E-Paper
Advertisement

అమ్మాయిల కోసం.. టాప్ 5 స్టైలిష్ నాయిస్ స్మార్ట్‌వాచెస్

అమ్మాయిల కోసం.. టాప్ 5 స్టైలిష్ నాయిస్ స్మార్ట్‌వాచెస్
Advertisement

Best noise watches for girls: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌వాచ్ అనేది కేవలం టైమ్ చూసే గడియారం మాత్రమే కాదు. అదొక సూపర్ ట్రెండీ ఫ్యాషన్ స్టేట్‌మెంట్. ముఖ్యంగా కాలేజ్ గర్ల్స్, వర్కింగ్ ఉమెన్ తమ లుక్‌ని మరింత ఎలిగెంట్‌గా మార్చుకోవడానికి స్మార్ట్‌వాచ్‌లను తెగ ఇష్టపడుతున్నారు. ఇండియన్ మార్కెట్లో బడ్జెట్ ధరలో.. ప్రీమియం ఫీచర్లు అందించే బ్రాండ్లలో ‘నాయిస్’ ఎప్పుడూ ముందే ఉంటుంది. అమ్మాయిల చేతికి మరింత రాయల్ లుక్ తీసుకొచ్చే టాప్ 5.. నాయిస్ స్మార్ట్‌వాచెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టాప్ 5 మోస్ట్ ఎలిగెంట్ నాయిస్ వాచెస్:

అమ్మాయిల మనసు దోచేలా.. వారి డ్రెస్సింగ్ స్టైల్‌కి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యే టాప్ 5 నాయిస్ వాచెస్ లిస్ట్, వాటి ప్రత్యేకతలు మీకోసం..

Advertisement

1. NoiseFit Diva 2:
రాయల్ , లగ్జరీ లుక్ కోరుకునే అమ్మాయిల ఫస్ట్ ఛాయిస్ ఇదే. ఇది ప్రత్యేకంగా మహిళల కోసమే డిజైన్ చేయబడింది. మెటాలిక్ రోజ్ గోల్డ్, ప్రీమియం చైన్ లింక్ స్ట్రాప్స్‌తో వస్తుంది. దీనిలోని 1.1 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే కళ్ళకు చాలా ప్రైట్‌గా, కలర్‌ఫుల్‌గా అనిపిస్తుంది. బ్లూటూత్ కాలింగ్, పీరియడ్ ట్రాకర్, వందకు పైగా వాచ్ ఫేసెస్. ట్రెండీ శారీస్ లేదా మోడ్రన్ డ్రెస్సెస్ దేని మీదకైనా ఇది అద్భుతంగా సెట్ అవుతుంది.

2. NoiseFit Diva Araya:
డైమండ్ కట్ బెజెల్స్‌తో.. జ్యువెలరీ తరహా లుక్ ఇచ్చే సరికొత్త స్మార్ట్‌వాచ్ ఇది. ఫ్రాస్ట్ సిల్వర్ సిరామిక్, ఐకానిక్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్‌తో వస్తుంది. 850 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగిన అమోలెడ్ స్క్రీన్. ఎండలో కూడా డిస్‌ప్లే స్పష్టంగా కనిపిస్తుంది. హార్ట్ రేట్ మానిటర్, SpO2, కస్టమైజ్డ్ ఉమెన్ హెల్త్ ట్రాకింగ్. పార్టీలు, పెళ్లిళ్లకు వెళ్లేటప్పుడు ఇది ఒక బ్రాస్‌లెట్‌లా మెరిసిపోతుంది.

Advertisement

3. Noise ColorFit Bello 2:
స్లిమ్, లైట్ వెయిట్, క్యూట్ లుక్ ఇష్టపడే కాలేజ్ గర్ల్స్‌కి ఇది బెస్ట్ ఆప్షన్. సాఫ్ట్ పాస్టల్ కలర్స్, స్లిమ్ రెక్టాంగ్యులర్ డయల్ దీని సొంతం.
మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్స్, స్లీప్ ట్రాకింగ్, క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేసెస్. ఇది మీ క్యాజువల్ జీన్స్ అండ్ టాప్స్‌కి క్లాసిక్ ఎలిగెన్స్ జోడిస్తుంది.

