E-Paper
Advertisement

కొత్త ఫోన్ కొంటున్నారా? రూ. 20వేలలోపు పైసా వసూల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్స్!

కొత్త ఫోన్ కొంటున్నారా? రూ. 20వేలలోపు పైసా వసూల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్స్!
Advertisement

Best smartphones under 20000 in India: ఈ రోజుల్లో.. కొత్త స్మార్ట్‌ ఫోన్ కొనడం అంటే.. పెద్ద టాస్క్ అయిపోయింది. మార్కెట్‌లో వందల మోడల్స్ ఉండటంతో.. ఏది సెలెక్ట్ చేసుకోవాలో అస్సలు అర్థం కాదు. ముఖ్యంగా రూ. 20వేల బడ్జెట్ అనేది మిడ్-రేంజ్ మార్కెట్‌లో అత్యంత పాపులర్. ఈ రేంజ్‌లో క్రిస్టల్ క్లియర్ డిస్‌ప్లే, రోజంతా వచ్చే బ్యాటరీ బ్యాకప్, ల్యాగ్ లేని పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్లు చాలా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో దుమ్మురేపుతున్న 10 బెస్ట్ ఆప్షన్స్ మీకోసం మోసుకొచ్చాం. వీటిపై ఓ లుక్కేసి మీ స్మార్ట్ ఛాయిస్ సెలెక్ట్ చేసుకోండి.

రూ.20వేలలోపు దొరికే టాప్ 10 స్మార్ట్‌ఫోన్లు:

వన్ ప్లస్ నార్డ్, క్లీన్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్:
ఈ బడ్జెట్‌లో మన లిస్ట్‌లో మొదటిగా చెప్పుకోవాల్సింది వన్ ప్లస్ నార్డ్ సిరీస్ (OnePlus Nord CE) లేటెస్ట్ మోడల్స్. వన్‌ప్లస్ అనగానే గుర్తొచ్చే స్మూత్ ఆక్సిజన్ ఓఎస్ ఎక్స్‌పీరియన్స్ ఈ ఫోన్లలో లభిస్తుంది. దీని లోని అమోలెడ్ డిస్‌ప్లే, క్విక్ ఛార్జింగ్ ఫీచర్ యూజర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం బ్రాండ్ వాడుతున్న ఫీలింగ్‌ను ఇది ఇస్తుంది.

Advertisement

శామ్‌సంగ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీ పవర్:
దీని తర్వాత శామ్‌సంగ్ గెలాక్సీ ఎం, ఏ సిరీస్ (Samsung Galaxy M/A series) మొబైల్స్ గట్టి పోటీ ఇస్తున్నాయి. శామ్‌సంగ్ బ్రాండ్ వాల్యూతో పాటు సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, ఏకంగా 6000mAh వరకు వచ్చే భారీ బ్యాటరీ ఈ ఫోన్ల సొంతం. ఆన్‌లైన్ క్లాసులు వినే విద్యార్థులకు.. రోజంతా ఎక్కువ సేపు వీడియోలు చూసే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

ఐకూ, పోకో ఫోన్లతో పవర్‌ఫుల్ గేమింగ్ పర్ఫార్మెన్స్:
ఇక పర్ఫార్మెన్స్, హెవీ గేమింగ్ విషయానికి వస్తే ఐకూ (iQOO Z series), పోకో (Poco X series) ఫోన్లు మార్కెట్‌ను రూల్ చేస్తున్నాయి. రూ.20వేలలోపే పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ లేదా స్నాప్‌డ్రాగన్ లేటెస్ట్ ప్రాసెసర్లను ఇవి అందిస్తున్నాయి. హెవీ గేమింగ్ ఆడినా, ఎక్కువ యాప్స్ వాడినా ఫోన్ అస్సలు ల్యాగ్ అవ్వదు. వీటితో పాటు 120Hz రీఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లే స్క్రీన్ మూవ్‌మెంట్‌ను చాలా స్మూత్‌గా మారుస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటంతో నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది.

