Realme 14X : ఎప్పటికప్పుడు తన వినియోగదారుల కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్స్ ను తీసుకొస్తున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ (Realme) తాజాగా మరో మొబైల్ ను లాంఛ్ చేయడానికి సిద్ధమవుతుంది. బడ్జెట్ లోనే 5G స్మార్ట్ ఫోన్ ను డిసెంబర్ 18న భారతీయ మార్కెట్లోకి తీసుకురాటానికి సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మొబైల్ ఫీచర్స్ తో పాటు స్పెసిఫికేషన్స్, వేరియంట్స్ వివరాలు వైరల్ గా మారాయి.
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ ఎప్పటికప్పుడు తన కస్టమర్ కోసం అదిరిపోయే లేటెస్ట్ మొబైల్స్ ను బడ్జెట్ ఫ్రెండ్లీగానే తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 18న మరో కొత్త మొబైల్ ను లాంఛ్ చేయడానికి సిద్ధమవుతుంది ఆ సంస్థ. రియల్ మీ 14ఎక్స్ (Realme 14X) పేరుతో రాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి మరో మూడు రోజుల్లో వచ్చేస్తుంది. ఇప్పటికే ఈ మొబైల్ ఫీచర్స్ ఆన్ లైన్ లో లీక్ అవ్వడంతో టెక్ ప్రియులు ఈ ఫోన్ లాంఛింగ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
రియల్ మీ 14X స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ తో రాబోతుంది. ఇక ఇందులో కెమెరా ఫీచర్స్ సైతం అద్భుతంగా ఉన్నాయి. 50 మెగా పిక్సెల్ సోనీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో తెలుస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ 8 GB RAM + 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇంకా ఈ ఫోన్ లో అదిరే ఫీచర్స్ సైతం ఉండనున్నాయి.
Realme 14X లీక్ ఫీచర్స్ –
6.67 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1604 x 720 పిక్సల్స్ రిజల్యూషన్ తో రాబోతుంది. ఇక మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, రియల్ మీ యూఐ 5.0 ఆధారిత ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్, 6 GB RAM + 128 GB ఇంటర్నల్ స్టోరేజ్, 8 GB RAM + 128 GB ఇంటర్నల్ స్టోరేజ్, 8 GB RAM + 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో మూడు వేరియంట్స్ లో రాబోతుంది. బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీలు – వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వచ్చేస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 5G నెట్ వర్క్ సపోర్ట్, IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 6000 mah బ్యాటరీతో ఈ మెబైల్ రాబోతుంది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర సైతం అందుబాటులోనే ఉండనుంది. రూ. 15,000 లోపే ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండియాలో ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ లో ఈ మొబైల్ అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా బడ్జెట్ ఫ్రెండ్లీలో రియల్ మీ తీసుకొస్తున్న ఈ మొబైల్ కచ్చితంగా స్మార్ట్ ఫోన్ ప్రియులను ఆకట్టుకుంటుందనే చెప్పవచ్చు.
ALSO READ : ఇకపై ఎంతమంది గ్రూప్ మెంబర్స్ ఆన్లైన్లో ఉన్నారో ఇట్టే తెలుసుకోవచ్చు