E-Paper
Advertisement

మెగాలోమేనియా, డెల్యూషనల్‌ డిజార్డర్‌! అమిత శక్తిమంతులమనే ఊహా.. తానే గొప్ప అనే భ్రాంతి! ఇదేనా బీఆరెస్‌ మానసిక స్థితి?

మెగాలోమేనియా, డెల్యూషనల్‌ డిజార్డర్‌! అమిత శక్తిమంతులమనే ఊహా.. తానే గొప్ప అనే భ్రాంతి! ఇదేనా బీఆరెస్‌ మానసిక స్థితి?
Advertisement

కేసీఆర్‌ జనం మీద అలిగారనే విషయం అందరికీ అర్థం అయిపోయింది. తనకు తాను తెలంగాణ జాతిపిత అని పరోక్షంగా ప్రకటించుకుని తన వారి నోటి వెంట ఆ మాటను సమాజంలో విస్తృతం చేయాలనుకున్నారు. అలాంటి కేసీఆర్‌కు ఓటమా? తనను జనం నమ్మలేదా?  కాంగ్రెస్‌ హామీలకు మోసపోయి.. తనను ఓడిస్తారా? అనేదే ఆయన జీర్ణించుకోలేని అంశం.

ఎన్నికల ప్రచార సభలో కూడా ఆయన పదే పదే చెబుతూ వచ్చారు. ‘నేను ఓడితే నాకు జరిగే నష్టమేమీ లేదు.. మీరే నష్టపోతారు. నేను హాయిగా రెస్ట్ తీసుకుంటాను’ అని చివరి అస్త్రాన్ని కూడా ప్రయోగించినా… జనం వినలేదు. ప్రతికూల ఫలితాలనే ఇచ్చారు. దీంతో ఆయన ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యారు. కేటీఆర్‌కు పార్టీ పగ్గాలప్పగించారు.

Advertisement

కేటీఆర్ కూడా తండ్రి కన్నా తక్కువేం తినలేదు. జనం మీద, జనం ఇచ్చిన తీర్పుపైనా రగిలిపోతూనే ఉన్నారు. ‘కత్తి వారికిచ్చి.. మమ్మల్ని యుద్దం చేయమంటే ఎలా? అని జనాన్ని దెప్పిపొడిచే విధంగా ఉంటున్న వారి కామెంట్స్‌ వింటేనే అర్థమైపోతుంది.. అధికారం లేక వారెంతగా రగిలిపోతున్నారో.

అంతే కాదు, ‘మేమే వస్తున్నాం..వచ్చేస్తున్నాం.. మనదే రాజ్యం..’ అనే విధంగా కేటీఆర్‌ కామెంట్స్‌ ఉంటున్నాయి. ఇది చాలదంటూ అప్పుడే ఆ పార్టీలో మంత్రి పదవులు ఎవరెవరికీ? అనే చర్చ.. వీటి కోసం పోటీలు.. కేటీఆర్‌ నజర్‌లో పడేందుకు నేతల తంటాలు, పోటాపోటీ ప్రెస్‌మీట్లు.. ఇవన్నీ జరుగుతున్నాయి యమ స్పీడుగా. తాజాగా ఇవాళ కేసీఆర్‌ మానస పుత్రిక నమస్తే తెలంగాణలో ఓ కథనాన్ని వండి వార్చరు. బ్యూరోక్రాట్లు అసలు సర్కార్‌ మాట వినడమే లేదట. కీలకమైన ఫైళ్లను తిప్పికొడుతున్నారట.

Advertisement

‘వచ్చేది బీఆర్ఎస్‌ సర్కారే కాబట్టి.. ఇక కాంగ్రెస్‌ సర్కార్‌ ఏది చెబితే అది ఎందుకు చేయాలి..?’ అని మొండికేసి, తెగేసి చెప్పేస్తున్నారట. అంటే ఈ రకమైన ప్రచారాల ద్వారా జనాల్లో కూడా ప్రభుత్వంపై విశ్వాసం పోయేలా చేయడం కోసం చేస్తున్న గోబెల్స్ ప్రచారంగా దీన్ని చూస్తున్నారు. మొత్తంగా బీఆర్‌ఎస్‌ ప్రవర్తిస్తున్న వ్యవహారతీరు, మానసిక స్థితిని చూస్తే.. వైద్య పరిభాషలో దీన్ని ‘మెగాలోమేనియా’ అని పిలుస్తారని చెబుతున్నారు.

