Ambrane 20000mah power bank: ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లలో రీల్స్, మ్యాప్స్, గేమింగ్, కెమెరా వాడకం.. పెరిగిన తర్వాత రోజు మొత్తం ఒక ఛార్జింగ్ సరి పోవడం కష్టంగా మారింది. అందుకే చాలా మంది 20,000mAh పవర్ బ్యాంకులను ఇష్ట పడుతుంటారు. కానీ సాధారణ 20,000mAh మోడల్స్ ఇటుకలా లావుగా ఉండటం, పక్కన ఎక్స్‌ట్రా కేబుల్ లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలో కాంపాక్ట్ సైజు, ఇన్‌బిల్ట్ టైప్-సీ కేబుల్ ఫీచర్‌తో రూ.1,999 ధరలో కనిపించే ఆంబ్రేన్ పాకెట్ సైజు పవర్ బ్యాంక్ యూజర్లకు ఎంతవరకు ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం.
కాంపాక్ట్ డిజైన్ , ఇన్‌బిల్ట్ టైప్-సీ కేబుల్:
ఈ పవర్ బ్యాంక్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన ఫీచర్ ఇన్‌బిల్ట్ టైప్-సీ కేబుల్. బయటకు వెళ్లేటప్పుడు విడిగా డేటా కేబుల్ తీసుకెళ్లడం మర్చి పోయినా, ఇందులో ..ఉన్న కేబుల్ ద్వారా నేరుగా ఫోన్‌కు కనెక్ట్ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు. కొన్ని వేరియంట్లలో ఈ కేబుల్‌ను హ్యాంగింగ్ లూప్‌లా కూడా వాడుకునే సౌకర్యం ఉంటుంది. కాబట్టి బ్యాగ్‌కో లేదా హ్యాండిల్‌కో ఈజీగా తగిలించుకోవచ్చు.ఇది పాకెట్ సైజుకు దగ్గరగా కాంపాక్ట్‌గా ఉండటం వల్ల చేతిలో పట్టుకోవడానికి, స్లింగ్ బ్యాగ్‌లో వేసుకోవడానికి ఇబ్బంది ఉండదు.
కెపాసిటీ, ఛార్జింగ్ స్పీడ్:
20,000mAh బ్యాటరీ కెపాసిటీ ఉండటం వల్ల మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సైజును బట్టి సుమారు మూడు నుంచి నాలుగు సార్లు వరకు ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఏ పవర్ బ్యాంక్‌లోనైనా వోల్టేజ్ కన్వర్షన్, హీట్ లాస్ కారణంగా వాస్తవంగా అందే ఎనర్జీ కెపాసిటీలో కొంత భాగం తగ్గుతుంది. అది సాధారణమే. వేరియంట్‌ను బట్టి 22.5W లేదా అంతకు మించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, PD, QC వంటి ప్రోటోకాల్స్ ఉండటం వల్ల సపోర్ట్ చేసే డివైజ్‌లను త్వరగా ఛార్జ్ చేయవచ్చు.
పోర్ట్స్ , సేఫ్టీ ఫీచర్లు:
ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ డివైజ్‌లను కనెక్ట్ చేసుకునే వెసులుబాటు దీనిలో ఉంటుంది. ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు, టైప్-సీ ఫోన్లు ఇలా విభిన్నగాడ్జెట్లకు ఇది పని కొస్తుంది. అలాగే.. ఓవర్-ఛార్జింగ్, షార్ట్ సర్క్యూట్ వంటి సమస్యల నుంచి రక్షణ కల్పించే మల్టీ-లేయర్ ప్రొటెక్షన్ ఫీచర్లు కూడా ఇందులో ఉంటాయి. బ్యాటరీ స్థాయిని తెలుసుకోవడానికి ఎల్‌ఈడీ ఇండికేటర్లు కూడా దీనిలో ఉంటాయి.
Also Read: బ్లూటూత్ స్పీకర్ కొనబోతున్నారా? పోర్టబుల్ Vs పార్టీ స్పీకర్ మధ్య అసలు తేడా ఇదే!
రూ.1,999 ధర:
రూ.1,999 ధర వద్ద 20,000mAh కెపాసిటీ, కాంపాక్ట్ ఫామ్ ఫ్యాక్టర్, ఇన్‌బిల్ట్ టైప్-సీ కేబుల్ కలవడం బడ్జెట్ సెగ్మెంట్‌లో మంచి ఆప్షన్ గా నిలుస్తుంది. ఆన్‌లైన్ సేల్స్ లేదా ఆఫర్లను బట్టి ధరలో.. కొద్ది పాటి మార్పులు ఉండొచ్చు. అయితే 20,000mAh బ్యాటరీ ఉండటం వల్ల మినీ పవర్ బ్యాంక్ అని పిలిచినా, పూర్తిగా 5,000mAh మోడల్ అంత తేలికగా ఉండదు. కొంత బరువు, మందం తప్పని సరిగా ఉంటాయి.
మీ ఫోన్ లేదా గాడ్జెట్లకు టైప్-సీ పోర్ట్ ప్రధానంగా ఉంటే.. ఇన్‌బిల్ట్ కేబుల్ చాలా ఉపయోగ పడుతుంది. మీ ఫోన్ సపోర్ట్ చేసే.. ఛార్జింగ్ వాట్టేజ్‌కు ఈ పవర్ బ్యాంక్ అవుట్ పుట్ సరి పోతుందా లేదా చెక్ చేసుకోండి. అలాగే వారంటీ టైం, సర్వీస్ పాలసీలు కొనే ముందు ఒక సారి చెక్ చేసుకోవడం మంచిది.
మొత్తానికి.. ఎక్కడికి వెళ్లినా కేబుల్ టెన్షన్ లేకుండా, మంచి బ్యాటరీ బ్యాకప్‌తో, పాకెట్‌ఫ్రెండ్లీ సైజులో పవర్ బ్యాంక్ కావాలనుకునే.. వారికి రూ.1,999 ధరలో ఈ మోడల్ మంచి ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు.