E-Paper
Advertisement

రికార్డుల్లో కనిపించని ఎయిర్ ఇండియా విమానం.. 10 ఏళ్ల తర్వాత ఎక్కడ బయటపడిందో తెలుసా?

రికార్డుల్లో కనిపించని ఎయిర్ ఇండియా విమానం.. 10 ఏళ్ల తర్వాత ఎక్కడ బయటపడిందో తెలుసా?
Advertisement

The Lost Air India Aircraft: ఎయిర్ ఇండియాకు చెందిన ఓ బోయింగ్ విమానం పదేళ్లకు పైగా మాయమైపోయింది. ఇంకా విచిత్రం ఏమిటంటే.. ఒకానొక సమయంలో ఆ విమానం ఎక్కడ ఉందో కూడా ఎయిర్ ఇండియా రికార్డుల్లో కనిపించలేదు. ఇప్పుడు అదే విమానానికి కొత్త పేరు పెట్టి, మరో కీలక బాధ్యత అప్పగించారు. అసలు ఈ విమానం కథేంటి? ఇప్పుడు ఎక్కడ ఉందంటే..

10 ఏళ్లుగా కోల్‌కతా విమానాశ్రయంలోనే..

ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 737-200 విమానాన్ని ‘బేబీ బోయింగ్’గా పిలుస్తుంటారు. 1982లో ఈ విమానాన్ని తొలుత ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ కు అందించారు. ఆ తర్వాత 1998లో అలయన్స్ ఎయిర్‌కు లీజుకు ఇచ్చారు. సంస్థల విలీనం తర్వాత 2007లో ఎయిర్ ఇండియా ఆధీనంలోకి వచ్చింది. కొన్నేళ్లుగా ఈ విమానం కోల్‌కతా విమానాశ్రయంలోనే ఉండిపోయింది. దశాబ్దానికి పైగా ఎలాంటి కార్యకలాపాలు లేకుండా అక్కడే నిలిపి ఉంది. 2022లో టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన తర్వాత కూడా ఈ విమానం విషయం వెలుగులోకి రాలేదు.

చివరకు బెంగళూరుకు..

Advertisement

2025 నవంబర్‌ లో ఎయిర్ ఇండియా అప్పటి సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ ఉద్యోగులతో మాట్లాడిన సందర్భంగా.. ఈ విమానం విషయం బయటపడింది. మేనేజ్మెంట్ మార్పుల సమయంలో విమానం వివరాలు సంస్థ రికార్డుల్లో రికార్డు  కాలేదని, దాని ఆచూకీ తెలియదని ఆయన వెల్లడించారు. చివరకు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్ (BIAL) ఈ విమానాన్ని హ్యాండోవర్ చేసుకుంది. దానికి ‘ఫీనిక్స్’ (Phoenix) అని కొత్త పేరు పెట్టింది. నవంబర్ 18న బెంగళూరు విమానాశ్రయంలో దీనిని అధికారికంగా ఆవిష్కరించింది. కోల్‌కతా నుంచి బెంగళూరుకు తరలించడానికి సుమారు 45 రోజులు పట్టింది. విమానాన్ని విడదీసి నాలుగు ప్రత్యేక ట్రైలర్ల మీద తరలించిన తర్వాత బెంగళూరులో మళ్లీ ఫిక్స్ చేశారు.

ఇకపై విమానాలకు శిక్షణ కేంద్రంగా..

ఈ విమానాన్ని బెంగళూరు విమానాశ్రయంలోని ఎయిర్‌ క్రాఫ్ట్ రికవరీ ట్రైనింగ్ స్కూల్‌లో ఉపయోగించనున్నారు. విమానాలు రన్‌ వేపై, టాక్సీవేపై సాంకేతిక సమస్యలతో నిలిచిపోయినప్పుడు వాటిని సురక్షితంగా ఎలా తరలించాలో సిబ్బందికి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. విమానాలను పైకి లేపడం, లాగడం, దెబ్బతిన్న ల్యాండింగ్ గేర్‌ ను మెయింటెయిన్ చేయడం లాంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు కూడా అందిస్తారు. ఒకప్పుడు ప్రయాణికులను మోసిన ఈ ‘బేబీ బోయింగ్’ ఇప్పుడు విమానయాన రంగంలో మరో కీలక పాత్ర పోషించనుంది. పదేళ్లకు పైగా నిరుపయోగంగా ఉన్న విమానం చివరకు ట్రైనింగ్ సెంటర్ లో ఉపయోగపడటం విశేషం.

Advertisement

Read Also: వందే భారత్‌లో క్యాష్ బ్యాగ్ మరిచిపోయిన ఫారినర్.. రైల్వే సిబ్బంది ఏం చేశారంటే?

Tags

Related News

చలికాలంలో వెచ్చని వాతావరణం కావాలా?.. వింటర్ వెకేషన్‌కు ఈ 5 ప్రదేశాలు బెస్ట్

వందే భారత్‌లో క్యాష్ బ్యాగ్ మరిచిపోయిన ఫారినర్.. రైల్వే సిబ్బంది ఏం చేశారంటే?

రీల్స్ కోసం రైలు ఎక్కాడు.. కరెంట్ తగిలి కాలిపోయాడు!

వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఇక నాలుగు రకాల వంటకాలే.. ఎందుకంటే?

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి కొల్లంకు స్పెషల్ ట్రైన్!

అయోధ్య-జనక్‌పూర్ మధ్య నేరుగా రైలు.. మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా చేతుల మీదుగా ప్రారంభం!

ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఘటన.. కాళ్లపై పడి వేడుకున్నా కనికరించని అధికారులు.. వైరల్ వీడియో!

Big Stories

Advertisement
×