Advertisement

మోటోరోలా స్టైలిష్ డిజైన్, కర్వ్డ్ స్క్రీన్:
డిజైన్ , లుక్స్ పరంగా ఇండస్ట్రీలో క్రేజ్ తెచ్చుకున్న బ్రాండ్ మోటోరోలా (Motorola Edge/G series). ఈ బడ్జెట్‌లో మోటోరోలా కర్వ్డ్ డిస్‌ప్లే, ప్రీమియం వెగన్ లెదర్ ఫినిష్‌తో ఫోన్లను లాంచ్ చేస్తోంది. అంతే కాకుండా ఇందులో లభించే క్లీన్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ వల్ల ఎలాంటి అల్తుపల్తు యాప్స్ ఉండవు. ఫోన్లలో నోటిఫికేషన్లు, ప్రకటనల గోల అస్సలు నచ్చని వారికి మోటోరోలా ఒక వరం లాంటిది. కెమెరా, డిస్‌ప్లే రెండూ బ్యాలెన్స్‌డ్‌గా ఉండేలా మోటోరోలా ఈ ఫోన్లను డిజైన్ చేసింది.

Also Read: ఏంటీ.. స్మార్ట్‌ఫోన్లకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? అసలు విషయం తెలిస్తే నోరెళ్లబెడతారు

రియల్‌మీ, షావోమిల సూపర్ కెమెరా అప్‌డేట్స్:
మరోవైపు రియల్‌మీ( Realme Number series), షావోమి రెడ్‌మి (Redmi Note series) బ్రాండ్లు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో ట్రెండ్‌లో ఉంటున్నాయి. ఈ బ్రాండ్ల ఫోన్లలో 108 మెగాపిక్సెల్ వరకు మెయిన్ కెమెరాలు, అత్యంత బ్రైట్‌గా ఉండే అమోలెడ్ డిస్‌ప్లేలు లభిస్తున్నాయి. ఎండలో బయటకెళ్లి చూసినా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి లేటెస్ట్ ఫీచర్లు కూడా ఈ బడ్జెట్ లోనే దొరుకుతున్నాయి.

ఒప్పో, వివోల స్టైలిష్ సెల్ఫీ మొబైల్స్:
చివరిగా ఒప్పో (Oppo K series), వివో (Vivo T series) మొబైల్స్ కూడా స్టైలిష్ డిజైన్, మంచి సెల్ఫీ కెమెరాలతో ఈ బడ్జెట్‌లో గట్టి పోటీ ఇస్తున్నాయి. ఈ బ్రాండ్ల ఫోన్లకు కనీసం 3 నుండి 4 సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ , సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తున్నాయి.

మీరు రూ. 20 వేల లోపు ఫోన్ కొనేటప్పుడు మీ మొదటి ప్రాధాన్యత గేమింగా, కెమెరానా లేక బ్యాటరీనా అనేది చూసుకుని, పైన చెప్పిన టాప్ బ్రాండ్ల నుంచి మీకు నచ్చిన మోడల్‌ను హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు.

Related News

మ్యూజిక్ లవర్స్‌కు వీఐ బంపరాఫర్.. ఫ్రీగా ‘Spotify ప్రీమియం’.. కొత్త ప్లాన్స్ ఇవే!

రూ.599కే వన్‌ప్లస్ హెడ్‌ఫోన్స్.. ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు, Independence Day Sale ఆఫర్లు ఇవే!

డిజైన్ పిచ్చెక్కిస్తోంది బాబోయ్.. ఐకూ లవర్స్‌కి ఇది కదా కావాల్సింది!

యాపిల్ నుంచి మరో సంచలనం.. ఈసారి ఎయిర్‌పాడ్స్‌లోనే కెమెరాలు!

రూపాయి ఖర్చు లేకుండా.. ఇంట్లోనే ల్యాప్‌టాప్ స్పీడ్‌ని డబుల్ చేయండిలా!

8,000mAh బ్యాటరీనా.. అమోలెడ్ స్క్రీనా? ఈ 3 కొత్త 5G ఫోన్లలో ఏది కొనుగోలు చేయడం ఉత్తమం?

మళ్లీ వివాదంలో టెలిగ్రామ్.. ఈసారి యాపిల్ స్టోర్ నుంచి అవుట్.. అసలేం జరుగుతోంది!

వాట్సప్‌లో ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు.. ఫోన్ స్టోరేజ్ సమస్యకు శాశ్వతంగా చెక్!

Big Stories

Advertisement
×