Jio : ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు తన వినియోగదారుల కోసం కొత్త ప్లాన్స్ ను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. రీఛార్జ్ తో పాటు ఓటీటీ బెనిఫిట్స్ సైతం అందించే విధంగా కొత్త ప్రీ పెయిడ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అన్ లిమిటెడ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ తో అతి తక్కువ ధరకే బెస్ట్ ప్లాన్ వినియోగదారులకు అందిస్తుంది. మరి ఈ ప్లాన్ వివరాలు ఏంటి? ధర ఎంత ఏఏ ఓటిటి ప్లాట్ఫామ్స్ ఉండనున్నాయి అనే విషయం తెలుసుకుందాం.
ప్రముఖ ప్రైయివేట్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ప్రారంభమైనప్పటి నుంచి తను వినియోగదారుల కోసం కొత్త ప్లాన్స్ ను తీసుకొస్తూనే ఉంది. అన్లిమిటెడ్ కాల్స్ తో పాటు డేటా సదుపాయాలను అందిస్తోంది. ఇప్పటికే జియో పోర్ట్ఫోలియాలో ఎన్నో ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉండగా.. తాజాగా మరో కొత్త ప్లాన్ ను పరిచయం చేసింది. ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ.448. ఇందులో అపరిమిత కాలింగ్ తో పాటు ఇంటర్నెట్ సదుపాయం సైతం కలదు.
ఈ ప్లాన్ లో భాగంగా 2GB డేటా 100 ఎస్ఎంఎస్ ను జియో అందిస్తుంది. ఇక 12 OTT ప్లాట్ఫార్మ్స్ సైతం ఇస్తుంది. దీంతో మీకు ఇష్టమైన వెబ్ సిరీస్, మూవీస్, సీరియల్స్ తో పాటు మరింత ఎంటర్టైన్మెంట్ ను అందించే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్లాన్ లో ఏ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉండనున్నాయి అంటే…
Jio రీఛార్జ్ ప్లాన్ లో OTT యాప్స్ తో పాటు Jio TV, Jio క్లౌడ్ యాక్సెస్ కూడా ఉచితంగా ఇవ్వబడుతోంది. ఈ రీఛార్జ్ ప్లాన్ అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌ల నుండి ప్రీపెయిడ్ ప్లాన్‌లను రీఛార్జ్ చేసుకోవచ్చు. Jio ఇటీవలే రూ. 899, రూ. 3599 ఆఫర్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో EaseMyTrip ద్వారా రూ. 3000 తగ్గింపు, అజియో యాప్‌లో రూ. 999 లేదా అంతకంటే ఎక్కువ షాపింగ్‌పై రూ. 200 తగ్గింపు ఉన్నాయి. అంతే కాదు స్విగ్గీపై రూ.150 తగ్గింపు కూడా ఇస్తోంది.
OTT సబ్‌స్క్రిప్షన్‌లు, డేటా రోల్ ఓవర్ తో జియో నుండి ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ సెంట్రిక్ ప్లాన్స్ వచ్చేశాయి. వీటి ధర రూ. 329, రూ. 1029, రూ. 1049. అదనంగా ఈ ప్లాన్స్ అపరిమిత కాలింగ్‌ను కూడా అందిస్తున్నాయి. జియో ఇతర ప్లాన్‌లలో ఒకటి రూ. 355కే వస్తుంది. దీనిని ఫ్రీడమ్ ప్లాన్ అని కూడా పిలుస్తారు. దీనికి 30 రోజుల చెల్లుబాటు, 100 ఉచిత SMS, అపరిమిత కాలింగ్ ఉన్నాయి. ఇక ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ట్రై చేసేయండి.
ALSO READ : మీడియాటెక్ ప్రాసెసర్, 6000mah బ్యాటరీ, 50MP కెమెరాతో రియల్ మీ కొత్త మెుబైల్