E-Paper
Advertisement

ఇక టీవీలు పక్కన పెట్టేయండి..ఈ పోర్టబుల్ ప్రొజెక్టర్లతో 150 ఇంచుల స్క్రీన్‌!

ఇక టీవీలు పక్కన పెట్టేయండి..ఈ పోర్టబుల్ ప్రొజెక్టర్లతో 150 ఇంచుల స్క్రీన్‌!
Advertisement

Best gaming projectors 2026: గేమింగ్ ప్రపంచంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జీటీఏ 6 సందడి మొదలైపోయింది! హై-స్పీడ్ కార్ రేసింగ్ అయినా, అదిరిపోయే యాక్షన్ మిషన్స్ అయినా చిన్న టీవీ స్క్రీన్ కంటే.. 100 నుంచి 150 ఇంచుల భారీ స్క్రీన్‌పై ఆడితే ఆ కిక్కే వేరు. అయితే గేమింగ్ కోసం ప్రొజెక్టర్ కొనేటప్పుడు విజువల్స్ మాత్రమే కాదు, తక్కువ ఇన్‌పుట్ ల్యాగ్, హై రిఫ్రెష్ రేట్ కూడా చాలా ముఖ్యం. మరి బడ్జెట్ నుంచి ప్రీమియం రేంజ్ వరకు జీటీఏ 6 కోసం బెస్ట్ 5 పోర్టబుల్ ప్రొజెక్టర్లు ఏవో ఇప్పుడు చూద్దాం!

బెస్ట్ 5 పోర్టబుల్ ప్రొజెక్టర్లు:

1. boAt Cinehead F1 Pro:

గేమింగ్, మూవీస్ రెండింటినీ ఒకే సారి నెక్స్ట్ లెవల్‌లో ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ మోడల్ ఒక అద్భుతమైన ఆప్షన్. ఇందులో లేటెస్ట్ HDMI 2.1 పోర్ట్ ఉండటం వల్ల మీ PS5, Xbox కన్సోల్స్‌ను నేరుగా కనెక్ట్ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడొచ్చు. ఇది నేటివ్ ఫుల్ హెచ్డ రిజల్యూషన్, 500 ANSI ల్యూమెన్స్ బ్రైట్‌నెస్, లేటెస్ట్ గూగుడ్ టీవీసపోర్ట్‌తో వస్తుంది. 150 ఇంచుల వరకు భారీ స్క్రీన్ సైజులో గేమ్ ఆడుతుంటే నిజంగా ఒక ప్రైవేట్ థియేటర్‌లో కూర్చున్న ఫీల్ కలుగుతుంది. దీని బిల్ట్-ఇన్ స్పీకర్లు కూడా మంచి సౌండ్ క్వాలిటీని ఇస్తాయి.

Advertisement

ధర:మార్కెట్లో దీని ధర రూ.34,999 ఉంది.

2. Samsung The Freestyle 2nd Gen:

బ్రాండ్ వాల్యూ, పోర్టబిలిటీ, ప్రీమియం క్వాలిటీ కోరుకునే గేమర్లకు శాంసంగ్ ఫ్రీస్టైల్ 2nd జెన్ బెస్ట్ ఛాయిస్. దీని ప్రత్యేకత ఏంటంటే ఇందులో బిల్ట్-ఇన్ సామ్సంగ్ గేమింగ్ హబ్ ఉంటుంది. అంటే మీ దగ్గర గేమింగ్ కన్సోల్ లేకపోయినా సపోర్టెడ్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా నేరుగా గేమ్స్ ఆడుకోవచ్చు. 180-డిగ్రీల డైనమిక్ యాంగిల్, ఆటోమేటిక్ కీస్టోన్ కరెక్షన్, ఆటో ఫోకస్ ఫీచర్లు ఉండటం వల్ల మీరు గోడకు లేదా సీలింగ్‌కు ఎటు తిప్పినా స్క్రీన్ క్లియర్‌గా సెట్ అవుతుంది. తక్కువ ఇన్‌పుట్ ల్యాగ్‌తో స్మూత్ విజువల్స్ అందించడంలో ఇది ముందుంటుంది.

Advertisement

ధర: దీని ధర రూ.42,000 నుంచి రూ.44,990 వరకు అందుబాటులో ఉంది.

