E-Paper
Advertisement

హయర్, శాంసంగ్ ఫ్రిజ్‌లపై అమెజాన్ సేల్‌లో..భారీ డిస్కౌంట్లు!

హయర్, శాంసంగ్ ఫ్రిజ్‌లపై అమెజాన్ సేల్‌లో..భారీ డిస్కౌంట్లు!
Advertisement

Haier vs Samsung refrigerator sale: ఇంటికి అవసరమైన ఎలక్ట్రానిక్స్ కొనడానికి పండగ సీజన్‌ను మించిన మంచి సమయం మరొకటి ఉండదు. అందుకే.. అమెజాన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో.. జరిగే సేల్స్‌లో కస్టమర్లకు వేల రూపాయల ఆదా అయ్యే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో.. రెండు ప్రధాన బ్రాండ్లు అయిన హయర్, శాంసంగ్ రెఫ్రిజిరేటర్లు కస్టమర్ల మొదటి ఆప్షన్ గా నిలుస్తున్నాయి. మరి ఈ సేల్‌లో ఏ బ్రాండ్ ఎలాంటి లాభాలను అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

శాంసంగ్ రిఫ్రిజిరేటర్స్:

టెక్నాలజీ:

టెక్నాలజీ పరంగా శాంసంగ్ ఎప్పుడూ ముందుంటుంది. డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ టెక్నాలజీతో.. వచ్చే శాంసంగ్ ఫ్రిజ్‌లు తక్కువ కరెంట్ వినియోగించుకుంటాయి. శబ్దం లేకుండా పని చేస్తాయి.

మోడల్స్,ధరలు:

Advertisement

శాంసంగ్ 183 లీటర్ల 3-స్టార్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్ ధర సేల్‌లో.. సుమారు రూ. 15,790 వరకు లభిస్తోంది. అలాగే 4-స్టార్ వేరియంట్ దాదాపు రూ. 16,790 ధరతో అందుబాటులో ఉంది. వీటిపై ఏడాది వారంటీతో పాటు కంప్రెసర్‌పై ఏకంగా 10 సంవత్సరాల వారంటీ లభిస్తుంది. పెద్ద కుటుంబాల కోసం డబుల్ డోర్ , 653 లీటర్ల సైడ్-బై-సైడ్ కన్వర్టిబుల్ మోడల్స్ (సుమారు రూ.67,990 ధరతో)  బ్యాంక్ డిస్కౌంట్‌లతో అందుబాటులో ఉన్నాయి.

హయర్ రిఫ్రిజిరేటర్స్:

ఇన్నోవేషన్,బడ్జెట్ ఫ్రెండ్లీ:

మరో వైపు హయర్ బ్రాండ్ తన లేటెస్ట్ డిజైన్లు , తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించడంలో పేరు గాంచింది. ఇటీవలి కాలంలో.. హయర్ ఫ్రిజ్‌లకు మార్కెట్లో విపరీతమైన ఆదరణ లభిస్తోంది.

Advertisement

ప్రముఖ మోడల్స్ , ధరలు: హయర్ 190 లీటర్ల 4-స్టార్ డైరెక్ట్ కూల్ రెఫ్రిజిరేటర్ సుమారు రూ.15,290 ధరలో లభిస్తుండగా, దీని 3-స్టార్ మోడల్ దాదాపు రూ. 14,490 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.

మరోవైపు.. లార్జ్ ఫ్యామిలీస్ కోసం హయర్ అందించే.. 596 లీటర్ల 3-స్టార్ సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్ భారీ తగ్గింపుతో రూ.59,990 ధరలో లభిస్తోంది. అంతే కుండా బాటమ్ మౌంటెడ్ ఫ్రీజర్స్,ఫ్రెంచ్ డోర్ ఆప్షన్లలో హయర్ ప్రత్యేక స్టైల్‌ను కల్పిస్తోంది.

Also Read: స్టూడెంట్స్,ప్రొఫెషనల్స్ కోసం హెచ్‌పి కొత్త ల్యాప్‌టాప్‌లు..పూర్తి ఫీచర్లలివే!

హయర్ vs శాంసంగ్: ఏది కొనాలి?

బడ్జెట్ ,ఫీచర్లు: మీరు తక్కువ ధరలో.ఎక్కువ కెపాసిటీ ,మోడ్రన్ లుక్ కోరుకుంటే.. హయర్ మంచి ఆప్షన్. ఇది అడ్వాన్స్‌డ్ కూలింగ్ టెక్నాలజీని ఇస్తుంది.

డ్యూరబిలిటీ , రీసేల్ వ్యాల్యూ: మీరు దశాబ్దాల పాటు క్వాలిటీ ఉండే బ్రాండ్,బెస్ట్ డిజిటల్ ఇన్వర్టర్ సర్వీస్ కోరుకుంటే.. శాంసంగ్ వైపు వెళ్లడం బెస్ట్.

బ్యాంక్ ఆఫర్లు: అమెజాన్ సేల్‌లో.. భాగంగా ప్రముఖ క్రెడిట్/డెబిట్ కార్డులను ఉపయోగించి కొంటే.. భారీ డిస్కౌంట్ లేదా క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

మొత్తంగా చూస్తే.. ఈ అమెజాన్ సేల్ సమయంలో మీ కిచెన్‌కు తగిన కొత్త ఫ్రిజ్‌ను ఇంటికి తెచ్చుకోవడం ద్వారా మంచి ఎక్కువగా డబ్బు సేఫ్‌గా చేసుకోవచ్చు. ఇంకెందుకాలస్యం మీ కుటుంబ అవసరాలు,బడ్జెట్‌ను బట్టి ఈ రెండింటిలో మీకు నచ్చిన బ్రాండ్‌ను ఎంచుకోండి.

Related News

ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ల వర్షం.. ఆసుస్ పాపులర్ ల్యాప్‌టాప్‌పై ఏకంగా రూ.18,000 తగ్గింపు!

జియో అదిరిపోయే ప్లాన్.. రూ.999 కే ఇన్ని బెనిఫిట్సా.. వర్త్ వర్మా వర్త్!

పాత ఏసీ, ఫ్రిజ్‌ను అమ్మాలనుకుంటున్నారా? ఈ ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌తో ఇంటివద్దే పికప్, అకౌంట్లోకి నేరుగా డబ్బులు!

స్టూడెంట్స్,ప్రొఫెషనల్స్ కోసం హెచ్‌పి కొత్త ల్యాప్‌టాప్‌లు..పూర్తి ఫీచర్లలివే!

మార్కెట్‌లోకి రాకముందే ఇన్ని కఠినమైన పరీక్షలా? Samsung Galaxy Z Fold 8 వెనుకున్న ఈ కష్టం తెలిస్తే..

గీజర్ కొంటున్నారా?ఈ7 విషయాలు తెలుసుకోకపోతే డబ్బు వృథా!

Google Payలో ఏఐ షాపింగ్ ఫీచర్.. నచ్చిన డ్రెస్‌ను ముందే ట్రై చేసే అవకాశం!

Big Stories

Advertisement
×