E-Paper
Advertisement

రూ.5,509కే.. ప్రొఫెషనల్ కాన్ఫరెన్స్ స్పీకర్, డోంట్ మిస్

రూ.5,509కే.. ప్రొఫెషనల్ కాన్ఫరెన్స్ స్పీకర్, డోంట్ మిస్
Advertisement

Emeet m0 plus review: ఈరోజుల్లో జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, గూగుల్ మీట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో రోజూ గంటల తరబడి ఆన్‌ లైన్ కాల్స్, క్లయింట్ ప్రెజెంటేషన్లు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో రోజంతా ..చెవులకు హెడ్‌ సెట్ పెట్టుకుని కూర్చోవడం వల్ల చెవుల నొప్పి, అలసట రావడం సహజం. అలాంటప్పుడు టేబుల్ మీద పెట్టుకుని హ్యాండ్స్-ఫ్రీగా మాట్లాడుకునే కాన్ఫరెన్స్ స్పీకర్‌ ఫోన్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ముఖ్యంగా రూ.5,509 బడ్జెట్‌లో..ఈ మోడల్ అందించే.. ఫీచర్లు చిన్న మీటింగ్ రూమ్స్‌కు,హోమ్ ఆఫీస్ డెస్క్‌కు చక్కగా సరి పోతాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం

పూర్తి ఫీచర్లు:

కాంపాక్ట్ డిజైన్, పోర్టబిలిటీ:
ఈ స్పీకర్‌ ఫోన్ చూడగానే ప్రొఫెషనల్‌గా, ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తుంది. గుండ్రటి, సన్నని ఆకారంలో.. ఉండటం వల్ల ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. పైభాగంలో ఉండే టచ్ కంట్రోల్ బటన్లు చాలా స్పష్టంగా ఉంటాయి. కాల్ అటెండ్ చేయడం, కట్ చేయడం, వాల్యూమ్ పెంచడం లేదా తగ్గించడం, ఒక్క టచ్‌తో మైక్ మ్యూట్.. చేయడం వంటి పనులను మీటింగ్ మధ్యలో ఎంతో వేగంగా చేసుకోవచ్చు. ఎల్‌ఈడీ లైట్ ఇండికేటర్లు మైక్ ఆన్‌లో ఉందా లేదా మ్యూట్‌లో ఉందా అనేది వెంటనే తెలియజేస్తాయి.

Advertisement

4 మైక్స్,360° వాయిస్ పికప్:
ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం 4 ఓమ్నిడైరెక్షనల్ మైక్రోఫోన్లు. ఇవి స్పీకర్ చుట్టూ 360 డిగ్రీల కోణంలో ఉన్న వ్యక్తుల మాటలను స్పష్టంగా గ్రహిస్తాయి. అంటే.. మీరు రూమ్‌లో అటూ ఇటూ నడుస్తూ మాట్లాడినా లేదా చిన్న రూమ్ లో నలుగురైదుగురు కలిసి కూర్చుని మాట్లాడినా, అవతలి వారికి వాయిస్ చాలా క్లియర్‌గా వినిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ల్యాప్‌ టాప్ దగ్గరకు వంగి మాట్లాడాల్సిన అవసరం ఉండదు.

నాయిస్ రిడక్షన్, ఆడియో క్లారిటీ:
ఆఫీస్ కాల్స్‌లో ఫ్యాన్ సౌండ్, కీబోర్డ్ టైపింగ్ సౌండ్ లేదా బయటి ట్రాఫిక్ శబ్దాలు పెద్ద సమస్యగా మారతాయి. ఈ డివైజ్‌లో ఉన్న స్మార్ట్ వాయిస్ ఎన్‌హాన్స్‌మెంట్ , నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ అనవసరమైన బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్ తగ్గించి, మాట్లాడే వ్యక్తి గొంతుకు ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే.. అవతలి వైపు నుంచి వచ్చే మాటలు రీ సౌండ్ రాకుండా ఎకో క్యాన్సిలేషన్ కూడా చక్కగా పనిచేస్తుంది.

Advertisement

ప్లగ్-అండ్-ప్లే కనెక్టివిటీ:
టెక్నికల్ సెటప్‌తో ఇబ్బంది పడకుండా.. యూఎస్‌బీ కేబుల్ ద్వారా లేదా బ్లూటూత్ ద్వారా కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్‌లకు ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా డ్రైవర్లు ఇన్‌స్టాల్ చేయాల్సిన పని లేకుండానే ప్రధాన వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్‌తో ఇది వెంటనే పని చేస్తుంది. బిల్ట్-ఇన్ బ్యాటరీ ఉండటం వల్ల వైర్లు లేకుండా.. కూడా మీటింగ్స్ నిర్వహించుకునే వెసులుబాటు లభిస్తుంది.

Also Read: బ్లూటూత్ స్పీకర్ కొనబోతున్నారా? పోర్టబుల్ Vs పార్టీ స్పీకర్ మధ్య అసలు తేడా ఇదే!

ధర:
ఆన్‌లైన్ క్లాసులు.. తీసుకునే టీచర్లు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఐటీ ఉద్యోగులు, స్టార్టప్ టీమ్స్ , చిన్న కాన్ఫరెన్స్ రూమ్స్ ఉన్న ఆఫీసులకు రూ.5,509 ధరలో ..ఈ మోడల్ మంచి వాల్యూ ఫర్ మనీ గాడ్జెట్ అని చెప్పొచ్చు. అయితే మీరు పెద్ద ఆడిటోరియం లేదా.. పదిహేను ఇరవై మంది ఉండే భారీ బోర్డ్‌రూమ్ కోసం చూస్తుంటే.. మాత్రం, ఎక్కువ రేంజ్ ఉన్న పెద్ద కాన్ఫరెన్స్ సిస్టమ్‌ కొనడం బెస్ట్.

Related News

రూ.1,999కే పవర్‌ఫుల్ బ్యాకప్..పాకెట్ సైజులోనే పవర్ బ్యాంక్

సౌండ్‌బార్ పక్కన పెట్టేయండి,రూ.22,999కే అసలైన థియేటర్ సౌండ్ !

రూపాయి ఖర్చు లేదు.. వాటర్ ట్యాంక్‌కు ఇదొక్కటి చుడితే చాలు.. ఎముకలు కొరికే చలిలోనూ గోరువెచ్చని నీళ్లు!

స్క్రీన్‌ లేని ఏఐ డివైస్‌తో నథింగ్.. డిసెంబర్ 8న లాంచ్, డిజైన్ కూడా వచ్చేసింది!

పదే పదే కంపెనీ కాల్స్, ఫేక్ మెసేజ్‌లు వస్తున్నాయా? నిమిషంలో వాటికి చెక్ పెట్టే సీక్రెట్ సెట్టింగ్ ఇదే!

కొత్త గీజర్ తీసుకుంటున్నారా? సేఫ్టీ, కరెంట్ ఆదా కోసం ఈ 4 విషయాలు తప్పకుండా చెక్ చేయండి!

పిడుగులు పడే సమయంలో వైఫై రూటర్, స్మార్ట్ టీవీ ప్లగ్స్ తీసేయాలా? స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోతుందా?

Big Stories

Advertisement
×