4. NoiseFit Twist Go:
రౌండ్ డయల్ ఇష్టపడే అమ్మాయిల కోసం తక్కువ బడ్జెట్‌లో దొరికే మోస్ట్ ఎలిగెంట్ వాచ్ ఇది. రోజ్ పింక్, మెటాలిక్ షేడ్స్‌తో వచ్చే మెటల్ బిల్డ్ బాడీ ఉంటుంది. 1.39 ఇంచుల హెచ్‌డీ రౌండ్ డిస్‌ప్లే కూడా ఉంటుంది. హ్యాండ్స్-ఫ్రీ బ్లూటూత్ కాలింగ్, వాయిస్ అసిస్టెంట్, ఇన్-బిల్ట్ అలారమ్స్ ఉండే ఈ వాచ్ లు ఆఫీస్ వేర్‌కి పర్ఫెక్ట్ సూట్ అవుతాయి.

5. Noise ColorFit Pro 5:
ఎలిగెన్స్‌తో పాటు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కూడా కావాలనుకునే మోడ్రన్ ఉమెన్ కోసం ఈ వాచ్ సరిపోతుంది. దీని
డిజైన్ స్టైలిష్ స్క్వేర్ డయల్, ఇంటర్‌ఛేంజబుల్ లెదర్ , సిలికాన్ స్ట్రాప్స్ తో ఉంటుంది. ఇందులో లైవ్ క్రికెట్ స్కోర్స్ చూసుకోవచ్చు. హార్ట్ రేట్, స్ట్రెస్ మానిటరింగ్ వంటి హెల్త్ సూట్ ఉంది. ప్రొఫెషనల్ లుక్ కోసం ఇది బెస్ట్ ఛాయిస్ అనే చెప్పాలి.

నాయిస్ బ్రాండ్ స్మార్ట్‌వాచ్‌లు కేవలం అందంగా ఉండటమే కాదు. అమ్మాయిల ఆరోగ్యాన్ని, ఫిట్‌నెస్‌ను ట్రాక్ చేయడంలోనూ ముందుంటాయి. మీ పర్సనల్ స్టైల్, బడ్జెట్‌ను బట్టి పైన పేర్కొన్న వాటిలో ఏదో ఒక వాచ్‌ని ఎంచుకుని మీ లుక్‌ని మరింత ట్రెండీగా మార్చేసుకోండి.

Related News

తక్కువ బడ్జెట్‌లో ఫ్యాన్ ప్లస్ లైట్.. అమెజాన్ సేల్‌లో అద్భుతమైన మోడల్స్

ఇది కదా అసలైన ఫోల్డబుల్ ఫోన్ అంటే.. శాంసంగ్‌ను మించిపోయేలా Xiaomi కొత్త ప్లాన్!

బాస్కెట్‌బాల్ లవర్స్‌ కోసం Pixel Watch 5.. కొత్త ఎడిషన్ గ్యాడ్జెట్ లవర్స్‌ను ఆకట్టుకుంటుందా?

పిల్లల ఆన్‌లైన్ క్లాసులకు బెస్ట్..రూ.18 వేలలోపు అదిరిపోయే లెనోవా స్మార్ట్ ట్యాబ్!

రూ.1,100లోపే అదిరిపోయే స్మార్ట్‌వాచ్ డీల్..వెంటనే కొనేయండి

ఇండియాలో.. పోవా ఏఐ బడ్స్ ప్రో లాంచ్ డేట్ ఫిక్స్! ఫీచర్స్ మాములుగా లేవుగా..

మధ్యతరగతి కుటుంబాలకు పర్ఫెక్ట్ టీవీ.. ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు!

జియో బిగ్ ఆఫర్.. కొత్తగా రూ.550, రూ.2000 ప్లాన్లు.. ఫ్రీగా 15 ఓటీటీలు, 1000+ ఛానెళ్లు!

Big Stories

Advertisement
×