E-Paper

ఏంటీ.. స్మార్ట్‌ఫోన్లకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? అసలు విషయం తెలిస్తే నోరెళ్లబెడతారు

ఏంటీ.. స్మార్ట్‌ఫోన్లకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? అసలు విషయం తెలిస్తే నోరెళ్లబెడతారు
Advertisement

Android phone expiry date checker: మనం వాడే వస్తువులు, తినే ఆహార పదార్థాలే కాదు… చేతిలో 24 గంటలూ ఉండే స్మార్ట్‌ఫోన్‌కు కూడా ఒక ‘ఎక్స్‌పైరీ డేట్’ ఉంటుంది. ఫోన్ స్క్రీన్, బ్యాటరీ బయటికి సూపర్బ్‌గా ఉన్నా, లోపల కంపెనీ ఇచ్చే సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఆగిపోతే అది ఎక్స్‌పైర్ అయిపోయినట్లే లెక్క. కంపెనీలు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇవ్వడం ఆపేసిన రోజునే టెక్ భాషలో ‘ఎండ్ ఆఫ్ లైఫ్'(EOL)అంటారు. దీని వల్ల మీ పర్సనల్ డేటా, బ్యాంకింగ్ అకౌంట్లు హ్యాకర్ల చేతికి చిక్కే ఛాన్స్ ఉంది. ఇంతకీ మీరు వాడే ఫోన్ సేఫేనా? దాని ఎక్స్‌పైరీ డేట్ ఎలా తెలుసుకోవాలో ఇప్పుడే చూద్దాం.

ఆండ్రాయిడ్ ఫోన్ల ఎక్స్‌పైరీ డేట్ :

Advertisement

మనం కొత్త ఫోన్ కొనగానే.. అది ఎన్ని సంవత్సరాలు పని చేస్తుందో అని ఆలోచిస్తాం. స్క్రీన్ పగలకుండా, బ్యాటరీ బాగా వస్తే చాలనుకుంటాం. కానీ.. అసలైన ట్విస్ట్ సాఫ్ట్‌వేర్‌లో ఉంది. ఐఫోన్‌లా కాకుండా, ఆండ్రాయిడ్‌లో గూగుల్ ఓఎస్ (OS) ఇచ్చినప్పటికీ… ఏ ఫోన్‌కు ఎన్ని రోజులు అప్‌డేట్స్ ఇవ్వాలనేది శామ్‌సంగ్, షావోమి, వన్‌ప్లస్ వంటి ఆయా కంపెనీలే డిసైడ్ చేస్తాయి.

మొబైల్స్‌లో ముఖ్యంగా రెండు రకాల అప్‌డేట్స్ ఉంటాయి. మొదటివి ఆండ్రాయిడ్ వర్షన్ అప్‌డేట్స్. ఇవి ఫోన్‌కు కొత్త ఫీచర్లు, సరి కొత్త డిజైన్‌ను తెస్తాయి. ఇవి ఆగిపోతే కొన్నాళ్ల తర్వాత కొత్త యాప్స్ మీ ఫోన్ ఓఎస్‌కు సపోర్ట్ చేయవు. ఇక రెండోవి సెక్యూరిటీ అప్‌డేట్స్. ఇవి చాలా అంటే చాలా ముఖ్యం. ఫోన్‌లోకి హ్యాకర్లు రాకుండా, వైరస్‌లు అటాక్ చేయకుండా ఇవి రక్షణలా కాపాడుతాయి. ఇవి ఆగిపోతే మీ ఫోన్ ఓపెన్ సెక్యూరిటీ రిస్క్‌గా మారిపోతుంది.

Advertisement

గతంలో ఆండ్రాయిడ్ ఫోన్లకు ఏడాది లేదా రెండేళ్లు మాత్రమే అప్‌డేట్స్ ఇచ్చేవారు. కానీ యూరోపియన్ యూనియన్ (EU) తెచ్చిన ‘ఎకోడిజైన్’ (ESPR) కొత్త నిబంధనల ప్రకారం.. జూన్ తర్వాత మార్కెట్లోకి వచ్చే ప్రతి కొత్త ఫోన్‌కు కనీసం 5 ఏళ్ల పాటు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఇవ్వడం కంపెనీలకు తప్పనిసరి అయింది.