ఎన్నికలకు మరో రెండేండ్ల సమయం ఉన్నా.. ఇప్పుటి నుంచే కేటీఆర్‌ నమ్ముకున్న గోబెల్స్‌ ప్రచార సిద్దాంతాన్ని ఇలా అంచలంచెలుగా, నిర్విరామంగా అమలు చేస్తున్నాడని అంటున్నారు. అధికారంలోకి రాబోతున్నామని విపరీతంగా ఊహించుకోవడంతో పాటు, భ్రమల్లో బ్రతకడం ‘మెగాలోమేనియా’ లక్షణాలుగా చెబుతున్నారు. ఈ మానసిక రుగ్మత ఉన్నవారు.. తనను తాను శక్తివంతంగా ఊహించుకుంటారన్నమాట. అచ్చంగా ఇలాగే చేస్తున్నారు అటు కేసీఆర్‌… ఇటు కేటీఆర్‌.

ఓడించి తప్పు చేశారు కాబట్టి.. చెంపలేసుకుని, బుద్ది తెచ్చుకుని, మొత్తం నష్టపోయి.. తీవ్ర బాధలు అనుభవించి.. చివరకు మీరే మాకు దిక్కు మహాప్రభో అని తమ కాళ్లు పట్టుకోవాలనేది వాళ్లలో ఉన్న ఈ మేనియా లక్షణంగా చెప్పుకోవచ్చు. మూడేండ్లుగా వారి ప్రవర్తన చూస్తే అచ్చం అలాగే కనిపిస్తుంది కూడా.

ఇక గోబెల్స్‌ ప్రచారానికి విపరీతమైన ప్రయార్టీ ఇస్తున్నట్టుగా కనిపిస్తున్నది బీఆరెస్‌ పార్టీ. కేటీఆర్‌ తన చెప్పుచేతల్లో ఉన్న సోషల్‌ మీడియా టీమ్‌ను ఈ ప్రచారానికి బాగానే వాడుకుంటున్నట్టుగా కనిపిస్తున్నది. డెల్యూషన్‌ డిజార్డర్ అనే మానసిక స్థితిని బట్టి .. వాస్తవ పరిస్థితులతో సంబంధం లేకుండా తామే గెలుస్తున్నామనే ఒక కల్పిత భ్రమను బలంగా నమ్ముకోవడం, ఆ ఊహా లోకంలోనే విహరించడం దీని లక్షణం.

కేటీఆర్‌ చేస్తుంది కూడా ఇలాంటి చర్యలేనంటున్నారు. నమస్తేలో వచ్చిన కథనం ఉద్దేశ్యం.. పరిపాలనా వ్యవస్థను స్తంభింపజేయాలనే వ్యూహముందని తెలిసిపోతున్నది. ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందిందనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలనే సైకలాజికల్‌ వార్‌ఫేర్‌, మైండ్‌గేమ్‌లో భాగంగానే దీన్ని చూస్తున్నారు.

ఎన్నికలకు రెండేండ్ల ముందే బీఆరెస్‌ ఈ విధమైన కథనాలను రాటు దేల్చుతున్నది. వండివార్చే కథనాలను  తన సోషల్‌ మీడియా టీమ్‌ ద్వారా దీనికి గోబెల్స్‌ ప్రచారాన్ని కల్పించేందుకు యమ స్పీడుగా పనిచేస్తున్నది.

Tags

Related News

ఖైరతాబాద్ ఉపఎన్నిక సస్పెన్స్.. దానం నాగేందర్ వర్సెస్ పి. విజయారెడ్డి న్యాయపోరాటంలో గెలుపెవరిది?

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కమలం గట్టి ఫోకస్.. కారణం బీజేపీ అసలు ప్లాన్ ఇదే?

ఉమ్మడి మెదక్ జిల్లా పదవుల్లో.. పక్క జిల్లా ఎమ్మెల్యే పైరవీలు..?

తమిళనాడుకు షాక్.. ఏపీకి జాక్‌పాట్.. రూ. 1614 కోట్ల కొరియన్ పెట్టుబడుల వెనుక అసలు కథ!

సీఎం విజయ్ కొత్త బిల్డింగ్ చూస్తే మైండ్ బ్లాకే.. అసలు ఆ లోపల ఏం జరుగుతోంది?

నాడు వై నాట్ కుప్పం.. నేడు ఫినిష్ పులివెందుల! ఏపీలో పీక్‌కి చేరిన ఈగో వార్!

ఏమిటీ మురసు తుఫాన్? పేరు వెనుక కథేంటి? ఏయే జిల్లాలపై తీవ్ర ప్రభావం?

Big Stories

Advertisement
×