Lumio Aura 5 Review: ఈరోజుల్లో స్మార్ట్ టీవీలు.. ఎంత సన్నగా వస్తున్నాయో, వాటిలో ఉండే బిల్ట్-ఇన్ స్పీకర్ల సౌండ్ కూడా అంతే బలహీనంగా ఉంటోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, క్రికెట్ మ్యాచ్‌లు, మ్యూజిక్ ఎంజాయ్ చేయాలంటే.. ఎక్స్‌టర్నల్ ఆడియో సిస్టమ్ తప్పని సరి అయింది. సాధారణంగా చాలా మంది రూ.20 వేల నుంచి రూ.25 వేల బడ్జెట్‌లో ఏదైనా సౌండ్‌బార్ కొనేస్తుంటారు. కానీ ఈ మోడల్ స్పీకర్లను ఒక సారి వెంటే..సౌండ్ బార్ ఆలోచనను పక్కన పెట్టేయడం.. ఖాయం అనిపిస్తుంది. రూ.22,999 ధరతో వచ్చిన ఈ స్పీకర్లు లివింగ్ రూమ్ ఆడియో గేమ్‌ను పూర్తిగా మార్చేస్తున్నాయి.
ప్రీమియం డిజైన్ ,బిల్డ్ క్వాలిటీ:
లుమియో ఆరా 5 చూడగానే చాలా క్లాసీగా, మోడ్రన్ హోమ్ డెకర్‌కు తగ్గట్టుగా కనిపిస్తుంది. ప్లాస్టిక్ బాడీ కాకుండా.. దృఢమైన క్యాబినెట్ ఫినిషింగ్ ఉండటం వల్ల వైబ్రేషన్స్ తగ్గి సౌండ్ మరింత క్లీన్‌గా వస్తుంది. టీవీ పక్కన పెట్టినా లేదా వర్క్ డెస్క్ మీద.. అమర్చుకున్నా ఇవి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. సైజులో.. మరీ భారీగా కాకుండా, మీడియం సైజు లివింగ్ రూమ్ లేదా బెడ్ రూమ్‌కు పర్ఫెక్ట్‌గా సరి పోయేలా వీటిని డిజైన్ చేశారు.
సౌండ్‌బార్ కంటే ఎందుకు బెటర్?
సౌండ్ బార్‌లలో స్పీకర్ డ్రైవర్లన్నీ ఒకే పొడవాటి బాక్స్‌లో దగ్గర దగ్గరగా ఉంటాయి. దాని వల్ల లెఫ్ట్, రైట్ ఛానెల్ సెపరేషన్ అంత స్పష్టంగా తెలియదు. కానీ ఈ మోడల్ రెండు విడివిడి స్పీకర్లుగా రావడం వల్ల, మీరు వాటిని టీవీకి ఇరు వైపులా సరైన దూరంలో పెట్టుకోవచ్చు. దీని వల్ల నిజ మైన వైడ్ సౌండ్ స్టేజ్ ఫీల్ కలుగుతుంది. సినిమాల్లో.. యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు ఒకవైపు నుంచి మరో వైపుకు సౌండ్ కదులుతున్న ఫీలింగ్ చాలా సహజంగా వినిపిస్తుంది.
ఆడియో, బేస్ క్వాలిటీ:
రూ.22,999 రేంజ్‌లో.. ఈ స్పీకర్ల ఆడియో ట్యూనింగ్ నిజంగా ఆకట్టుకుంటుంది. వోకల్స్ చాలా క్రిస్ప్‌గా, క్లియర్‌గా వినిపిస్తాయి. కాబట్టి సినిమాల్లో డైలాగులు అర్థం కావడానికి వాల్యూమ్ పెంచాల్సిన అవసరం ఉండదు. హై-ఫ్రీక్వెన్సీ సౌండ్స్ పదునుగా ఉంటూనే.. చెవులకు ఇబ్బంది పెట్టకుండా ..బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి. ఇక బేస్ విషయానికి వస్తే, ప్రత్యేకంగా.. సబ్ వూఫర్ లేక పోయినా గదిని నింపేంత పంచీ, టైట్ బేస్ లభిస్తుంది.మ్యూజిక్ వింటున్నప్పుడు ప్రతి ఇన్‌స్ట్రుమెంట్ విడి విడిగా వినిపించడం వీటి ప్రత్యేకత.
కనెక్టివిటీ, వాడకం:
నేటి తరం యూజర్లకు అవసరమైన అన్ని కనెక్టివిటీ.. ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. టీవీకి కనెక్ట్ చేసుకోవడానికి.. బెస్ట్ వైర్డ్ ఆప్షన్లతో పాటు, మొబైల్ లేదా ల్యాప్‌టాప్ నుంచి నేరుగా పాటలు ప్లే చేయడానికి వైర్ లెస్ బ్లూ టూత్ సపోర్ట్ కూడా చక్కగా పని చేస్తుంది. సెటప్ చేయడం కూడా చాలా సింపుల్, బాక్స్ నుంచి తీసిన కొన్ని నిమిషాల్లోనే కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. రిమోట్ కంట్రోల్ ద్వారా వాల్యూమ్, సౌండ్ మోడ్‌లను కూర్చున్న చోట.. నుంచే మార్చుకోవచ్చు.
Also Read:బ్లూటూత్ స్పీకర్ కొనబోతున్నారా? పోర్టబుల్ Vs పార్టీ స్పీకర్ మధ్య అసలు తేడా ఇదే!
ఎవరికి బెస్ట్ :
మీరు కేవలం సినిమాలు మాత్రమే కాకుండా.. రోజూ హై-క్వాలిటీ మ్యూజిక్ వినడానికి ఇష్ట పడేవారైతే.. సౌండ్ బార్ కంటే ఈ మోడల్ బెస్ట్. అయితే.. మీకు కేవలం అతి భారీ బేస్ మాత్రమే కావాలి, టీవీ కింద ఒకే సింగిల్ బార్ ఉంటే చాలు అనుకుంటేనే ఇది బెస్ట్.
రూ.22,999 బడ్జెట్‌లో క్లీన్ ఆడియో, నిజమైన స్టీరియో ఫీల్, ప్రీమియం లుక్ కోరుకునే వారికి ఇది ఒక అద్భుతమైన డీల్. సౌండ్‌బార్‌ను స్కిప్ చేసి ఈ స్పీకర్లను ఎంచుకుంటే.. మీ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ డబుల్.