ప్రస్తుతం గూగుల్ తన పిక్సెల్ 6 , ఆపై మోడల్స్, అలాగే శామ్‌సంగ్ తన గెలాక్సీ ఎస్24, ఎస్26 ,జెడ్ సిరీస్ ఫ్లాగ్‌షిప్స్ వంటి ప్రీమియం ఫోన్లకు ఏకంగా ఏడేళ్ల పాటు ఆండ్రాయిడ్, సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తున్నాయి. వన్‌ప్లస్, షావోమి బ్రాండ్లు తమ ప్రీమియం మోడల్స్‌కు 4 ఏళ్ల ఆండ్రాయిడ్ , 5 ఏళ్ల సెక్యూరిటీ సపోర్ట్ అందిస్తుండగా, ఒప్పో , రియల్‌మీ జూన్ 2025 తర్వాత వచ్చే ఫోన్లకు 6 ఏళ్ల సెక్యూరిటీ సపోర్ట్ ఇస్తున్నాయి. మోటోరోలా ఎడ్జ్ సిరీస్ ఫోన్లకు సాధారణంగా 3 ఏళ్ల ఓఎస్, 4 ఏళ్ల సెక్యూరిటీ సపోర్ట్ దొరుకుతోంది. అయితే పాత మోడల్స్, బడ్జెట్ ఫోన్లకు ఈ సపోర్ట్ పీరియడ్ చాలా తక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి.

ఎక్స్‌పైర్ టేం తెలుసుకోవడం ఎలా ?

మీరు వాడుతున్న ఫోన్ ఎప్పుడు ఎక్స్‌పైర్ అవుతుందో తెలుసుకోవడానికి రెండు సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి. మొదటగా మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘About Phone’ లో మీ ఫోన్ ఖచ్చితమైన మోడల్ పేరు చూసుకోండి. ఇప్పుడు బ్రౌజర్‌లో endoflife.date అనే సైట్‌ ఓపెన్ చేసి, అందులో మీ ఫోన్ బ్రాండ్ సెలెక్ట్ చేస్తే.. అక్కడ వచ్చే లిస్టులో మీ ఫోన్ మోడల్ పక్కన ఏ తేదీతో సెక్యూరిటీ అప్‌డేట్స్ ముగిసిపోతాయో స్పష్టంగా కనిపిస్తుంది.

Also Read: బడ్జెట్ ధరలో.. ఒప్పో నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. త్వరలోనే ఇండియాలో లాంచ్!

మరో పద్ధతి ఏంటంటే.. నేరుగా గూగుల్‌లో మీ మొబైల్ మోడల్ పేరు టైప్ చేసి, పక్కన “end of software support” అని సెర్చ్ చేస్తే కంపెనీ అఫీషియల్ డేట్స్ దొరుకుతాయి. లేదా ఫోన్ సెట్టింగ్స్ లోని సెక్యూరిటీ ప్యాచ్ లెవల్ చెక్ చేయండి. ఒకవేళ ఆ డేట్ 3 నుంచి 6 నెలల క్రితంది చూపిస్తుంటే, మీ ఫోన్‌కు ఆల్మోస్ట్ సపోర్ట్ ఆగిపోయిందని అర్థం.

అప్‌డేట్స్ ఆగిపోయిన ఫోన్ వెంటనే పాడైపోదు, కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్లకు కాస్త దూరంగా ఉంచడం మంచిది. అప్‌డేట్స్ లేని ఫోన్లలో ఆన్‌లైన్ బ్యాంకింగ్, షాపింగ్, యూపీఐ పేమెంట్స్ చేయడం అస్సలు సేఫ్ కాదు. మీ పాస్‌వర్డ్‌లు హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాంటి ఫోన్లను కేవలం యూట్యూబ్ వీడియోలు చూడటానికి, పాటలు వినడానికి, కార్లలో రూట్ మ్యాప్స్ కోసం లేదా పిల్లల ఆన్‌లైన్ క్లాసుల కోసం వాడుకోవచ్చు. ఇందులో ఎలాంటి పర్సనల్ లేదా క్రెడెన్షియల్ డేటా ఉంచకండి. ఇకపై కొత్త ఫోన్ కొనేటప్పుడు కేవలం కెమెరా, ర్యామ్ మాత్రమే కాదు.. ఆ కంపెనీ ఎన్ని ఏళ్లు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇస్తుందో చూసి కొనడమే స్మార్ట్ డెసిషన్.

Related News

బడ్జెట్ ధరలో.. ఒప్పో నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. త్వరలోనే ఇండియాలో లాంచ్!

రూ.29,999 లాంచ్ ఆఫర్ ధరకే షావోమి ప్రీమియం టీవీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

రూ.2 వేలలోపు ‘బోట్’మ్యాజిక్.. రూ.4 వేల బడ్జెట్‌లో ‘వన్‌ప్లస్’ అరాచకం.. ఏది బెస్ట్?

రూ.1500 లోపు స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్నారా? అయితే Noise ColorFit Pulse Grand పై ఓ లుక్కేయండి!

ఇయర్ బడ్స్ ఉన్నాయా? అయితే మీరే సూపర్ హ్యూమన్.. ఎవరికీ తెలియని 6 సీక్రెట్స్!

టెలిగ్రామ్‌పై కేంద్రం బ్యాన్.. ప్రత్యామ్నాయ 5 యాప్స్ ఇవే.. సేఫ్ అండ్ సూపర్!

డెజర్ట్, పర్సనల్, టవర్, విండో కూలర్లలో.. మీ ఇంటికి ఏది బెస్ట్?

Big Stories

×