3. WZATCO Yuva Blaze:

మిడ్-రేంజ్ బడ్జెట్‌లో హై బ్రైట్‌నెస్, షార్ప్ విజువల్స్ కావాలంటే ఈ మోడల్ కొనొచ్చు. ఇది నేటివ్ 1080p రిజల్యూషన్‌తో పాటు 4K హెచ్డీఆర్ కంటెంట్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో 12,500 ల్యూమెన్స్ బ్రైట్‌నెస్ , 7,000:1 కాంట్రాస్ట్ రేషియో ఉండటం వల్ల గేమ్‌లోని నైట్ సీన్స్, వర్షం ఎఫెక్ట్స్, నియాన్ లైట్లు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. తక్కువ బడ్జెట్‌లో ..మంచి కలర్ అక్యూరసీ కోరుకునే గేమర్లకు ఇది బాగా నచ్చుతుంది.

ధర: దీని ధర రూ.16,990గా ఉంది.

4. BeamX Neo GTV:

డస్ట్-ఫ్రీ సీల్డ్ ఆప్టికల్ ఇంజన్, అఫీషియల్ గూగుల్ టీవీ సపోర్ట్‌తో వస్తున్న మరో సూపర్ పోర్టబుల్ ప్రొజెక్టర్ ఇది. ఇందులోని HDMI 2.0 ఇన్‌ పుట్ ద్వారా.. మీ గేమింగ్ కన్సోల్‌ను ఈజీగా కనెక్ట్ చేయెచ్చు. ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్ ఫీచర్లు , 1080p నేటివ్ రిజల్యూషన్‌తో ఫాస్ట్ యాక్షన్ గేమ్స్ ఆడేటప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా స్మూత్ విజువల్స్ అందిస్తుంది. బ్యాగ్‌లో పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లేలా దీని డిజైన్ చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది.

ధర: ఇది మార్కెట్లోరూ.21,990 నుంచి రూ.24,990 మధ్య లభిస్తోంది.

Also Read: రూ.1,999కే పవర్‌ఫుల్ బ్యాకప్..పాకెట్ సైజులోనే పవర్ బ్యాంక్

5. Portronics Beem 470:

తక్కువ బడ్జెట్‌లో పెద్ద స్క్రీన్ గేమింగ్ కల నెరవేర్చుకోవాలనుకునే వారికి ఈ మోడల్ పర్ఫెక్ట్ ఆప్షన్. 180-డిగ్రీల రొటేషన్ డిజైన్, 4,500 ల్యూమెన్స్ బ్రైట్‌నెస్,150 ఇంచుల వరకు ప్రొజెక్షన్ సైజు దీని మెయిన్ హైలైట్ . ఇందులో ఉన్న HDMI పోర్ట్ సాయంతో మీ PS5, Xbox లేదా గేమింగ్ ల్యాప్‌టాప్‌ను కనెక్ట్ చేసి తక్కువ ఖర్చులోనే బిగ్ స్క్రీన్ గేమింగ్ ఎంజాయ్ చేయెచ్చు.

ధర: దీని ధర రూ.11,229 నుంచి రూ.11,449 మధ్య మాత్రమే ఉంది.

Related News

రూ.1,999కే పవర్‌ఫుల్ బ్యాకప్..పాకెట్ సైజులోనే పవర్ బ్యాంక్

సౌండ్‌బార్ పక్కన పెట్టేయండి,రూ.22,999కే అసలైన థియేటర్ సౌండ్ !

రూ.5,509కే.. ప్రొఫెషనల్ కాన్ఫరెన్స్ స్పీకర్, డోంట్ మిస్

రూపాయి ఖర్చు లేదు.. వాటర్ ట్యాంక్‌కు ఇదొక్కటి చుడితే చాలు.. ఎముకలు కొరికే చలిలోనూ గోరువెచ్చని నీళ్లు!

స్క్రీన్‌ లేని ఏఐ డివైస్‌తో నథింగ్.. డిసెంబర్ 8న లాంచ్, డిజైన్ కూడా వచ్చేసింది!

పదే పదే కంపెనీ కాల్స్, ఫేక్ మెసేజ్‌లు వస్తున్నాయా? నిమిషంలో వాటికి చెక్ పెట్టే సీక్రెట్ సెట్టింగ్ ఇదే!

కొత్త గీజర్ తీసుకుంటున్నారా? సేఫ్టీ, కరెంట్ ఆదా కోసం ఈ 4 విషయాలు తప్పకుండా చెక్ చేయండి!

Big Stories

Advertisement
×