E-Paper
Advertisement

మారుతి ఎర్టిగా కొనేవారికి షాక్.. అన్ని వేరియంట్ల ధరలు పెంపు!

మారుతి ఎర్టిగా కొనేవారికి షాక్.. అన్ని వేరియంట్ల ధరలు పెంపు!
Advertisement

Maruti Ertiga Price Hike: దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎంపీవీల్లో మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) ఒకటి. కుటుంబ అవసరాలకు అనుకూలంగా ఉండటంతో ఈ కారుకు మంచి డిమాండ్ ఉంది. అయితే, ఎర్టిగా కొనుగోలు చేయాలనుకునే వారికి మారుతి సుజుకి షాక్ ఇచ్చింది. తాజాగా ఈ MPV ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ధరల ప్రకారం అన్ని వేరియంట్లు మరింత కాస్ట్ లీగా మారాయి. ఈ ధరల పెంపు నవంబర్ 22 నుంచి అమలులోకి వచ్చింది.

ఎర్టిగా ధరలు ఎంత పెరిగాయంటే?

మారుతి సుజుకి ప్రకటించిన తాజా ధరల పెంపుతో ఎర్టిగా ధరలు గరిష్టంగా రూ.5,000 వరకు పెరిగాయి. అయితే, ఈ పెంపు అన్ని వేరియంట్లకు ఒకేలా లేదు. LXi పెట్రోల్ MT, ZXi పెట్రోల్ MT, ZXi+ పెట్రోల్ MT, ZXi CNG MT, ZXi పెట్రోల్ AT, ZXi+ పెట్రోల్ AT వేరియంట్ల ధరలను రూ.5,000 చొప్పున పెంచింది. మిగిలిన వేరియంట్లపై రూ.3,500 ధర పెంపు వర్తిస్తుంది. అంటే, ఎర్టిగా కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు గతంలో కంటే కొంత ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది.

కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?

Advertisement

తాజా ధరల పెంపు తర్వాత మారుతి ఎర్టిగా బేస్ వేరియంట్ LXi పెట్రోల్ MT ధర రూ.8.95 లక్షలకు చేరింది. టాప్ ఎండ్ వేరియంట్ ZXi+ పెట్రోల్ AT ధర రూ.13.19 లక్షలకు చేరుకుంది. ఎర్టిగాను LXi, VXi, ZXi, ZXi+ అనే నాలుగు ప్రధాన వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. కస్టమర్ల బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా వీటిలో సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది.

పెట్రోల్, CNG ఆప్షన్లలో అందుబాటులో..   

మారుతి ఎర్టిగాలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంది. దీనికి అదనంగా CNG ఆప్షన్ కూడా కంపెనీ అందిస్తోంది. ముఖ్యంగా ఎక్కువ దూరం ప్రయాణించే కుటుంబాలకు CNG వేరియంట్ ఉపయోగకరంగా ఉంటుంది.

Advertisement

ట్రాన్స్‌ మిషన్ విషయానికి వస్తే, 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. దీంతో, మాన్యువల్ డ్రైవింగ్ ఇష్టపడేవారితో పాటు ఆటోమేటిక్ కార్లను కోరుకునే కస్టమర్లకు కూడా ఎర్టిగా అందుబాటులో ఉంది.

ఇతర మారుతి కార్ల ధరలు కూడా పెంపు

మారుతి సుజుకి ఈసారి కేవలం ఎర్టిగాపైనే కాకుండా అరేనా, నెక్సా కు సంబంధించిన కొన్ని మోడళ్ల ధరలను కూడా పెంచింది. దీంతో కొత్త కారు కొనుగోలు చేయాలని చూస్తున్న కస్టమర్లు లేటెస్ట్ ధరలను చెక్ చేయడం మంచిది.

Read Also: నెక్సాన్ To అవినయ ఎక్స్.. టాటా నుంచి రాబోతున్న 5 క్రేజీ కార్లు!

Tags

Related News

నెక్సాన్ To అవినయ ఎక్స్.. టాటా నుంచి రాబోతున్న 5 క్రేజీ కార్లు!

హ్యుందాయ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఐయోనిక్ P లాంచింగ్ ఎప్పుడంటే?

లీటర్ పెట్రోల్‌ తో 71 కి.మీ ప్రయాణం.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 స్కూటర్లు ఇవే!

తక్కువ బరువు, మంచి రేంజ్‌.. అమ్మాయిల కోసం 6 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు!

మారుతి విక్టోరిస్ కొనేవారికి షాక్.. కొత్త ధరలు వచ్చేశాయ్!

ఎంజీ కామెట్ కొనేవారికి షాక్.. మరోసారి పెరిగిన ఎలక్ట్రిక్ కారు ధరలు!

తగ్గిన బరువు.. పెరిగిన రేంజ్.. అల్ట్రావయోలెట్ కొత్త బైక్ వచ్చేసింది!

Big Stories

Advertisement
×