Semi-Automatic Washing Machine: ఇంట్లో బట్టలు ఉతకడం అనేది.. ప్రతి రోజూ ఉండే కామన్ సమస్య. అయితే ఈ కష్టాన్ని ఈజీ చేయడానికి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వచ్చేస్తోంది! ఈ మెగా సేల్‌కు.. ముందే మార్కెట్లో సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లపై అదిరి పోయే ముందస్తు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ నీరు, తక్కువ కరెంట్ ఖర్చుతో.. ఎక్కువ కాలం పని చేసే బెస్ట్ టాప్-5 వాషింగ్ మెషీన్ల డీల్స్ , వాటి ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండియన్ కుటుంబాల్లో అత్యంత నమ్మకమైన బ్రాండ్లలో శామ్‌సంగ్ ఒకటి. దీని 7.0 కేజీ కెపాసిటీ మీడియం సైజ్ కుటుంబాలకు.. సరిగ్గా సరి పోతుంది. ఎయిర్ టర్బో డ్రై సిస్టమ్ ద్వారా బట్టలు త్వరగా ఆరిపోయేలా.. చేస్తుంది. 5-స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉండటం వల్ల కరెంట్ బిల్లు గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బిల్లు కూడా చాలా తక్కువగా వస్తుంది కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్లు కూడా దీన్ని కొనొచ్చు.
ధర: సుమారు రూ. 10,490 (సేల్ ఆఫర్లతో ఇంకా తగ్గే అవకాశం ఉంది).
పెద్ద కుటుంబాల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ వర్ల్‌పూల్ మోడల్, టర్బో స్క్రబ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇది బట్టలపై ఉన్న మొండి మరకలను కూడా ఈజీగా వదిలిస్తుంది. ఇంబిల్ట్ కాలర్ స్క్రాబర్ దీని ప్రత్యేకత. ఈ మోడల్ చూడటానికి చాలా ట్రెండీగా ,ఆకర్షణీయంగా ఉంటుంది.
ధర: సుమారు రూ. 11,290
నాణ్యత, క్వాలిటీ కోరుకునే వారికి ఎల్జీ బెస్ట్ ఛాయిస్. దీని ప్లాస్టిక్ బాడీ తుప్పు పట్టకుండా.. ఉండటానికి రస్ట్-ప్రూఫ్ డిజైన్‌తో వస్తుంది. రోటర్ పల్సేటర్ టెక్నాలజీ ద్వారా బట్టలు తిరిగేటప్పుడు మురికి ఈజీగా పోతుంది. చిన్న కుటుంబాలకు ఇది పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
ధర: సుమారు రూ.9,890
బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే వారికి గాడ్‍ప్రెజ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. దీనికి తక్కువ స్థలం సరిపోతుంది. దీనిలోని వాషింగ్ స్పిన్నింగ్ చాలా బాగుంటుంది. ఆటో-రీస్టార్ట్ ఫీచర్ కూడా దీనిలో అందుబాటులో ఉంది. కాబట్టి ఎక్కువ ఫీచర్లు కావాలనుకునే వారికి ఇది మంచి ఛాయిస్.
ధర: సుమారు రూ.8,790
Also Read: మిక్సర్ గ్రైడర్ కొనాలనుకుంటున్నారా? రూ.3వేలలోపు టాప్-5 బ్రాండ్స్ ఇవే!
పానాసోనిక్ టెక్నాలజీతో.. కూడిన ఈ మెషీన్ పవర్ ఫుల్ మోటార్‌ను కలిగి ఉంటుంది. మల్టీ-వాష్ ప్రోగ్రామ్స్ ద్వారా విభిన్న రకాల బట్టలను ఈజీగా.. ఉతకొచ్చు. ఇది సేల్ ముందస్తు ఆఫర్లలో మంచి డిస్కౌంట్‌తో లభిస్తోంది. కాబట్టి కొత్త వాషింగ్ మెషీన్ కొనాలనుకునే వారు వెంటనే ఆర్డర్ చేసుకోండి.
ధర: సుమారు రూ.9,490
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను ఉపయోగించుకుంటే.. ఈ వాషింగ్ మెషీన్లను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. మీ కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి సరైన కెపాసిటీ .. ఉన్న మెషీన్‌ను ఇప్పుడే ప్లాన్ చేసుకోండి.