E-Paper
Advertisement

ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ల వర్షం.. ఆసుస్ పాపులర్ ల్యాప్‌టాప్‌పై ఏకంగా రూ.18,000 తగ్గింపు!

ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ల వర్షం.. ఆసుస్ పాపులర్ ల్యాప్‌టాప్‌పై ఏకంగా రూ.18,000 తగ్గింపు!
Advertisement

Flipkart Diwali Sale 2026: సాధారణంగా పండుగల సీజన్ అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది భారీ డిస్కౌంట్లు. ఈ క్రమంలో మీరు కూడా కొత్త ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? ముఖ్యంగా ఆఫీస్ పనులకు, బిజినెస్ అవసరాలకు సరిపోయే మంచి ల్యాప్‌టాప్ కోసం చూస్తుంటే.. మీకొక సూపర్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న ‘బిగ్ బ్యాంగ్ దివాళీ సేల్ 2026’లో ప్రముఖ బ్రాండ్ ఆసుస్ (ASUS) తమ ఎక్స్‌పర్ట్‌బుక్ సీరీస్ ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. ఈ ఆఫర్లలో ఏకంగా రూ.18,000 వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. వీటితో పాటు బ్యాంక్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎమ్‌ఐ, ఎక్స్చేంజ్ బోనస్‌లు కూడా లభిస్తున్నాయి.

ఆసుస్ ల్యాప్‌టాప్ ఆఫర్లు:

ఈ సేల్‌లో ఎక్స్‌పర్ట్‌బుక్ పి-సీరీస్‌కు చెందిన పలు మోడళ్లపై బంపర్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌పర్ట్‌బుక్ P1403CVA మోడల్‌పై రూ.18,000 తగ్గింపు రాగా.. ప్రస్తుతం దీనిని రూ.63,990కే సొంతం చేసుకోవచ్చు. ఇది 14 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, ఇంటెల్ కోర్ 3 ప్రాసెసర్, 16జీబీ ర్యామ్, 512జీబీ ఎస్‌ఎస్‌డీతో వస్తుంది. ఇక పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే P3406CCAP మోడల్ రూ.86,990కే లభిస్తోంది. అలాగే హై-ఎండ్ మోడల్ అయిన P5405CAA పై రూ.10,000 డిస్కౌంట్ లభించడంతో రూ.1,79,990 ధరలో అందుబాటులోకి వచ్చింది.

Advertisement

Also Read: పాత ఏసీ, ఫ్రిజ్‌ను అమ్మాలనుకుంటున్నారా? ఈ ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌తో ఇంటివద్దే పికప్, అకౌంట్లోకి నేరుగా డబ్బులు!

అదనపు సేవింగ్స్ వివరాలు:

ల్యాప్‌టాప్‌ల అసలు ధరపై లభించే డిస్కౌంట్‌తో పాటు అదనంగా మరికొంత డబ్బు ఆదా చేసుకునే అవకాశాన్ని ఫ్లిప్‌కార్ట్ కల్పిస్తోంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.10,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా.. పాత ల్యాప్‌టాప్‌ను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా రూ.15,000 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. ఒకేసారి డబ్బులు కట్టలేని వాళ్లకి 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎమ్‌ఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ ఎక్స్చేంజ్ బోనస్ అనేది మీరు మార్చే పాత డివైజ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

ఈ ల్యాప్‌టాప్స్ ప్రత్యేకతలివే:

Advertisement

ఆసుస్ ఎక్స్‌పర్ట్‌బుక్ సిరీస్ ముఖ్యంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్, బిజినెస్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఫ్లాగ్‌షిప్ ఎక్స్‌పర్ట్‌బుక్ అల్ట్రా మోడల్ కేవలం 0.99 కేజీల బరువుతో చాలా తేలికగా ఉంటుంది. దీంతో సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. వీటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మీటింగ్ టూల్స్, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, అధునాతన సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. కాబట్టి.. ఆఫీస్ వర్క్, ట్రావెలింగ్, డైలీ యూసేజ్ కోసం ఒక మంచి డ్యూరబుల్ ల్యాప్‌టాప్ కావాలనుకునే వారికి ఈ పండుగ ఆఫర్లు చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Also Read: బ్యాటరీ పాడైందని కొత్త స్మార్ట్‌వాచ్ కొంటున్నారా? పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే మార్చుకోండిలా!

Tags

Related News

హయర్, శాంసంగ్ ఫ్రిజ్‌లపై అమెజాన్ సేల్‌లో..భారీ డిస్కౌంట్లు!

జియో అదిరిపోయే ప్లాన్.. రూ.999 కే ఇన్ని బెనిఫిట్సా.. వర్త్ వర్మా వర్త్!

పాత ఏసీ, ఫ్రిజ్‌ను అమ్మాలనుకుంటున్నారా? ఈ ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌తో ఇంటివద్దే పికప్, అకౌంట్లోకి నేరుగా డబ్బులు!

స్టూడెంట్స్,ప్రొఫెషనల్స్ కోసం హెచ్‌పి కొత్త ల్యాప్‌టాప్‌లు..పూర్తి ఫీచర్లలివే!

మార్కెట్‌లోకి రాకముందే ఇన్ని కఠినమైన పరీక్షలా? Samsung Galaxy Z Fold 8 వెనుకున్న ఈ కష్టం తెలిస్తే..

గీజర్ కొంటున్నారా?ఈ7 విషయాలు తెలుసుకోకపోతే డబ్బు వృథా!

Google Payలో ఏఐ షాపింగ్ ఫీచర్.. నచ్చిన డ్రెస్‌ను ముందే ట్రై చేసే అవకాశం!

Big Stories

Advertisement
×