E-Paper
Advertisement

స్క్రీన్‌ లేని ఏఐ డివైస్‌తో నథింగ్.. డిసెంబర్ 8న లాంచ్, డిజైన్ కూడా వచ్చేసింది!

స్క్రీన్‌ లేని ఏఐ డివైస్‌తో నథింగ్.. డిసెంబర్ 8న లాంచ్, డిజైన్ కూడా వచ్చేసింది!
Advertisement

Nothing AI Device: స్మార్ట్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నథింగ్ కంపెనీ..‌ ఇప్పుడు మరో కొత్త విభాగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ రూపొందిస్తున్న ఏఐ ఆధారిత డివైస్‌ను డిసెంబర్ 8న పరిచయం చేయనుంది. ఈ విషయాన్ని నథింగ్ ఎక్స్‌ వేదికగా ప్రకటించింది. అయితే, కొత్త డివైస్‌ పేరు, పూర్తి వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఇప్పటివరకు వచ్చిన టీజర్లను చూస్తే.. ఇది సాధారణ ఫోన్‌లా కాకుండా ప్రత్యేకంగా ఏఐ పనుల కోసం తయారవుతున్న పరికరంగా కనిపిస్తోంది.

డిసెంబర్ 8న లాంచ్..

నథింగ్‌ తాజాగా చేసిన పోస్టులో డిసెంబర్ 8 తేదీని ప్రకటించింది. కొత్త ఉత్పత్తి పేరును చెప్పకపోయినా, కొంతకాలంగా కంపెనీ ఇస్తున్న సంకేతాలు ఇది ఏఐ డివైస్‌ అనే అంచనాలకు బలం ఇస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో గుండ్రంగా ఉన్న మెటల్‌ భాగం కనిపిస్తోంది. దాని చుట్టూ మెరిసే వెండి, నలుపు రంగుల్లో పలు రింగులు ఉన్నాయి. ఈ ఒక్క చిత్రంతో పరికరం ఎలా ఉంటుందో స్పష్టంగా చెప్పలేం.

స్క్రీన్‌ ఉండదన్న కార్ల్‌ పీ..

Advertisement

నథింగ్‌ సీఈఓ కార్ల్‌ పీ గతంలో ఈ డివైస్‌ గురించి కొన్ని వివరాలు పంచుకున్నారు. డిసెంబర్‌లో కొత్త పరికరాన్ని తీసుకొస్తామని, దానికి స్క్రీన్‌ ఉండదని చెప్పారు. ఇది ఫోన్‌లో వాడే మరో యాప్‌ కాదని, ప్రత్యేకంగా ఉపయోగించుకునే సాధనమని వివరించారు. నథింగ్‌ ఉత్పత్తులకు ప్రత్యేకమైన డిజైన్‌, వ్యక్తిత్వం ఈ పరికరంలోనూ కనిపిస్తాయని ఆయన అన్నారు. అంటే.. ఫోన్‌ స్క్రీన్‌పై కాకుండా వాయిస్‌ లేదా బటన్ల ద్వారా దీన్ని వాడే అవకాశం ఉంది.

Also Read: పదే పదే కంపెనీ కాల్స్, ఫేక్ మెసేజ్‌లు వస్తున్నాయా? నిమిషంలో వాటికి చెక్ పెట్టే సీక్రెట్ సెట్టింగ్ ఇదే!

Advertisement

టీజర్లలో కనిపించిన డిజైన్‌..

గతంలో చూపించిన టీజర్లలో మెటల్‌ బాడీ, గుండ్రని అంచులు, ఒక ఫిజికల్‌ బటన్‌ కనిపించాయి. అలాగే ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో రెండు చిన్న ఎల్‌ఈడీ లైట్లు కూడా ఉన్నాయి. ఇటీవల బయటకు వచ్చిన లీక్‌ ప్రకారం, ఈ పరికరం చిన్న దీర్ఘచతురస్రాకార డిజైన్‌లో ఉండొచ్చు. దానిపై ‘టాక్‌’ అని రాసి ఉన్న ప్రత్యేక బటన్‌, గుండ్రని కంట్రోల్‌ ఉండే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇవి అధికారిక వివరాలు కావు.

ఏఐతో ఏం చేయొచ్చు?

ఈ డివైస్‌తో వాయిస్‌ రికార్డింగ్‌, మాట్లాడిన మాటలను మరో భాషలోకి మార్చడం, ముఖ్యమైన విషయాలను నోట్స్‌గా భద్రపరచడం వంటి పనులు చేయొచ్చని అంచనా. కానీ నథింగ్‌ ఇంకా ఫీచర్లను నిర్ధారించలేదు. కాబట్టి లీక్‌లను నిజమని భావించకూడదు. ప్రస్తుతం కంపెనీ ఫోన్లు, ఇయర్‌ఫోన్లతో పాటు సీఎంఎఫ్‌ బ్రాండ్‌ కింద స్మార్ట్‌వాచ్‌లు, స్పీకర్లు కూడా విక్రయిస్తోంది. డిసెంబర్‌ 8న ఈ కొత్త పరికరం గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ధర, అమ్మకాలు ఎప్పుడు మొదలవుతాయనే విషయాలపై స్పష్టత లేదు.

Also Read: కొత్త గీజర్ తీసుకుంటున్నారా? సేఫ్టీ, కరెంట్ ఆదా కోసం ఈ 4 విషయాలు తప్పకుండా చెక్ చేయండి!

Tags

Related News

పదే పదే కంపెనీ కాల్స్, ఫేక్ మెసేజ్‌లు వస్తున్నాయా? నిమిషంలో వాటికి చెక్ పెట్టే సీక్రెట్ సెట్టింగ్ ఇదే!

కొత్త గీజర్ తీసుకుంటున్నారా? సేఫ్టీ, కరెంట్ ఆదా కోసం ఈ 4 విషయాలు తప్పకుండా చెక్ చేయండి!

పిడుగులు పడే సమయంలో వైఫై రూటర్, స్మార్ట్ టీవీ ప్లగ్స్ తీసేయాలా? స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోతుందా?

రూటు మార్చిన సైబర్ దొంగలు.. బ్యాంకులు కాదు, ఆ యాప్స్ ద్వారానే నిలువు దోపిడీ.. కేంద్రం హెచ్చరిక!

బ్లూటూత్ స్పీకర్ కొనబోతున్నారా? పోర్టబుల్ Vs పార్టీ స్పీకర్ మధ్య అసలు తేడా ఇదే!

జియో సంచలన ఆఫర్.. రోజుకు 2.5GB డేటాతో పాటు 12 నెలల Canva Pro ఉచితం.. ఎలా పొందాలంటే?

ఫ్లైట్ మోడ్‌లో..ఫోన్ ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతుందా?ఇందులో నిజమెంత?

Big Stories

Advertisement
×