలో బ్రేక్‌ఫాస్ట్ కోసం ఆలు టిక్కీలు చేయడం, సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే పిల్లల కోసం హెల్తీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ చేయడం వంటివి నిమిషాల్లో అయిపోతాయి. డీప్ ఫ్రై లాగా పక్కనే నిలబడి చూసుకోవాల్సిన అవసరం లేదు, టైమర్ సెట్ చేస్తే అదే వంటను పర్ఫెక్ట్‌గా ఫినిష్ చేస్తుంది.
ఆరోగ్యకరమైన ఆహారం తింటూ, టేస్ట్‌ను కూడా ఎంజాయ్ చేయాలనుకునే వారికి.. హావెల్స్ ఎయిర్ ఫ్రైయర్స్ ఒక అద్భుతమైన వరం. ఈ స్మార్ట్ గాడ్జెట్స్ కిచెన్ రూపురేఖలనే.. మార్చేస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ బడ్జెట్ , ఫ్యామిలీ సైజును బట్టి ఇప్పుడే అమెజాన్ నుంచి మీ నచ్చిన హావెల్స్ మోడల్‌ను సెలెక్ట్ చేసుకోండి. మీ వంటను హెల్తీగా, ట్రెండీగా మార్చేసుకోండి.