E-Paper
Advertisement

జియో యూజర్లకు పండగే.. ఒక్క రీఛార్జ్‌తో నెట్‌ఫ్లిక్స్ ఉచితం.. టీవీలో కూడా చూడొచ్చు!

జియో యూజర్లకు పండగే.. ఒక్క రీఛార్జ్‌తో నెట్‌ఫ్లిక్స్ ఉచితం.. టీవీలో కూడా చూడొచ్చు!
Advertisement

Jio Plans: ప్రస్తుత రోజుల్లో ఓటీటీలకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ ను పెద్ద ఎత్తున యువత సబ్ స్క్రైబ్ చేసుకుంటున్నారు. దీనిని గమనించిన టెలికాం దిగ్గజం జియో.. తన యూజర్లకు కోసం నెట్ ఫ్లిక్స్ తో కూడిన రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. అందులో నెట్‌ఫ్లిక్స్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో పాటు డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ అందించే టాప్ – 2 ప్లాన్లను ఈ కథనంలో ఇవ్వడం జరుగుతోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

రూ.1,299 నెట్‌ఫ్లిక్స్ ప్లాన్

తక్కువ ధరలో నెట్ ఫ్లిక్స్ తో పాటు భారీ డేటా, ఫ్రీ కాల్స్ కోరుకునేవారి కోసం జియో ఈ ప్లాన్ తీసుకొచ్చింది. 84 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ లో యూజర్లకు ప్రతీ రోజు 2GB హైస్పీడ్ డేటా లభించనుంది. అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్.. రోజుకు 100 SMSలు ఉచితంగా చేసుకోవచ్చు. ముందుగా చెప్పుకున్నట్లే ఈ ప్లాన్‌తో ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ (మొబైల్ ప్లాన్) లభిస్తుంది. దీని ద్వారా స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్‌లో నెట్ ఫ్లిక్స్ కంటెంట్ చూడొచ్చు. మెుబైల్ వెర్షన్ కావడంతో టీవీలో నెట్ ఫ్లిక్స్ చూడటం కుదరదు.

రూ. 1,799 నెట్‌ఫ్లిక్స్ ప్లాన్

Advertisement

టీవీలో నెట్ ఫ్లిక్స్ చూడాలని భావించే వారి కోసం జియో ఈ ప్లాన్ తీసుకొచ్చింది. ఇది కూడా 84 రోజుల వ్యాలిడితో వచ్చింది. అయితే ఈ ప్లాన్ లో రోజుకు ఏకంగా 3GB చొప్పున డేటా యూజర్ కు లభించనుంది. ప్లాన్ గడువు ముగిసే సమయానికి 252 GB యూజర్లకు లభించనుంది. అదే విధంగా ఫ్రీ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు చేసుకోవచ్చు. ఈ ప్లాన్ లో లభించే ఫ్రీ నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ను ఉపయోగించుకొని టీవీల్లోనూ సినిమాలు, సిరీస్ లు చూడొచ్చు. HD క్వాలిటీలో కంటెంట్‌ను వీక్షించవచ్చు.

Also Read: హాట్‌స్టార్ బంపరాఫర్.. రూపాయికే ప్రీమియం సబ్ స్క్రిప్షన్.. ఓటీటీ లవర్స్‌కి పండగే!

నెట్‌ఫ్లిక్స్ ఎలా యాక్టివేట్ చేయాలి?

Advertisement

పైన పేర్కొన్న ప్లాన్ లో ఒక దాన్ని రీఛార్జ్ చేసిన తర్వాత.. నెట్ ఫ్లిక్స్ యాక్టివేషన్ కొన్ని స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. ముందుగా ఫోన్ లోని మై జియో యాప్ ను ఓపెన్ చేయాలి. హోమ్‌పేజీలో ఉన్న ‘జియో సినిమా అండ్ ఓటీటీ’ లేదా నెట్‌ఫ్లిక్స్ బ్యానర్‌పై క్లిక్ చేయాలి. అనంతరం అక్కడ కనిపించే ‘Activate Now’ ఆప్షన్‌ను ఎంచుకోండి. ఆ తర్వాత మీ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ వివరాలతో లాగిన్ అయితే సరిపోతుంది.

Also Read: ప్రయాణికులకు అలర్ట్.. రైల్వేశాఖ కీలక నిర్ణయం.. ఆగస్టు 1 నుంచి కొత్త ‘తత్కాల్’ రూల్స్!

Related News

ఏఐ కోచ్,1.96 ఇంచుల డిస్‌ప్లేతో బోట్ వాచ్..రివ్యూ ఇదిగో!

ఐరన్ మ్యాన్ గ్లాసెస్ నిజం కాబోతున్నాయా? శాంసంగ్ సీక్రెట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ లీక్!

3D కర్వ్డ్ డిస్‌ప్లే, 250+ వాచ్ ఫేస్‌లతో బోల్ట్ స్మార్ట్‌వాచ్

ఇలాంటి ల్యాప్ టాప్ ఉంటే..పనులన్నీ క్షణాల్లోనే!

సగం ధరకే బెస్ట్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్..అస్సలు మిస్సవ్వొద్దు

బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ ఫీచర్లు.. గేమర్స్ ఫిదా అయ్యే ఇయర్‌ బడ్స్!

ఇయర్‌ఫోన్లు వాడుతున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. 60/60 రూల్ పాటిస్తే అంతా సెట్!

6.5 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో రానున్న HMD Key 2.. ధర కూడా తక్కువే!

Big Stories

Advertisement
×