Jio Recharge Plan: దేశంలోని టాప్ టెలికాం సంస్థల్లో రిలయన్స్ జియో ఒకటి. హై-స్పీడ్ ఇంటర్నెట్, అపరిమిత కాల్స్, ఓటీటీ సేవలతో క్రేజీ ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొస్తూ ఎప్పటికప్పుడు యూజర్లను సర్ ప్రైజ్ చేస్తోంది. ఈ క్రమంలోనే జియో తీసుకొచ్చిన రూ.999 ప్లాన్ యూజర్లను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇది పక్కా ఆల్ రౌండర్ ప్లాన్ అన్న అభిప్రాయాలు యూజర్లలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రూ.999 ప్లాన్ కు సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ రూ.999 ప్లాన్ ను జియో 98 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. దీనిని రీఛార్జ్ చేసుకోవడం ద్వారా వ్యాలిడిటీ ఉన్నంతకాలం ఫ్రీ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు యూజర్లకు లభిస్తాయి. అంతేకాకుండా రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా జియో అందిస్తోంది. దీని ప్రకారం మొత్తం వ్యాలిడిటీ కాలానికి 196GB డేటా యూజర్లకు అందుతుంది.
ఈ రీఛార్జ్ ప్లాన్‌లో వినోదానికి సైతం జియో పెద్దపీట వేసింది. కస్టమర్లకు జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తోంది. దీని ద్వారా యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్లలో సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు వంటి కంటెంట్‌ను ఎలాంటి అదనపు రుసుము లేకుండా వీక్షించవచ్చు. అయితే ప్లాన్ ముగిసిన తర్వాత కూడా జియోహాట్‌స్టార్ ప్రయోజనాలు కొనసాగాలంటే.. ఎండ్ అయిన 48 గంటల్లోపు మరో అర్హత గల ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ప్లాన్‌లో 50 GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ ను సైతం జియో ఫ్రీగా అందిస్తోంది. ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ తక్కువగా ఉన్న యూజర్లకు ఇది చాలా ఉపయోగపడుతుందని జియో వర్గాలు పేర్కొంటున్నాయి. కీలకమైన డాక్యుమెంట్లు, ఫోటోలు, వీడియోలను ఈ క్లౌడ్ స్టోరేజ్‌లో భద్రపరుచుకోవచ్చని సూచిస్తున్నాయి. దీనివల్ల ఫోన్ మెమోరీపై భారం తగ్గుతుందని స్పష్టం చేస్తున్నాయి.
ఈ ప్లాన్‌లో ప్రత్యేక ఆకర్షణగా కాన్వా ఫ్రీ సబ్ స్క్రిప్షన్ నిలుస్తోంది. రూ.1,590 విలువైన కాన్వా ప్రో లైట్ సబ్‌స్క్రిప్షన్ ను ఏడాది పాటు ఉచితంగా అందిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులు, ప్రమోషనల్ గ్రాఫిక్స్, ఇతర డిజిటల్ డిజైన్లను తయారు చేసుకోవడానికి కాన్వా ఎంతగానో ఉపయోగపడనుంది. కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా యూజర్లు, డిజైనింగ్ పై ఆసక్తి ఉన్నవారికి ఈ సబ్‌స్క్రిప్షన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని జియో వర్గాలు చెబుతున్నాయి.
Also Read: సామాన్యుడికి అంతుచిక్కని..శివుడి 5 అద్భుతమైన రహస్య శక్తులు ఇవే!
మరోవైపు ఈ ప్లాన్ లో అర్హత కలిగిన యూజర్లకు అన్‌లిమిటెడ్ 5G డేటాను సైతం జియో ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ఛాన్స్ పొందేందుకు యూజర్ల వద్ద 5G సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ తప్పనిసరి. అలాగే వారి ప్రాంతంలో జియో 5G నెట్‌వర్క్ సైతం అందుబాటులో ఉండాలని కంపెనీ వర్గాలు తెలియజేస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. వ్యాలిడిటీ, డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్, క్లౌడ్ స్టోరేజ్, డిజైనింగ్ టూల్స్ కోరుకునే వారికి జియో రూ.999 ప్లాన్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
Also Read: రైళ్లలో స్లీపర్ కోచ్ ప్రయాణికులకు షాక్.. హైకోర్టు సంచలన తీర్పు!