Delhi: ప్రజలకు సేవ చేసినప్పుడు విమర్శలు వస్తాయని, వాటిని ఏ మాత్రం పట్టించుకోనని తేల్చేశారు ప్రధాని నరేంద్రమోదీ. వాటిని పట్టించుకుంటే ముందుకు అడుగు వేయలేమన్నారు. ఒకే లక్ష్యం కోసం పని చేస్తున్నప్పుడు ఎప్పటికీ అలసిపోనని అన్నారు. భారత్ అభివృద్ది నా జీవిత ఆశయమని తేల్చేశారు. దేశాన్ని అభివృద్ధి చేసేటప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కుంటానని, సంకల్ప బలం ఉంటే దేనినైనా సాధించ వచ్చన్నారు. ప్రజాసేవలో 25 ఏళ్లు అంటే ఒక విజయంగానే కాదు, సేవగా భావిస్తానన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ పాతికేళ్లు ప్రజా సేవ పూర్తి చేసిన సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ, ప్రజా ఆశీర్వాద బలం తనను ఇంతకాలం నడిపించదన్నారు. గురజాత్ సీఎంగా ప్రమాణం చేసినప్పుడు ఇంతగా ఆలోచించలేదన్నారు. 25 ఏళ్లుగా నిరంతర ప్రజా సేవ అందిస్తానని ఆనాడు ఊహించలేదన్నారు. ఆశీస్సులు అందించిన దేశ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరించారు.
నన్ను ఇంతగా ఆదరిస్తున్న ప్రజలను ఎప్పటికీ మరచిపోలేనని, ప్రజాసేవ చేసేందుకు భగవంతుడు శక్తిని ఇచ్చారన్నారు. ప్రజలు-భగవంతుడి ఆశీస్సులతో దేశానికి మరింత సేన చేస్తానని తేల్చిచెప్పారు. నాదీర్ఘకాల ప్రజాసేవకు ఎంతో మంది మద్దతుగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. నేను నిరంతరం విద్యార్థిగానే ఆలోచిస్తానని, ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకునేందుకు తపన పడుతుంటానని అన్నారు.
అడవుల్లో గిరిజన సమాజాలకు సేవ చేయడంలో నా సమయాన్ని గడిపానని వివరించారు ప్రధాని. ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించి తీరుతామన్నారు. ఆత్మనిర్బర్ భారత్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ సాధ్యమేనన్నారు. అంతరిక్షంలో అడుగుపెట్టడం, ఒలింపిక్స్ నిర్వహణ ఇలాంటివన్నీ సాధ్యమేనన్నారు. సేవ చేయాలనన తపనతో బీజేపీలో సంస్థాగత బాధ్యతల మార్గాన్ని ఎంచుకున్నానని మనసులోని మాట బయటపెట్టారు. నూతన చరిత్ర లిఖించే సమయం ఆసన్నమైందన్నారు. అన్ని రంగాల్లో నూతన ఆవిష్కరణలకు ఇదే సమయమన్నారు. సమస్యలు వస్తాయని, పరిష్కారం కూడా దాని వెంటే ఉంటుదన్నారు.
ALSO READ: సీఎంగా మొదలై ప్రధానిగా.. 25 ఏళ్ల మోదీ ప్రస్థానంపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు!
ఇప్పుడు ప్రపంచమంతా దేశ పైలెట్ స్మిత్ మచ్చర్ పై చర్చ జరుగుతోందన్నారు. భారతీయ పైలెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని కొనియాడారు. ఒక రోజు భారత్ తయారీ విమానంపై ప్రపంచమంతా మాట్లాడుతుందన్నారు. భారత్ తన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి తెలియజెప్పే పరిస్థితి ఎంతో దూరం లేదన్నారు. భారత్ అభివృద్దిలో పరుగులు పెడుతోందని, దాన్ని ఎవరూ ఆపలేరన్నారు. ఒకప్పుడు ఉగ్రవాదం పెనుముప్పుగా మారిందని, దేశ భద్రతకు ముప్పు వస్తే ప్రతిఘటన ఎలా ఉంటుందో చూపించామన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదని, అలా అనుకుంటే ఎప్పుడో వచ్చేవాణ్ని అని అన్నారు.