JioHotstar Offer: ప్రస్తుత రోజుల్లో ఎంటర్ టైన్ మెంట్ కోసం ప్రతీ నెలా భారీ మొత్తంలో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు కొనడం సాధారణమైపోయింది. అయితే సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు అయ్యే ఖర్చును తగ్గించుకోవాలనుకునే వారికి సూపర్ ఆఫర్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం జియోహాట్‌స్టార్ తన వినియోగదారుల కోసం కేవలం రూ. 1 కే నెల రోజుల పాటు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన కంటెంట్‌ను వీక్షించేందుకు ఈ ఆఫర్ ఎంతగానో ఉపయోగపడనుంది.
అయితే ఈ ప్రత్యేక ప్రమోషనల్ ప్లాన్‌ను పొందేందుకు జియో హాట్ స్టార్ కొన్ని నిబంధనలను విధించింది. హాట్ స్టార్ లో లాగిన్ కావడానికి తప్పనిసరిగా జియో మెుబైల్ నెంబర్ ఉండాలి. దీనికి తోడు సదరు నెంబర్ పై ఎలాంటి యాక్టివ్ హాట్ స్టార్ ప్లాన సదరు జియో నంబర్‌పై ముందే ఎలాంటి ఆక్టివ్ జియోహాట్‌స్టార్ ప్లాన్ ఉండకూడదు. ఒకసారి రూ.1 ప్రీమియం ప్లాన్ ను యాక్టివేట్ చేసుకున్న రోజు నుంచి 30 రోజుల పాటు ఈ సబ్ స్క్రిప్షన్ అందుబాటులో ఉండనుంది. ప్రతి అకౌంట్‌కు లేదా యూజర్‌కు ఈ ఆఫర్ ఒకేసారి మాత్రమే వర్తిస్తుందని హాట్ స్టార్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ రూ.1 ప్రీమియం ప్లాన్ లో ఒకేసారి రెండు డివైజ్ (స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్ టీవీ) లలో మాత్రమే స్ట్రీమ్ చేయడానికి ఛాన్స్ ఉందని పేర్కొన్నాయి.
హాట్ స్టార్ అందిస్తున్న ఈ రూ.1 ప్లాన్ ఆఫర్ ను ఈజీగా యాక్టివేట్ చేసుకోవచ్చు. ముందుగా జియోహాట్‌స్టార్ యాప్‌ను ఓపెన్ చేసి జియో నంబర్‌తో సైన్ ఇన్ అవ్వాలి. ఆ తర్వాత ‘మై స్పేస్’ లేదా ‘ప్రొఫైల్’ సెక్షన్‌కి వెళ్లి ‘సబ్‌స్క్రిప్షన్’ టాబ్‌పై క్లిక్ చేయాలి. అక్కడ రూ. 1 ఆఫర్ కనిపిస్తే.. దానిపై క్లిక్ చేసి యూపీఐ, డెబిట్ కార్డ్ లేదా డిజిటల్ వాలెట్ ద్వారా రూపాయి చెల్లిస్తే ప్రీమియం యాక్సెస్ వెంటనే స్టార్ట్ అవుతుంది. కొన్నిసార్లు బ్రౌజర్ ఇంకోగ్నిటో (Incognito) మోడ్‌లో లాగిన్ అవ్వడం ద్వారా కూడా అర్హత ఉన్న ఖాతాలకు ఈ ఆఫర్ కనిపిస్తుందని యూజర్లు చెబుతున్నారు.
Also Read: వచ్చేస్తోంది iPhone 18 Pro సిరీస్.. లాంచ్ డేట్ ఫిక్స్ అయింది కానీ, ఫోన్ రేటును తట్టుకోవడమే కష్టమే!
ఈ ఆఫర్ పొందేటప్పుడు ఆటో-రెన్యూవల్ సెట్టింగ్స్ ఆన్ లో ఉందో లేదో చెక్ చేసుకోవడం బెటర్. ఒకవేళ పొరపాటున ఆటో-పే ఆప్షన్ ఆన్‌లో ఉంటే నెల రోజులు పూర్తవ్వగానే తదుపరి నెలకు సంబంధించిన పూర్తి సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు మీ ఖాతా నుండి ఆటోమేటిక్‌గా కట్ అవుతాయి. మీకు ఆఫర్ ముగిశాక సేవలు వద్దనుకుంటే.. పేమెంట్ చేసిన వెంటనే ఆటో-రెన్యూవల్‌ను డిసేబుల్ చేసుకోవడం బెస్ట్.
Also Read: ప్రయాణికులకు అలర్ట్.. రైల్వేశాఖ కీలక నిర్ణయం.. ఆగస్టు 1 నుంచి కొత్త ‘తత్కాల్’ రూల్స్!